Guppedantha Manasu January 24th Episode: శైలేంద్ర గాలి తీసేసిన తండ్రి - దేవ‌యాని ప్లాన్ ఫెయిల్ - రిషి కోసం వ‌సు ఆరాటం-guppedantha manasu january 24th episode shailendra plans to ruin college fest organised by vasundhara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu January 24th Episode: శైలేంద్ర గాలి తీసేసిన తండ్రి - దేవ‌యాని ప్లాన్ ఫెయిల్ - రిషి కోసం వ‌సు ఆరాటం

Guppedantha Manasu January 24th Episode: శైలేంద్ర గాలి తీసేసిన తండ్రి - దేవ‌యాని ప్లాన్ ఫెయిల్ - రిషి కోసం వ‌సు ఆరాటం

Nelki Naresh Kumar HT Telugu
Jan 24, 2024 07:15 AM IST

Guppedantha Manasu January 24th Episode: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో కాలేజీలో జ‌రిగే యూత్ ఫెస్టివ‌ల్ బాధ్య‌త‌ల్ని వ‌సుధార‌కు కాకుండా శైలేంద్ర‌కు అప్ప‌గిస్తే బాగుండేద‌ని భ‌ర్త‌తో అంటుంది దేవ‌యాని. శైలేంద్ర‌కు చిన్న స‌మ‌స్య‌ను కూడా సాల్వ్ చేసే తెలివి లేద‌ని అంటాడు ఫ‌ణీంద్ర‌.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu January 24th Episode: కాలేజీలో జ‌రిగే యూత్ ఫెస్టివ‌ల్‌ను చెడ‌గొడుతాన‌ని వ‌సుధార‌ను బెదిరిస్తాడు శైలేంద్ర‌. ఈ ఈవెంట్‌ను ఫెయిల్ చేసి ఎండీగా వ‌సుధార‌ను అన్‌ఫిట్‌గా నిరూపిస్తాన‌ని ఛాలెంజ్ చేస్తాడు. శైలేంద్ర వార్నింగ్‌ల‌కు వ‌సుధార భ‌య‌ప‌డ‌దు. నోరు అదుపులో పెట్టుకోక‌పోతే చేయితో ప‌ని చెప్పాల్సివ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తుంది. శైలేంద్ర ప్లాన్స్ గురించి మ‌హేంద్ర‌, అనుప‌మ‌ల‌తో చెబుతుంది వ‌సుధార‌.

మీ మంచిత‌నాన్ని చేత‌కానిత‌నంగా భావిస్తూ శైలేంద్ర రెచ్చిపోతున్నాడ‌ని అనుప‌మ అంటుంది. మ‌రోసారి శైలేంద్ర నిన్ను బెదిరించాల‌ని చూస్తే స‌మాధానం చెప్ప‌కుండా చెంప‌ప‌గ‌ల‌గొట్ట‌మ‌ని వ‌సుధార‌తో అంటుంది అనుప‌మ‌.తాను అదే చేయాల‌ని అనుకున్నాన‌ని...కానీ ప‌క్క‌న స్టూడెంట్స్ ఉండ‌టంతో ఆగిపోయాన‌ని వ‌సుధార అంటుంది. యూత్ ఫెస్టివ‌ల్‌ను ఫెయిల్ చేయాల‌ని శైలేంద్ర చేస్తోన్న ప్ర‌య‌త్నాల్ని ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని మ‌హేంద్ర అంటాడు.

శైలేంద్ర‌కు క్లాస్‌...

కాలేజీ యూత్ ఫెస్టివ‌ల్ ప‌నుల్లో నువ్వు కూడా పాలుపంచుకోమ‌ని శైలేంద్ర‌కు చెబుతాడు ఫ‌ణీంద్ర‌. వ‌సుధార అన్ని ప‌నులు చేస్తుంది క‌దా అని నువ్వు ప‌ట్టించుకోన‌ట్లుగా ఉండొద్దు అని కొడుకుకు క్లాస్ ఇస్తాడు. స‌రే అని త‌ల ఆడించి సైలెంట్‌గా ఉండ‌కుండా కాలేజీ ప‌నులు చూసుకోమ‌ని అంటాడు.

