Guppedantha Manasu December 25th Episode: శైలేంద్రకు వసు కౌంటర్ - పోలీసులకు దొరికిన రిషి డెడ్‌బాడీ - మహేంద్ర షాక్
Guppedantha Manasu December 25th Episode: వసుధార, అనుపమలపై రౌడీలతో ఎటాక్ చేయిస్తాడు శైలేంద్ర. వారిని చంపించాలని అనుకుంటాడు. కానీ ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి వారిని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu December 25th Episode: రిషి రౌడీల బారి నుంచి తప్పించుకోవడంతో శైలేంద్ర టెన్షన్ పడతాడు. రిషిని తానే కిడ్నాప్ చేసినట్లు వసుధార దగ్గర పక్కా ఆధారం ఉండటంతో ఆమెను చంపేందుకు రౌడీలతో కలిసి స్కెచ్ వేస్తాడు. కానీ అతడి ప్లాన్ రివర్స్ అవుతుంది. కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి వసుధారతో పాటు అనుపమను సేవ్ చేస్తాడు. రౌడీలను చితకబాదుతాడు. అతడి దెబ్బలకు తాళలేక రౌడీలు పారిపోతారు.
తమ ప్రాణాలను కాపాడిన వ్యక్తికి వసుధార, అనుపమ థాంక్స్ చెబుతారు. అతడు వారిని వంద రూపాయలు అడుగుతారు. కానీ అనుపమ ఐదు వందలు ఇస్తుంది. తనకు ఐదు వందలు వద్దు...వంద రూపాయలు మాత్రమే కావాలని చెప్పి తీసుకుంటాడు. వసుధార కార్ టైర్ పంక్చర్ కావడంతో అతడే కారును బాగు చేస్తాడు.
శైలేంద్రకు వార్నింగ్...
తమపై ఎటాక్ చేయించింది శైలేంద్రనే అని వసుధార, అనుపమ డౌట్ పడతారు. శైలేంద్రకు ఫోన్ చేస్తుంది వసుధార. ఈ పాటికి వసుధార చనిపోయి ఉంటుందని శైలేంద్ర అనుకుంటాడు. కానీ ఆమె నుంచి ఫోన్ రావడంతో కంగారు పడతాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఈ పాటికి చనిపోయి ఉండాల్సింది ఎలా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా అంటూ ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే శైలేంద్రపై సెటైర్ వేస్తుంది వసుధార.
మాపై నువ్వే ఎటాక్ చేశావని నాకు తెలుసు అంటూ శైలేంద్రపై సీరియస్ అవుతుంది. ఈ ఎటాక్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని శైలేంద్ర డ్రామా ఆడుతాడు. నీ ఓవర్‌యాక్షన్ నా దగ్గర చూపించకు అంటూ శైలేంద్రకు వార్నింగ్ ఇస్తుంది వసుధార.
రెండు రోజులు గడువు...
ఇప్పటివరకు పక్కా ఆధారాలు లేవు కాబట్టి సైలెంట్‌గా ఉన్నాం. నువ్వు రిషిని కిడ్నాప్ చేసిన వీడియో నా దగ్గర ఉంది. అది ముకుల్‌కు పంపిస్తే జైలుకు వెళతావని, చిప్పకూడు తింటూ బతకాల్సివస్తుందని శైలేంద్రను బెదిరిస్తుంది వసుధార.
రెండు రోజుల్లో రిషిని తీసుకురాకపోతే ముకుల్‌కు వీడియోను పంపిస్తానని, రిషికి చిన్నచీమ కుట్టిన నీదే బాధ్యత...మొన్న చెంపదెబ్బతో వదిలేశాను. ఈ సారి మాత్రం అలా వదిలేయనని హెచ్చరిస్తుంది. వసుధార వార్నింగ్‌తో శైలేంద్ర భయపడిపోతాడు. వసుధారను కాపాడింది ఎవరా అని ఆలోచిస్తాడు. తన ఫోన్ ట్యాప్‌లో ఉండటంతో రౌడీలకు కాల్ చేయలేకపోతాడు.
