Guppedantha Manasu December 7th Episode: దొర‌క‌ని రిషి ఆచూకీ - భ‌ర్త కోసం వ‌సు ఆరాటం - అనుప‌మ‌కు మ‌హేంద్ర క్లాస్‌-guppedantha manasu december 7th episode mahindra fires on anupama about rishi disappearance ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu December 7th Episode: దొర‌క‌ని రిషి ఆచూకీ - భ‌ర్త కోసం వ‌సు ఆరాటం - అనుప‌మ‌కు మ‌హేంద్ర క్లాస్‌

Guppedantha Manasu December 7th Episode: దొర‌క‌ని రిషి ఆచూకీ - భ‌ర్త కోసం వ‌సు ఆరాటం - అనుప‌మ‌కు మ‌హేంద్ర క్లాస్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 07, 2023 08:39 AM IST

Guppedantha Manasu December 7th Episode: రిషి క‌నిపించ‌కుండా పోవ‌డంతో వ‌సుధార భ‌య‌ప‌డుతుంది. అత‌డి కోసం వెత‌క‌డం మొద‌లుపెడుతుంది. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu December 7th Episode: రిషి క‌నిపించ‌క‌పోవ‌డంతో వ‌సుధార టెన్ష‌న్ ప‌డుతుంటుంది. రిషి ఫోన్ స్విఛాఫ్ కావ‌డం, అచూకీ గురించి ఎలాంటి క్లూ ల‌భించ‌క‌పోవ‌డంతో ఎమోష‌న‌ల్ అవుతుంది. వారిద్ద‌రి ప‌రిస్థితి అర్థం చేసుకోకుండా వ‌సుధార‌ను ప్ర‌శ్న‌ల‌తో అనుప‌మ ఇబ్బంది పెడుతుంది. అది చూసి మ‌హేంద్ర ఫైర్ అవుతాడు. రిషి క‌నిపించ‌క‌పోతే కూల్‌గా ఎలా ఉన్నావ‌ని మ‌హేంద్ర‌తో అంటుంది అనుప‌మ‌. పోలీస్ స్టేష‌న్ వెళ్లి కంప్లైంట్ ఇవ్వ‌మ‌ని అంటుంది. రిషి చిన్న‌పిల్లాడేం కాద‌ని మ‌హేంద్ర అంటాడు. అత‌డు క‌నిపించ‌కుండా పోయి ఒక్క రోజు కూడా కాలేద‌ని చెబుతాడు.

జ‌గ‌తి ఉంటే ఇలా జ‌రిగేది కాదు...

ఇంట్లో గొడ‌వ‌లు జ‌రిగిన‌ప్పుడు రిషి బ‌య‌ట‌కు వెళ్లి ఒక్కోసారి రెండు, మూడు రోజుల త‌ర్వాత తిరిగొచ్చేవాడ‌ని అనుప‌మ‌తో అంటాడు మ‌హేంద్ర‌. జ‌గ‌తి లేని టైమ్‌లోనే అలా జ‌రిగి ఉంటుంద‌ని, జ‌గ‌తి ఉంటే రిషిని అలా బ‌య‌ట‌కు వెళ్ల‌నిచ్చేది కాదు అనుప‌మ చెబుతుంది. వెళ్లినా అంత ఈజీగా వ‌ద‌లిపెట్టేది కాదు. బ‌య‌ట‌కు వెళ్లిన వాడు వ‌స్తాడ‌ని ఆశ‌తో ఎదురుచూడ‌టం వేరు అని అంటుంది.