ప్ర‌తి ఏడాది యూత్‌ఫెస్టివ‌ల్ ప‌నుల్ని రిషి చూసుకునేవాడు. అత‌డికి తోడుగా వ‌సుధార ఉండేది. కానీ ఈ ఏడాది రిషి క‌నిపించ‌డం లేదు. అస‌లు ఎక్క‌డ ఉన్నాడో తెలియ‌దు. ఈ ప‌రిస్థితుల్లో యూత్ ఫెస్టివ‌ల్‌ను ఒంట‌రిగా నిర్వ‌హించ‌డానికి వ‌సుధార ఆందోళ‌న ప‌డుతోంద‌ని దేవ‌యాని, శైలేంద్ర‌ల‌తో చెబుతాడు ఫ‌ణీంద్ర‌.

దేవ‌యాని ప్లాన్ రివ‌ర్స్‌...

భ‌ర్త ముందు మంచిదానిలా న‌టిస్తూ వ‌సుధార‌ను పొడుగుతుంది దేవ‌యాని. మెల్ల‌గా త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెడుతుంది. రిషి దూర‌మైన త‌ర్వాత వ‌సుధార మాన‌సికంగా కుంగిపోయింద‌ని భ‌ర్త‌తో అంటుంది. రిషి ఎక్క‌డున్నాడో తెలుసుకునేందుకు ఆరాట‌ప‌డుతోంద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో యూత్ ఫెస్టివ‌ల్ బాధ్య‌త‌లు వ‌సుధార‌కు భారం కావ‌చ్చున‌ని, ఆమెకు కాకుండా శైలేంద్ర‌కు యూత్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హించే బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తే మంచిద‌ని భ‌ర్త‌కు స‌ల‌హా ఇస్తుంది దేవ‌యాని.

కానీ ఆమె ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. అంత తెలివిత‌క్కువ‌గా ఎలా మాట్లాడుతున్నావు. అస‌లు వీడికి ఏం తెలియ‌దు, చిన్న ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేయ‌డ‌మే రాదు. ఇంత పెద్ద ఫెస్ట్‌ను శైలేంద్ర నిర్వ‌హించ‌లేడ‌ని కొడుకు గాలి మొత్తం తీసేస్తాడు ఫ‌ణీంద్ర‌. రిషి చ‌నిపోయాడ‌ని అబ‌ద్ధం న్యూస్ ప్ర‌చార‌మైన‌ప్పుడు కాలేజీని మూసేద్దామ‌ని శైలేంద్ర అన్నాడు. అదే వ‌సుధార క్ష‌ణాల్లో స‌మ‌స్య‌ను సాల్వ్ చేసింద‌ని ఫ‌ణీంద్ర అంటాడు.

నేను చెప్పింది క‌రెక్టా కాదా...యూత్ ఫెస్టివ‌ల్ బాధ్య‌త‌ల్ని నీకు అప్ప‌గించ‌లేద‌ని ఫీల‌య్యావా అని కొడుకును అడుగుతాడు ఫ‌ణీంద్ర‌. తండ్రిని ఎదురించ‌లేక మీ నిర్ణ‌య‌మే క‌రెక్ట్ అంటూ మ‌న‌సు చంపుకొని మాట చెబుతాడు శైలేంద్ర‌. ఇలాంటి వెధ‌వ ఆలోచ‌న‌లు ప‌క్క‌న‌పెట్ట‌మ‌ని దేవ‌యానిని హెచ్చ‌రిస్తాడు.

వ‌సుధార అర్హురాలు కాద‌ని...