రిషి ఫోన్ కాల్...
అప్పుడే రిషి ఫోన్ నుంచి వసుధారకు కాల్ వస్తుంది. రిషినే ఫోన్ చేశాడనుకొని వసుధార ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లతోనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కానీ అవతలివైపు నుంచి రిషి కాకుండా మరో గొంతు వినిపిస్తుంది. తమ హాస్పిటల్‌లో జాయిన్ అయిన వ్యక్తి దగ్గర ఈ ఫోన్ ఉందని, చిన్న ఐడెంటిఫికేషన్ కోసం హాస్పిటల్‌లో రావాలని చెబుతాడు. దాంతో వసుధార, అనుపమ కంగారు పడతారు. ఇదే విషయం మహేంద్రకు చెప్పి నువ్వు కూడా హాస్పిటల్‌కు రావాలని అంటుంది అనుపమ. ముగ్గురు కంగారుగా హాస్పిటల్‌కు వస్తారు. రౌడీల బారి నుంచి వసుధారను సేవ్ చేసిన వ్యక్తి కూడా వారితో పాటు హాస్పిటల్‌కు వస్తాడు.
రిషిదేనా డెడ్‌బాడీ..
హాస్పిటల్‌లో పోలీసులు ఉంటారు. ఓ ఫోన్ చూపించి ఇది ఎవరిదని అడుగుతారు. అది రిషి ఫోన్ అని చెబుతుంది వసుధార. ఈ ఫోన్ మాకు ఓ డెడ్‌బాడీ దగ్గర దొరికిందని పోలీసులు చెబుతారు. వారి మాటలు వసుధార, మహేంద్ర షాకవుతారు. ఆ డెడ్ బాడీ నీ భర్తదో కాదో ఐడెంటీఫై చేయాలని పోలీసులు చెబుతారు.
అది నా భర్త డెడ్ బాడీ కాదని, అతడు చనిపోలేదని, తాను ఆ డెడ్ బాడీ చూడనని వసుధార పోలీసులతో వాదిస్తుంది. కానీ అది ఫార్మాలిటీ అని, తప్పకుండా చూడాలని పోలీసులు చెబుతారు. దాంతో కన్నీళ్లతోనే మార్చురీలో అడుగుపెడతారు వసుధార, మహేంద్ర. డెడ్‌బాడీపై ఉన్న ముసుగును పోలీసులు తొలగిస్తారు. డెడ్ బాడీని చూసిన అనుపమ రిషి కాదని చెబుతుంది. దాంతో వసుధార, మహేంద్ర రిలీఫ్‌గా ఫీలవుతారు.
డెడ్ బాడీ ఛేంజ్...
అప్పుడే మార్చురీలో పనిచేసే వ్యక్తి డెడ్ బాడీ మారిపోయిందని చెప్పి ట్విస్ట్ ఇస్తాడు. మరో డెడ్ బాడీ దగ్గర ఈ ఫోన్ దొరికింది అని అంటాడు. దాంతో మళ్లీ వసుధార, మహేంద్ర టెన్షన్ పడతారు. ఆ డెడ్ బాడీ కూడా రిషిది కాపోవడంతో వారి టెన్షన్ మొత్తం పోతుంది.
వసుధారతో పాటు వచ్చిన కొత్త వ్యక్తితో పాటు మహేంద్ర పోలీసులు చూడకుండా సీక్రెట్‌గా డెడ్ బాడీ ఫొటో తీస్తారు. మరోవైపు తీవ్ర గాయాల పాలైన రిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటాడు. ఓ అటవీ ప్రాంతంలో అతడి చెట్ల మందులతో ట్రీట్‌మెంట్ జరుగుతుంది. ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన రిషి...వసుధార అని గట్టిగా పిలుస్తాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.