ఎప్పుడ‌స్తాడో అని కంగారుగా ఎదురుచూడ‌టం వేరు. జ‌గ‌తి ఉన్న‌ప్పుడు రిషి కోసం త‌ను ప‌డిన తాప‌త్ర‌యం చూసి ఉంటే త‌న బిడ్డ కోసం త‌ల్లి ప‌డే ఆరాటం ఏమిటో అర్థ‌మ‌య్యేది అంటూ మ‌హేంద్ర‌కు క్లాస్ ఇస్తుంది అనుప‌మ‌. వ‌సుధార చాలా టెన్ష‌న్ ప‌డుతుంద‌ని, ఆమె కోస‌మైనా పోలీస్ కంప్లైంట్ ఇద్దామ‌ని మ‌హేంద్ర‌కు చెబుతుంది అనుప‌మ‌. ఈ రాత్రి చూసి త‌ర్వాత రోజు ఉద‌య‌మే పోలీసుల‌కు కంప్లైంట్ ఇద్దామ‌ని వ‌సుధార‌ను క‌న్వీన్స్ చేస్తాడు మ‌హేంద్ర‌.

వ‌సుధార డీలా...

వ‌సుధార బేలగా మారిపోవ‌డం చూసి అనుప‌మ కంగారు ప‌డుతుంది. నిన్ను ఇలా ఎప్పుడూ చూడ‌లేద‌ని వ‌సుధార‌తో అంటుంది. చాలా ధైర్యంగా మాట్లాడుతుంటావ్‌. ఎలాంటి సిట్యూవేష‌న్‌లోనైనా చాలా పాజిటివ్‌గా ఉంటావు. కానీ రిషి క‌నిపించ‌క‌పోయేస‌రికి ఇలా దిగాలుప‌డ‌టం నాకు న‌చ్చ‌లేద‌ని వ‌సుధార‌కు ధైర్యం చెబుతుంది అనుప‌మ‌.

వ‌సుధార ఆలోచ‌న‌లు...

రిషి త‌న‌కు చెప్ప‌కుండా ఎక్క‌డికి వెళ్ల‌డ‌ని వ‌సుధార ఆలోచిస్తుంటుంది. అత‌డు పంపించిన మెసేజ్ మ‌ళ్లీ చ‌దువుతుంది. ఎలాంటి క్లూ ల‌భించ‌దు. శైలేంద్ర‌ను చూడ‌టానికి రిషి ఏమైనా హాస్పిట‌ల్‌కు వ‌చ్చాడా అని ధ‌ర‌ణికి ఫోన్ అడుగుతుంది. రిషి అక్క‌డ కూడా లేడ‌ని ధ‌ర‌ణి బ‌దులిస్తుంది. రిషి గురించి అనుప‌మ ఎంక్వైరీ చేయ‌డం మొద‌లుపెడుతుంది. రిషి క‌నిపించ‌కుండా పోవ‌డానికి, శైలేంద్ర మీద ఎటాక్ జ‌ర‌గ‌డానికి ఏదైనా సంబంధం ఉందా అని మ‌హేంద్ర‌ను అడుగుతుంది.

అనుప‌మ‌తో ఏం మాట్లాడితే ఎలాంటి గొడ‌వ‌లు వ‌స్తాయోన‌ని మ‌హేంద్ర కంగారు ప‌డ‌తాడు. ఏదైనా తెలిస్తే నువ్వు కుదురుగా ఉండ‌వ‌ని క్లాస్ పీకుతాడు. ఏ విష‌య‌మైనా ముందు వెనుక ఆలోచించి అడుగులు వేస్తే మంచిద‌ని అనుప‌మ‌కు స‌ల‌హా ఇస్తాడు. అందుకేనా న‌న్ను హాస్పిట‌ల్‌కు రావ‌ద్ద‌ని చెప్పావు. అందుకేనా శైలేంద్ర గురించి నాకు చెప్ప‌లేద‌ని మ‌హేంద్ర‌ను నిల‌దీస్తుంది అనుప‌మ‌.

ముకుల్‌కు ఫ్యామిలీ మెంబ‌ర్ అని న‌న్ను ప‌రిచ‌యం చేసి కేసు విష‌యాలు చెప్ప‌ద్ద‌ని ఎందుకు అన్నావ‌ని మ‌హేంద్ర‌ను గ‌ట్టిగా అడుగుతుంది అనుప‌మ‌. కానీ ఆమె ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా మ‌హేంద్ర మౌనంగా ఉండిపోతాడు. రిషి మిస్సింగ్ గురించి ఆలోచించి అవ‌స‌ర‌మైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వ‌మ‌ని చెప్పి అనుప‌మ అక్క‌డినుంచి వెళ్లిపోతుంది.

