తెలుగు న్యూస్ / ఫోటో /
Magnesium Rich Foods: మెగ్నిషియం మెండుగా ఉండే ఆహారాలు ఇవి.. తప్పక తినాల్సిందే!
- Magnesium Rich Foods: శరీరానికి మెగ్నిషియం చాలా ముఖ్యం. ఈ మినరల్ లోపం ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఆహారాలు ఏవంటే..
- Magnesium Rich Foods: శరీరానికి మెగ్నిషియం చాలా ముఖ్యం. ఈ మినరల్ లోపం ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఆహారాలు ఏవంటే..
(1 / 7)
శరీరంలో మెగ్నిషియం లోపం ఉంటే కొన్ని ఆరోగ్యానికి సమస్యలు ఎదురవుతాయి. నీరసం, వికారం, కండరాల నొప్పులు, అలసట లాంటి ఇబ్బందులు ఉంటాయి. అందుకే మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఆహారాలు తినాలి. అవేంటో ఇక్కడ చూడండి. (Unsplash)
(2 / 7)
బాదం, జీడిపప్పు, బ్రెజిల్ నట్స్‌లో మెగ్నిషియం మెండుగా ఉంటుంది. ఇవి తింటే శరీరానికి ఈ మినరల్ బాగా అందుతుంది. కీలకమైన విటమిన్లతో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్ సహా మరిన్ని పోషకాలు వీటిలో మెండుగా ఉంటాయి. (Freepik)
(3 / 7)
అవకాడోలో మెగ్నిషియం అధికం. ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మెగ్నిషియం లోపం ఉన్న వారు అవకాడో తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. (Pixabay)
(4 / 7)
శనగలు, బీన్స్, సోయాబీన్స్, పప్పులు, పచ్చి బఠానీ లాంటి కాయధాన్యాల్లో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే శరీరానికి ఈ పోషకం బాగా అందుతుంది. లోపం తగ్గిపోతుంది. (Pexels)
(5 / 7)
గుమ్మడి, అవిసె, చియా విత్తనాల్లోనూ మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. క్వినోవా, బార్లీ లాంటి చిరుధాన్యాల్లోనూ ఈ పోషకం బాగా లభిస్తుంది.
(6 / 7)
డార్క్ చాక్లెట్‍లోనూ మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెగ్నిషియం లోపం తగ్గుతుంది.
ఇతర గ్యాలరీలు