ఎండీ ప‌ద‌వికి వ‌సుధార అర్హురాలు కాద‌నే అనుమానం బోర్డ్ మెంబ‌ర్స్‌లో ఉంద‌ని, ఈ యూత్ ఫెస్టివ‌ల్ స‌క్సెస్అయితే ఎండీ ప‌ద‌వికి ఆమె క‌రెక్ట్ అని బోర్డ్ మెంబ‌ర్స్ భావించే ఛాన్స్ ఉంద‌ని ఫ‌ణీంద్ర‌ అంటాడు. ఈ యూత్ ఫెస్టివ‌ల్‌ను స‌క్సెస్ చేయ‌డంలో వ‌సుధార‌కు సాయం చేయ‌మ‌ని శైలేంద్ర‌కు చెప్పి వెళ్లిపోతాడు ఫ‌ణీంద్ర‌. యూత్ ఫెస్ట్ స‌క్సెస్ అయితే ఎండీ ప‌ద‌వి ఎప్ప‌టికీ త‌మ‌కు ద‌క్క‌ద‌ని శైలేంద్ర భ‌య‌ప‌డ‌తాడు. ఫెస్టివ‌ల్‌ను చెడ‌గొట్ట‌డానికి మంచి ప్లాన్ ఆలోచించ‌మ‌ని త‌ల్లితో చెబుతాడు.

వ‌సుధార టెన్ష‌న్‌...

అర్ధ‌రాత్రి దాటినా నిద్ర‌పోకుండా యూత్‌ఫెస్టివ‌ల్ ప‌నుల్లో బిజీగా ఉంటుంది వ‌సుధార‌. చాలా టెన్ష‌న్‌గా క‌నిపిస్తుంది. ఇదే విష‌యం వ‌సుధార‌ను అడుగుతుంది అనుప‌మ‌. ఇంత‌కుముందు ఈవెంట్స్ చేసిన‌ప్పుడు రిషిసార్ నా ప‌క్క‌న ఉండేవారు. ఆయ‌న చాలా స‌పోర్ట్‌గా ఉండ‌టంతో ఏ పొర‌పాటు జ‌ర‌గ‌ద‌నే న‌మ్మ‌కం ఉండేది.

త‌ప్పు జ‌రిగితే రిషి స‌రిదిద్దుతార‌నే ధైర్యం ఉండేది. ఆ ధైర్యం, న‌మ్మ‌కం ఇప్పుడు లేవు అంటూ వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది. రిషి నా ప‌క్క‌న లేక‌పోవ‌డంతో ఇదొక బాధ్య‌త‌గా, భారంగా అనిపిస్తుంద‌ని కంగారు ప‌డుతుంది. యూత్ ఫెస్టివ‌ల్‌ను నువ్వు స‌క్సెస్ చేయ‌గ‌ల‌గ‌వ‌ని వ‌సుధార‌కు ధైర్యం చెబుతుంది అనుప‌మ‌.

శైలేంద్ర అవ‌మానం...

వ‌సుధార క‌ళ్ల‌ల్లో రిషి క‌నిపించ‌డం లేద‌న్న భ‌యం, బెరుకు కొంచెం కూడా లేద‌ని శైలేంద్ర అనుకుంటాడు. రిషి ఎక్క‌డున్నాడో వ‌సుధార‌కు తెలుసున‌ని అనుకుంటాడు. కానీ ఎంత ఆలోచించిన, ఎన్ని ప్లాన్స్ వేసిన రిషి అడ్రెస్ క‌నిపెట్ట‌లేక‌పోవ‌డం అవ‌మానంగా ఫీల‌వుతాడు శైలేంద్ర‌.

యూత్‌ఫెస్టివ‌ల్‌ను గ‌న‌క స‌క్సెస్ అయితే ఎండీ సీట్ నుంచి వ‌సుధార‌ను జ‌న్మ‌లో క‌దిలించ‌లేన‌ని శైలేంద్ర భ‌య‌ప‌డ‌తాడు. యూత్ ఫెస్టివ‌ల్‌ను చెడ‌గొట్టి ఎండీ ప‌ద‌వికి వ‌సుధార రిజైన్ చేసేలా ప్లాన్స్ వేయాల‌ని ఫిక్స‌వుతాడు. ఆ ప్లాన్ కోసం తెగ ఆలోచిస్తుంటాడు శైలేంద్ర‌. అత‌డి ఆలోచ‌న‌ల్ని ధ‌ర‌ణి చెడ‌గొడుతుంది.