దేవ‌యాని టెన్ష‌న్‌...

ఫ‌ణీంద్ర దీర్ఘంగా ఆలోచించ‌డంతో దేవ‌యాని టెన్ష‌న్ ప‌డుతుంది. జ‌గ‌తి కేసు విష‌యంలో శైలేంద్ర వాయిస్ దొర‌క‌డం గురించే ఆలోచిస్తున్నాడేమోన‌ని భ‌య‌ప‌డుతుంది. ఆమె ఊహించినందే జ‌రుగుతుంది.జ‌గ‌తి మ‌ర్డ‌ర్ కేసు విష‌యంలో శైలేంద్ర వాయిస్ దొర‌క‌డం క‌లవ‌ర‌పెడుతుంద‌ని దేవ‌యానితో అంటాడు ఫ‌ణీంద్ర‌. . శైలేంద్ర హ‌త్య చేశాడ‌ని మీరు న‌మ్ముతున్నారా అని భ‌ర్త‌ను అడుగుతుంది దేవ‌యాని. చ‌ట్టానికి న‌మ్మ‌కాల‌తో ప‌ని లేద‌ని సాక్ష్యాలు మాత్ర‌మే కావాల‌ని అంటాడు ఫ‌ణీంద్ర‌. ఆ త‌ర్వాత ధ‌ర‌ణి ద్వారా రిషి క‌నిపించ‌డం లేద‌ని తెలిసి ఫ‌ణీంద్ర కూడా కంగారు ప‌డ‌తాడు.

వ‌సుధార మిస్సింగ్‌...

ఉద‌యం లేవ‌గానే రిషి వ‌చ్చాడేమోన‌ని ఇంట్లో వెతుకుతాడు మ‌హేంద్ర‌. రిషితో పాటు వ‌సుధార కూడా క‌నిపించ‌దు. అప్పుడే అనుప‌మ ఎంట్రీ ఇస్తుంది. రిషి ఇంటికి రాలేదు. ఇప్పుడు వ‌సుధార కూడా క‌నిపించ‌డం లేద‌ని మ‌హేంద్ర భ‌యంతో వ‌ణికిపోతాడు. . వ‌సుధార‌కు ఫోన్ చేస్తాడు మ‌హేంద్ర‌. వ‌సుధార ఫోన్ లిఫ్ట్ చేసి రిషి కోసం వెతుకుతున్నాన‌ని బ‌దులిస్తుంది. నువ్వ‌ క‌నిపించ‌కుండాపోయేస‌రికి నేను ఎంత కంగారు ప‌డ్డానో తెలుసా...గుండె ఆగినంతప‌నైంద‌ని మ‌హేంద్ర అంటాడు.

రిషి కోసం అన్వేష‌ణ‌...

రిషి కోసం కాలేజీకితో పాటు కొన్ని ప్లేస్‌ల‌కు వెళ్లాన‌ని కానీ అత‌డు ఎక్క‌డ క‌నిపించ‌డం లేద‌ని వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది. రిషి మిస్సింగ్ గురించి పోలీసుల‌కు కంప్లైంట్ ఇవ్వ‌డ‌మే మంచిద‌ని మ‌హేంద్ర కూడా నిర్ణ‌యించుకుంటాడు. ముకుల్‌కు ఫోన్ చేస్తాడు. రిషి ఇంకా ఇంటికి రాలేద‌ని, అత‌డి ఫోన్ ఇంకా స్విఛాఫ్ అని వ‌స్తుంద‌ని ముకుల్‌తో చెబుతాడు మ‌హేంద్ర‌. అత‌డి మాట‌లు విని ముకుల్ ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. మ‌రోవైపు రిషి కోసం త‌న‌కు తెలిసిన ప్లేస్‌లు అన్ని వెతుకుతుంటుంది వ‌సుధార‌.

Whats_app_banner