Guppedantha Manasu Today Episode: మనుకు ఎదురుతిరిగిన వసు - కొడుకు జోలికి రావొద్దంటూ అనుపమ వార్నింగ్ - మహేంద్ర ఫైర్
Guppedantha Manasu April 3rd Episode: మను తండ్రి ఎవరో చెప్పమని అనుపమను నిలదీస్తాడు మహేంద్ర. అతడు ఎన్ని ప్రశ్నలు వేసిన అనుపమ సమాధానం చెప్పదు. తల్లిపై మహేంద్ర డామినేషన్ చేయడం మను సహించలేకపోతాడు.ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu April 3rd Episode: తండ్రి ఎవరో తెలియకపోవడం మను లోపమని మహేంద్ర నోరుజారుతాడు. అతడి మాటలతో మను హర్ట్ అవుతాడు. మహేంద్రను రెచ్చగొట్టి అతడి చేత అలా మాట్లాడించేలా చేస్తాడు శైలేంద్ర. మహేంద్ర, శైలేంద్ర మాటలను భరించలేక కోపంగా మను కాలేజీ నుంచి వెళ్లిపోతాడు. తాను ఎలాంటి తప్పు చేయకున్న శిక్షను అనుభవించడం సహించలేకపోతాడు.
దేవయాని ప్లాన్...
మను, శైలేంద్ర మధ్య జరిగిన గొడవ గురించి అనుపమకు ఫోన్ చేసి చెబుతుంది దేవయాని. మనును మహేంద్ర కూడా అవమానించాలని, ఆ టైమ్‌లో మనుకు దెబ్బ తగిలితే తన కొడుకే ట్రీట్‌మెంట్ ఇచ్చాడని అనుపమతో అంటుంది దేవయాని. ఆమె ప్లాన్‌ను అనుపమ కనిపెట్టేస్తుంది. నా కొడుకును ఇబ్బంది పెట్టాలని, బాధపెట్టాలని మీరు, శైలేంద్ర కావాలని కలిసి నాటకం ఆడుతున్నారని అర్థమవుతుందని దేవయానితో అంటుంది అనుపమ.
కావాలని చేస్తే చిన్నగాయంతో మను ఎలా వదిలేస్తామని అనుకుంటున్నావని అనుపమను భయపెడుతుంది దేవయాని. మేము తలచుకుంటే నీ కొడుకు ప్రాణాలతో ఉండేవాడు కాదని హెచ్చరిస్తుంది. దేవయాని బెదిరింపులకు అనుపమ భయపడదు.
అనుపమ వార్నింగ్....
ఈ మాట ఫోన్‌లో అన్నారు కాబట్టి సరిపోయింది. నా ఎదురుగా ఉంటే ముఖం పగలగొట్టేదానిని అని దేవయానికి వార్నింగ్ ఇస్తుంది అనుపమ. ఇంకోసారి నా కొడుకు దగ్గర వాడి తండ్రి ప్రస్తావన తీసుకొస్తే బాగుండదని చెబుతుంది. ఎగ్జామ్స్‌లో అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్స్ వస్తేనే నా కొడుకు ఊరుకోడు. అలాంటిది లైఫ్‌లో వాడు ఎక్స్‌పెక్ట్ చేయని ప్రశ్నలు ఎదురైతే...వాటిని అడగటానికి నీ కొడుకు ఉండదు. మనుతో పెట్టుకోవద్దని శైలేంద్రకు చెప్పమని అని ఫోన్ కట్ చేస్తుంది అనుపమ.
మహేంద్ర ఫైర్...
కోపంగా ఇంటికొస్తాడు మహేంద్ర. ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేసి ఇక్కడ నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా అంటూ వచ్చి రావడంతోనే అనుపమపై ఫైర్ అవుతాడు మహేంద్ర. ఎందుకు నీ గతాన్ని దాస్తున్నావు. నీ భర్త గురించి ఎందుకు చెప్పడం లేదని అనుపమను నిలదీస్తాడు. నీ భర్త గురించి చెప్పేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని పట్టుపడతాడు. నీ భర్త ఎక్కడున్నాడు, నువ్వు వచ్చి ఇన్ని రోజులు అయినా అతడు ఇక్కడికి ఎందుకు రాలేదని అనుపమను ప్రశ్నిస్తాడు మహేంద్ర.
మను అవమానాలు...
తండ్రి పేరుతో మను ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నాడని అనుపమతో అంటాడు మహేంద్ర. ఏ అప్లికేషన్‌లో అయినా సన్నాఫ్ అని ఉంటుందని, అక్కడ మను ఏ పేరు రాయాలో చెప్పమని నిలదీస్తాడు. మను గుండెల్లో దాచుకున్న బాధను నీ ముందు ఉంచుతున్నానని, నిజంగా మన స్నేహంపై నీకు నమ్మకం, విలువ ఉంటే మను తండ్రి ఎవరో చెప్పమని అనుపమను అడుగుతాడు మహేంద్ర.
