తెలుగు న్యూస్ / ఫోటో /
AP Weather : ఏపీ వెదర్ రిపోర్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP Weather Updates : ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. తుపాను తీరం దాటినప్పటికీ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచనలు చేసింది.మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. తుపాను తీరం దాటినప్పటికీ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచనలు చేసింది.
(2 / 6)
తుపాను ప్రస్తుతం అల్పపీడనంగా మారి ఉత్తర అంతర్గత తమిళనాడు మీదుగా కొనసాగుతోంది. డిసెంబర్ 3 నాటికి అవశేష అల్పపీడనంగా మారి ఉత్తర కేరళ కర్ణాటక తీరానికి ఆగ్నేయ, తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
(3 / 6)
ఆవర్తనం ప్రభావంతో ఏపీలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసింది. రేపు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్య సాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
(4 / 6)
డిసెంబర్ 3న విజయనగరం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
(5 / 6)
ఉత్తర కోస్తా, యానాంలో మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ కోస్తాంధ్రలో మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇతర గ్యాలరీలు