తెలుగు న్యూస్ / ఫోటో /
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కుతున్న పీవీ సింధు.. డెస్టినేషన్ వెడ్డింగ్.. వరుడు ఎవరో తెలుసా?
- PV Sindhu Wedding: పీవీ సింధు పెళ్లి చేసుకోబోతోంది. ఈ నెల 22నే ఉదయ్‌పూర్ లో ఆమె పెళ్లి జరగనుండటం విశేషం. హైదరాబాద్ కు చెందిన వెంకట దత్త సాయి అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడనుంది. ఈ విషయాన్ని ది హిందూ రిపోర్టు వెల్లడించింది.
- PV Sindhu Wedding: పీవీ సింధు పెళ్లి చేసుకోబోతోంది. ఈ నెల 22నే ఉదయ్‌పూర్ లో ఆమె పెళ్లి జరగనుండటం విశేషం. హైదరాబాద్ కు చెందిన వెంకట దత్త సాయి అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడనుంది. ఈ విషయాన్ని ది హిందూ రిపోర్టు వెల్లడించింది.
(1 / 5)
PV Sindhu Wedding: హైదరాబాద్ కు చెందిన 29 ఏళ్ల భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. రియో ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ లలో పతకాలు గెలిచిన ఆమె.. పెళ్లి పీటలెక్కబోతోంది. రెండేళ్ల తర్వాత ఈ మధ్యే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన సింధు.. ఇప్పుడు పెళ్లి రూపంలో మరో గుడ్ న్యూస్ ఇచ్చింది.(PTI)
(2 / 5)
PV Sindhu Wedding: పీవీ సింధు హైదరాబాద్ కు చెందిన వెంకట సాయి దత్తా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుంది. ఆయన పోసిడెక్స్ టెక్నాలజీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
(3 / 5)
PV Sindhu Wedding: సింధు, సాయి పెళ్లి డిసెంబర్ 22న ఉదయ్‌పూర్ లో జరగనుండటం విశేషం. డిసెంబర్ 20 నుంచే పెళ్లి పనులు మొదలు కానున్నాయి. చాలా రోజుల తర్వాత ఈ మధ్యే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ గెలిచిన సింధు.. వెంటనే పెళ్లి రూపంలో మరో శుభవార్త వినిపించింది.
(4 / 5)
PV Sindhu Wedding: పీవీ సింధు, వెంకట సాయి దత్తా పెళ్లి డిసెంబర్ 22న జరగనుండగా.. ఆ తర్వాత డిసెంబర్ 24న హైదరాబాద్ లో పెళ్లి విందు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
ఇతర గ్యాలరీలు