దేనికో కంగారుగా క‌నిపిస్తున్న‌ట్లున్నారు, ఏమైంది అని అడుగుతుంది. మీ లైఫ్‌లో ఏదో జ‌ర‌గ‌కూడ‌నిది జ‌రుగుతున్న‌ట్లుగా టెన్ష‌న్‌గా క‌నిపిస్తున్నార‌ని అదేమిట‌ని భ‌ర్త‌ను అడుగుతుంది ధ‌ర‌ణి.యూత్ ఫెస్టివ‌ల్ చెడ‌గొట్ట‌డానికి ధ‌ర‌ణి స‌ల‌హా తీసుకోవాల‌ని శైలేంద్ర అనుకుంటాడు.

ప్లేట్ ఫిరాయించిన శైలేంద్ర‌....

వ‌సుధార నిర్వ‌హిస్తున్న యూత్ ఫెస్టివ‌ల్ గురించి ధ‌ర‌ణితో చెబుతాడు శైలేంద్ర‌. అది మంచిదే క‌దా అని ధ‌ర‌ణి అంటుంది. వెంట‌నే మాట మార్చి ఓ మీరు వ‌సుధార పార్టీ కాదు క‌దా అని అంటుంది. ఆ పోగ్రామ్స్ స‌క్సెస్ కాకుండా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా అని భ‌ర్త‌ను అడుగుతుంది.

శైలేంద్ర ప్లేట్ ఫిరాయిస్తాడు. ఈ సారి వెరైటీగా వ‌సుధార మేలు కోరుకుంటున్నాన‌ని ధ‌ర‌ణితో చెబుతాడు. రేపు నేను ఇచ్చే ట్విస్ట్‌కు కాలేజీలో ఉన్న‌వాళ్లంద‌రు స‌ర్‌ప్రైజ్ కావాలి, షాక‌వ్వాలి అని అంటాడు. అలాంటి ప్లాన్ గురించి ఎంత ఆలోచించిన ఏం తెలియ‌డం లేద‌ని అంటాడు.

ధ‌ర‌ణి ఐడియా...

ఇంత చిన్న విష‌యం గురించి ఎందుకు అతిగా ఆలోచిస్తున్నార‌ని భ‌ర్త‌తో అంటుంది ధ‌ర‌ణి. రిషి వ‌స్తున్నాడ‌ని అంద‌రికి చెప్ప‌మ‌ని స‌ల‌హా ఇస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంద‌ని, యూత్ ఫెస్టివ‌ల్‌ను చెడ‌గొట్ట‌డానికి ధ‌ర‌ణి స‌ల‌హాను వాడుకోవాల‌ని అనుకుంటాడు శైలేంద్ర‌. మీరు నేను చెప్పిన‌ట్లు చేస్తే నిజంగానే రిషి కాలేజీకి వ‌స్తాడు. మీ దుర్మార్గాల‌కు అడ్డుక‌ట్ట వేస్తాడ‌ని మ‌న‌సులో అనుకుంటుంది ధ‌ర‌ణి.

జ‌గ‌తినే గురువు...దైవం...

యూత్ ఫెస్టివ‌ల్ కోసం కాలేజీకి బ‌య‌లుదేర‌బోతూ జ‌గ‌తి ఫొటో ముందు దండం పెట్టి ఆమె ఆశీర్వాదం తీసుకుంటుంది వ‌సుధార‌. రిషి తోడు లేకుండా ఒంట‌రిగా నిర్వ‌హిస్తున్న యూత్ ఫెస్టివ‌ల్‌లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడ‌మ‌ని కోరుకుంటుంది.

అడ్డంకులు రాకూడ‌ద‌ని అంద‌రూ దేవుడిని వేడుకుంటారు క‌దా...నువ్వు మీ అత్త‌య్య ఫొటోకు దండం పెడుతున్నావు ఎందుకు అని వ‌సుధార‌ను అడుగుతాడు మ‌హేంద్ర‌. నాకు గురువు త‌ర్వాతే దైవ‌మ‌ని...జ‌గ‌తి మేడ‌మ్‌కు మించిన‌ గురువు, దైవం నాకు ఎవ‌రూ లేర‌ని వ‌సుధార అంటుంది. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

WhatsApp channel