(1 / 6)
అత్యంత సన్నిహితుల మధ్య హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ ఇవాళ (ఆగస్ట్ 8) ఉదయం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
(2 / 6)
నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ నాడే పెద్ద షాక్ తగిలింది. హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం, వారి భవిష్యత్ ఎలా ఉంటుందో తాను రేపు ఉదయం (ఆగస్ట్ 9) చెప్పనున్నట్లు ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన పోస్ట్ చేశారు.
(3 / 6)
వేణు స్వామి తన సోషల్ మీడియాలో అకౌంట్స్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో "నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన, జాతకపరమైన విశ్లేషణ రేపు" అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
(4 / 6)
అయితే, ఇదివరకు వేణు స్వామి చెప్పిన చాలమంది సెలబ్రిటీల జాతకం నిజమైంది. సమంత, నాగ చైతన్య విడిపోతారని వారి ఎంగేజ్‌మెంట్ సమయంలోనే వేణు స్వామి చెప్పారు. కానీ, అప్పుడు విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకున్నారు. అలా వేణు స్వామి చెప్పింది చాలా వరకు జరిగాయి.
(5 / 6)
ఇటీవల మాత్రం ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని, టీ20 మ్యాచ్‌లో ఇండియాదే విజయమని వేణు స్వామి చెప్పిన జోస్యం తప్పింది. దాంతో వేణు స్వామిపై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. దానికి తన ప్రెడిక్షన్ తప్పు అయినందుకు సెలబ్రిటిలీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన జాతకాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పనని వీడియో రిలీజ్ చేశారు వేణు స్వామి.
(6 / 6)
ఇప్పుడు ఆ మాట మార్చి నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వైవాహిక జీవితానికి సంబంధించి జాతకం చెబుతానని వేణు స్వామి పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వేణు స్వామి మాట మార్చారని, మళ్లీ మొదలు పెట్టారని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు