Guppedantha Manasu November 29th Episode: వసుధారను ఆటపట్టించిన రిషి - టీ కాచిన ఎండీ - మహేంద్రకు అనుపమ క్లాస్
Guppedantha Manasu November 29th Episode: వసుధార కేసును ఫాస్ట్‌గా సాల్వ్ చేసిన నువ్వు జగతిని చంపిన వారిని పట్టుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావని రిషిని నిలదీస్తుంది అనుపమ. ఆమె ప్రశ్నలకు రిషి హర్ట్ అవుతాడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu November 29th Episode: రిషి తెలివితేటలతో చిత్ర కేసు నుంచి బయటపడుతుంది వసుధార. ఆమెను జైలుకు పంపించాలని శైలేంద్ర వేసిన ఎత్తును రిషి చిత్తుచేస్తాడు. ఈ కేసు నుంచి బయటపడటంతో వసుధార ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. రిషి చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు ఇస్తుంది. కేసు నుంచి బయటపడేసినందుకు తనకు ఈ రూపంలో స్పెషల్ థాంక్స్ చెప్పావా అని వసుధారను అడుగుతాడు రిషి.
వసుధార భయం...
నా వల్ల చిత్ర సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఆమె తల్లిదండ్రులు చెప్పడం, నాకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతో ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినంత పనైపోయిందని వసుధార ఎమోషనల్ అవుతుంది. చాలా భయపడిపోయానని రిషితో అంటుంది. నువ్వు భయపడ్డావంటే నమ్మశక్యంగా లేదని రిషి అంటాడు. యూత్ ఐకాన్ భయపడటం ఏమిటని ఆటపట్టిస్తాడు.
అతడి మాటలతో వసుధార అలుగుతుంది. నా వల్ల ఒక అమ్మాయి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించిందనే నిందను భరించలేకపోయానని రిషితో చెబుతుంది వసుధార. నువ్వు భయపడకు వసుధార...నీ వెంట నేనొస్తానని మీరు చెప్పారు. మీ మాట విన్నాకా...మీ ముఖంలో నిబ్బరం చూసిన తర్వాతే ధైర్యం వచ్చిందని అంటుంది.
అనుపమ వల్లే...
ఒక రకంగా థాంక్స్ చెప్పుకోవాల్సింది అనుపమకే అని అంటాడు రిషి. బెయిల్ విషయంలో ఆమె హెల్ప్ చేయబట్టే ఈ కేసులో ఏ దిశగా అడుగులు వేయాలో...నేరస్తులను ఎలా పట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. అలా ఆలోచించే ఆ క్రిమినల్స్‌ను పట్టుకోగలిగానని అంటాడు రిషి. నేను నీ పక్కన ఉండగా నిన్ను ఎవరూ టచ్ చేయలేరని రిషి అంటాడు. అలా టచ్ చేయాలంటే నన్ను దాటాలని వసుధారకు చెబుతాడు. రిషి నీ భార్త మాత్రమే కాదు...నీ జీవితానికి, భవిష్యత్తుకు సర్వస్వానికి కాపలా అంటూ చేతిలో చేయివేసి వసుధారకు మాటిస్తాడు రిషి.
స్టూడెంట్ కాదు ఎండీ....
అనుపమకు ఫోన్ చేసిన మహేంద్ర ఆమెను ఇంటికి రమ్మని పిలుస్తాడు. మహేంద్ర ఇంటికి ఎందుకు రమ్మన్నాడా అని అనుపమ ఆలోచిస్తుంటుంది. మరోవైపు కాలేజీ నుంచి ఇంటికి వస్తోన్న సమయంలో చిత్ర కేసులో తనను ఇరికించింది ఎంఎస్ఆర్ అని వాసన్ చెప్పిన మాటలను వసుధార నమ్మదు. ఈ కుట్ర వెనుక ఇంకెవరో ఉన్నారని అనుకుంటుకుంది.
ఎంఎస్ఆర్‌ను పట్టుకుంటే అసలైన నేరస్తుడు ఎవరో తెలుస్తుందని రిషి అనుకుంటాడు. ఇంతలో ఓ టీస్టాల్ రావడంతో రిషి, వసుధార కలిసి టీ తాగడానికి దిగుతారు. టీ ఎలా ప్రిపేర్ టీస్టాల్ ఓనర్‌కు సలహాలు ఇస్తుంది వసుధార. అది చూసి నువ్వు ఇప్పుడు స్టూడెంట్ వసుధారవు కాదు. కాలేజీ ఎండీవీ అంటూ అందుకు తగ్గట్లుగా హుందాగా ఉండాలని క్లాస్ ఇస్తాడు రిషి.
టీ పెట్టిన వసు
రిషి మాటలతో అలిగిన వసుధార టీ స్టాల్‌లో తానే స్వయంగా టీ పెట్టి రిషికి ఇస్తుంది. ఆమె పెట్టిన టీ చూసి టీ స్టాల్ ఓనర్ కూడా ఇంప్రెస్ అవుతాడు. రిషిని గుర్తుపట్టిన ఆ టీస్టాల్ ఓనర్ అతడితో సెల్ఫీ దిగాలనుందని రిక్వెస్ట్ చేస్తాడు. మీకు మా పిల్లలు పెద్ద ఫ్యాన్ అని చెబుతాడు. సెల్ఫీ వరకేనా పెద్ద బ్యానర్ కట్టి మీ టీస్టాల్ ముందు పెడతారా అంటూ అతడితో అంటుంది వసుధార. ఆ ఐడియానే ఫాలో అవుతా...నా టీస్టాల్ గిరాకీ కూడా పెరుగుతుందని అతడు అంటాడు. ఆ పని మాత్రం చేయద్దని, నీ కష్టాన్నే నమ్ముకోమని అతడికి సలహా ఇస్తాడు రిషి.
అనుపమ ప్రశ్నలు...
ఆ తర్వాత తన ఇంటికి వచ్చిన అనుపమకు థాంక్స్ చెబుతాడు మహేంద్ర. నువ్వు వసుధారకు బెయిల్ ఇవ్వడం వల్లే ఈ కేసు గురించి రిషికి ఎంక్వైరీ చేసే సమయం దొరికిందని అంటాడు. ఇందుకే పిలిచావా అని మహేంద్రను అడుగుతుంది అనుపమ. ఇంకా ఉంది అని మహేంద్ర మరో విషయం చెప్పబోతుండగా రిషి వస్తాడు.
చిత్ర కేసులో అసలైన దోషులు దొరికారని అనుపమతో అంటాడు రిషి. వసుధారపై పడిన నింద తొలిగింది..తను ఏ తప్పు చేయలేదని తేలిపోయిందని అనుపమకు చెబుతాడు రిషి. ఇప్పుడు తనకు చాలా హ్యాపీగా ఉందని అంటాడు. నీ భార్యపై వచ్చిన నిందను తొందరగానే తుడిచేశావు. తన నిజాయితీని తొందరగానే నిరూపించావు. కానీ మీ అమ్మను చంపిన వాళ్లను పట్టుకోవడానికి ఎందుకు నీకు ఇంత ఆలస్యమవుతుందని రిషిని ప్రశ్నిస్తుందిఅనుపమ. ఆమె ప్రశ్నతో రిషి షాక్ అవుతాడు.
కేసు ఎందుకు కొలిక్కి రాలేదు...
అమ్మను చంపినవాళ్లను పట్టుకొని శిక్షించాలని నీకు అనిపించడం లేదా అని నిలదీస్తుంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నానని రిషి బదులిస్తాడు. మరి ఇంత వరకు ఆ కేసు ఎందుకు కొలిక్కి రాలేదని రిషిని అడుగుతుంది అనుపమ. వసుధార పై నిన్న నిందపడితే ఈ రోజు తన తప్పు లేదని నిరూపించారు. భార్య విషయంలో అంత ఫాస్ట్‌గా ఉన్న నువ్వు..అమ్మ విషయంలో ఎందుకు చురుకుగా లేవని రిషిని నిలదీస్తుంది అనుపమ.
నీ కోడలు ఏ తప్పు చేయలేదని ఇంటికి పిలిచి గర్వంగా చెబుతోన్న నీవు నీ భార్యను చంపిన ఎందుకు పట్టుకోలేకపోయావు మహేంద్రను గట్టిగా అడుగుతుంది అనుపమ. మీ అమ్మ చావును ఎందుకు అంత తేలిగ్గా తీసుకుంటున్నావు మహేంద్రను అడుగుతుంది అనుపమ. వసుధార కేసులో క్లూ దొరికింది కాబట్టి ముందుకు వెళ్లగలిగానని అంటాడు రిషి. అమ్మ కేసులో క్లూ దొరకపోతే అలాగే వదిలేస్తావా అని రిషిని ప్రశ్నిస్తుంది అనుపమ.
వసుధారకు క్లాస్...
జగతి నిన్ను కాలేజీలో చేర్పించింది. . తన కొడుకును ఇచ్చి పెళ్లి చేసింది. నీ ఉన్నతికి పాటుపడిన జగతిని చంపిన వారిని నువ్వైనా చొరవ తీసుకొని పట్టుకోవచ్చుగా అంటూ వసుధారకు క్లాస్ ఇస్తుంది అనుపమ. జగతిని చంపిన వాళ్లను పట్టుకుంటే కనీసం ఆమె ఆత్మ అయినా శాంతిస్తుంది. జగతిపై నీకు ప్రేమ, అభిమానం ఉంటే ఆధారాలు దొరికించుకో...నా జగతిని చంపింది ఎవరో నాకు తెలియాలి అంటూ రిషిని అడుగుతుంది అనుపమ.
అమ్మ హత్య విషయంలో మేము ఏం చేయలేదని మీరు చాలా అపోహపడుతున్నారని అనుపమకు సీరియస్‌గా బదులిస్తాడు రిషి. పైకి మామూలుగా కనిపిస్తున్నా కానీ లోలోన కుంగిపోతున్నామని రిషి ఎమోషనల్ అవుతాడు. తాగుడికి బానిసగా మారిన తండ్రిని మార్చడం కోసం బాధను మనసులోనే దాచుకున్నాం.
మీరు చెప్పిన చెప్పకపోయినా ఆ హంతకుడిని నేను పట్టుకుంటాను. ఓ స్నేహితురాలిగానే మీకు అంత బాధ ఉంటే...జగతి నాకు జన్మనిచ్చిన తల్లి నాకు ఎంత బాధ ఉండాలి. అమ్మ మరణానికి న్యాయం జరిగితీరుతుంది. వాటి ఫలితం రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది అని అనుపమకు ఆన్సర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. అతడిని వసుధార అనుపరిస్తుంది.