మనుకు కాలేజీలో చాలా దారుణమైన అవమానం జరిగిందని అనుపమతో అంటాడు మహేంద్ర. అవన్నీ నాకు తెలుసునని అనుపమ బదులిస్తుంది. ఆమె మాటలతో వసుధార, మహేంద్ర షాకవుతారు. కొడుకుకు గాయమైందని తెలిసి కూడా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావని , నీలాంటి తల్లిని ఎక్కడ చూడలేదని మహేంద్ర అంటాడు.
అనుపమ మౌనం...
మహేంద్ర ఎంత అడిగినా మను తండ్రి ఎవరన్నది అనుపమ చెప్పదు. చెప్పను, చెప్పలేనని అంటుంది. ఆ రహస్యాన్ని దాచడం చాలా అవసరం అని అంటుంది. ఒక్కసారి సాటి మనిషిగా ఆలోచిస్తే మను పడుతోన్న బాధ వేదన అర్థమవుతుందని అనుపమకు నచ్చచెప్పడానికి మహేంద్ర ప్రయత్నిస్తాడు.
కాలేజీలో తండ్రి గురించి వచ్చిన డిస్కషన్‌లో తాను నోరు జారి మనును ఓ మాట అన్నానని, ఆ మాటకు మను కంటే తానే ఎక్కువగా బాధపడుతున్నానని మహేంద్ర అంటాడు. నువ్వు మౌనంగా ఉండటం వల్ల, నోరు తెరవకపోవడం వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయని అనుపమపై ఫైర్ అవుతాడు మహేంద్ర.
మహేంద్ర ఆవేశాన్ని కంట్రోల్ చేసేందుకు వసుధార ప్రయత్నిస్తుంది. అయినా మహేంద్ర ఆమె మాట వినడు. ఎవరు నీ భర్త, మను తండ్రి ఎవరు చెబుతావా లేదా అని కోపంగా అంటాడు. అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన మను...చెప్పాల్సిన అవసరం లేదని అంటాడు. తను చెప్పాలని అనుకుంటే చెబుతుంది. నాకే చెప్పలేదంటే మీకెందుకు చెబుతుంది. అమ్మను బెదిరించినట్లుగా, భయపెట్టినట్లుగా కరెక్ట్ కాదని మహేంద్రతో అంటాడు మను.
సీరియస్ కావడం నచ్చలేదు...
నీ గురించి అనుపమను నిలదీస్తున్నానని మనుతో అంటాడు మహేంద్ర. నా బాధలు, అవమానాలు నాకే వదిలేయమని మహేంద్రకు బదులిస్తాడు మను. అనుపమపై మీరు ఇంత సీరియస్ కావడం నాకు నచ్చలేదని చెబుతాడు. మీరు తనపై పెత్తనం చెలాయిస్తానంటే ఊరుకోనని చెబుతాడు.
అనుపమను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతానని అంటాడు. అనుపమ ఎక్కడికి రాదని, ఇక్కడే ఉంటుందని మనుకు ప్రశ్నలకు వసుధార సమాధానమిస్తుంది. ఒకవేళ మీరు తీసుకెళతానని అంటే మీరు ఆమెను అమ్మ అని పిలిచిరోజు నిరభ్యంతరంగా తీసుకోళ్లవచ్చని, ఆరోజు మిమ్మల్ని మేము ఆపమని మనుతో అంటుంది వసుధార.
మను ఎమోషనల్...
వసుధార మాటలతో మను ఎమోషనల్ అవుతాడు. నన్ను ఇంకోసారి అమ్మ అని పిలిస్తే నేను చచ్చినంత ఒట్టు అని అనుపమ చేసిన ప్రామిస్ గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు. వసుధార ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు మను. అనుపమను అమ్మ అని పిలవలేని తన దుస్థితిని తలచుకొని మను ఎమోషనల్ అవుతాడు.
మహేంద్ర అన్ని ప్రశ్నలు అడుగుతున్నా తల్లి తలదించుకోవడం సహించలేకపోతాడు. తల్లికి అండగా నిలబడలేని కొడుకుగా తాను బతికి ఉండి ఏ ప్రయోజనం అని బాధపడతాడు. తల్లిని తన వెంట తీసుకురాలేకపోయానని విలవిలలాడుతాడు. కన్నతండ్రి ఎవరో తెలియకుండా, కన్న తల్లిని అమ్మ అని పిలవకుండా ఇలా ఎన్నాళ్లు బాధలు, అవమానాలతో బతకాలని బాధపడతాడు.
విశ్వనాథం ఎంట్రీ...
ఏంజెల్‌కు ఫోన్ చేస్తాడు విశ్వనాథం, మనవరాలి యోగక్షేమాలు కనుక్కుంటాడు. ఆ తర్వాత అనుపమపై జరిగిన ఎటాక్ గురించి తాతయ్యకు చెబుతుంది ఏంజెల్. ఆమె చెప్పిన మాటలు విని విశ్వనాథం షాకవుతాడు. అనుపమ దగ్గరకు బయలుదేరబోతాడు. అతడిని ఏంజెల్ వారిస్తుంది. తానే ఇంటికి వస్తానని అంటుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.