Pradosh Vrat: రేపు ఈ ఐదు పువ్వులతో భోళాశంకరుని ఆరాధించండి, అద్భుతమైన వరాలు పొందండి
Pradosh Vrat: 2024లో శుక్ర ప్రదోష వ్రతం జరుపుకునే డిసెంబరు 13వ తేదీన ఆ మహాశివుని ఈ పూలతో ఆరాధించండి. అదృష్టం కలసి రావడంతో పాటు శ్రేయస్సును, కీర్తి ప్రతిష్టలు పెరిగే వరాలను అందుకోండి.
హిందూమతంలో, ప్రదోష వ్రతమనేది ఆ మహాశివునికి ఎంతో నచ్చే పవిత్రమైన ఆచారం. ఇది ప్రతి చంద్రపథం 13వ రోజు అంటే పౌర్ణమికి రెండ్రోజుల ముందు వచ్చే త్రయోదశి నాడు జరుపుకుంటారు. భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నియమ నిష్టలతో ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో శివ పూజ చేసుకుని వ్రతాన్ని విరమిస్తారు. ఈ వ్రతం ఆధ్యాత్మిక వృద్ధి, శాంతిలతో పాటు ఆ కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. ఉపవాసం చేసి, ఆ భోళాశంకరున్ని ప్రార్థించడం ద్వారా భక్తులు తాము చేసిన తప్పులకు మన్నింపు పొందడమే కాకుండా ధర్మమార్గంలో నడిచేందుకు ఉపయోగపడుతుంది.
ఈ సంవత్సరంలో, ప్రదోష వ్రతం మార్గశిర శుక్ల పక్షంలో 13 డిసెంబర్ 2024న జరగనుంది. ఈ శివారాధన చేసిన వారికి అనుగ్రహం కలిగి భాగ్యం, విజయం వంటివి ప్రాప్తిస్తాయి. శివారాధన సమయంలో ఈ 5 ప్రత్యేక పువ్వులను వినియోగించడం వల్ల ప్రత్యేకానుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం.
1. ధతుర పువ్వులు (ఉమ్మెత్త పువ్వులు)
ఉమ్మెత్త పువ్వులు శివారాధన సమయంలో ఎంతో పవిత్రమైనవి. శివునికి ఎంతో ఇష్టమైన పువ్వులలో ఒకటైన ఈ ఉమ్మెత్త పుష్పాలను శివలింగంపై ఉంచి ఆరాధించడం వల్ల ప్రత్యేకానుగ్రహం కలుగుతుందట. ఆధ్యాత్మిక వృద్ధితో పాటు వీటిని అర్పించడం వల్ల దైవానికి దగ్గరైన భావనను పెంచుతుంది. ఇవి అర్పించడం వల్ల ఆధ్యాత్మిక బోధన, ముక్తి పొందగలం.
2. అఖండ పువ్వులు (జిల్లేడు పువ్వులు)
జిల్లేడు పువ్వులు పరమశివునికి ఇష్టమైనవని చాలామందికి తెలిసిన విషయమే. ప్రదోష వ్రతం చేసే సమయంలో వీటిని కచ్చితంగా ఉంచుతారు. ఈ పూలను సమర్పించడం వల్ల భక్తిభావం పెరగడంతో పాటు, పవిత్రత కలిగి ఆధ్యాత్మిక వృద్ధి మెరగవుతాయి. జిల్లేడు పువ్వులు అర్పించడం వల్ల శాంతి, ఆనందాన్ని మన జీవితాల్లోకి తీసుకురావడంలో సహకరిస్తుంది. భక్తులు ఈ పువ్వులను అర్పించి శివుని ఆరాధించడం వల్ల ప్రత్యేకానుగ్రహం పొందుతామని భక్తుల నమ్మకం.
3. బిల్వ పత్రాలు
బిల్వ పత్రం హిందూమతంలో చాలా పవిత్రమైనది. వీటిని కూడా ప్రదోష వ్రతం సమయంలో కచ్చితంగా ఉంచుతారు. మహా శివుని ఆశీర్వాదాలు పొందడానికి బిల్వ పత్రాలను శివలింగంపై జల్లుతూ శివ జపం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల క్షమ, దయ, ఆధ్యాత్మిక వృద్ధి మెరుగవుతాయని భక్తుల నమ్మకం. బిల్వ పత్రాలు అర్పించడం వల్ల భక్తుల్ని ఆ మహాదేవుడికి దగ్గర చేస్తుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా గతంలో చేసిన తప్పులకు కూడా మన్నింపు దొరుకుతుందని భావిస్తారు.
4. మల్లె పువ్వులు
మహాదేవునికి ఇష్టమైన పువ్వులలో మరొకటి మల్లెపువ్వులు. సువాసనలు వెదజల్లే ఈ మల్లెపువ్వులు ఆ శంకరునికి ప్రీతికరమైనవి. పరిమళం వెదజల్లే ఈ పువ్వులను ప్రదోష వ్రతంలో వినియోగించడం వల్ల ప్రేమ, పవిత్రత పెంపొంది, ఆధ్యాత్మిక వృద్ధికి దోహదపడుతుంది. మల్లెపువ్వులను అర్పించడం వల్ల భక్తుల జీవితంలో శాంతి, ఆనందం విరాజిల్లుతుంది. భక్తులు ఈ పువ్వులను అర్పించి మహాశివుని ఆశీర్వాదాలను కోరుకుంటారు. ఒక సంతోషకరమైన, సమృద్ధికరమైన జీవితాన్ని పొందడానికి ఈ పువ్వులు వినియోగించాలని పెద్దల నమ్మకం.
5. శంఖు పువ్వులు
క్లిటోరియా టెర్నాటియా అనే శాస్త్రీయ నామం కలిగిన శంఖు పువ్వులు శివారాధనకే అంకితం చేసిన పుష్పాలు. ప్రదోష వ్రతం సమయంలో అర్పించాల్సిన పవిత్ర పువ్వుగా చెబుతుంటారు. ఈ నీలం రంగు పువ్వు విజయం, ఆధ్యాత్మిక వృద్ధి, భక్తిని పెంపొందిస్తుంది. శంఖు పువ్వులు అర్పించడం భక్తులకు విజయం ప్రాప్తించడంతో పాటు ప్రసిద్ధి చెందేందుకు దోహదపడుతుంది. ఆధ్యాత్మిక సంబంధాన్ని బలపరిచేవిగా, శివ ఆశీర్వాదాలను పొందడంలో కీలకంగా వ్యవహరించేవిగా శంఖు పువ్వుల గురించి ప్రచారం ఉంది. భక్తులు ఈ పువ్వులను అర్పించి శివానుగ్రహంతో తమ జీవితాన్ని సమతుల్యంగా, శాంతియుతంగా కొనసాగించేలా ఆశీర్వాదాలు కోరుకుంటారు.