Gukesh Dommaraju: వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా దొమ్మరాజు గుకేశ్.. 18 ఏళ్లకే విశ్వనాథన్ ఆనంద్ సరసన యువ కెరటం
వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ భారత్ నుంచి ఛాంపియన్ అవతరించాడు. తెలుగు మూలాలు ఉన్న 18 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్ గురువారం సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు.
భారత యువ చెస్ సంచలనం దొమ్మరాజు గుకేశ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు. చైనాకి చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ హోరాహోరీగా తలపడిన దొమ్మరాజు గుకేశ్.. సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు తన చిరకాలస్వప్నం నెరవేర్చుకున్నాడు.
పిన్న వయస్కుడిగా రికార్డ్
ఇప్పటి వరకు విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవగా.. ఎట్టకేలకు ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్‌గా దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు. దొమ్మరాజు గుకేశ్ స్వస్థలం తమిళనాడుకాగా.. అతని పూర్వీకులు తెలుగువారే. వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఛాంపియన్‌గా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు.
5 గంటలు పోరు.. కానీ ఆఖరికి?
ఈరోజు జరిగిన లాస్ట్ క్లాసికల్ గేమ్.. 14 రౌండ్‌లో లిరెన్ 6.5 పాయింట్లు సాధించగా.. గుకేశ్ 7.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. 2012 తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. నిజానికి ఈ ఛాంపియన్‌షిప్ విజేతపై బుధవారమే క్లారిటీ రావాల్సి ఉంది. కానీ.. లిరెన్, గుకేశ్ 5 గంటల పాటు సుదీర్ఘంగా పోరాడి 6.5 పాయింట్లతో సమానంగా నిలిచారు. ఓవరాల్‌గా 68 ఎత్తుల తర్వాత గేమ్ ఫలితం తేలే అవకాశం కనిపించకపోవడంతో.. ఇద్దరూ డ్రాకి అంగీకరించారు.
టాపిక్