Star Maa Serial: స్టార్ మాలో ఈరోజు నుంచే సరికొత్త సీరియల్.. మరికొన్ని గంటల్లోనే ప్రారంభం
Star Maa Serial: స్టార్ మా ఛానెల్లోకి సోమవారం (డిసెంబర్ 2) నుంచి సరికొత్త సీరియల్ అడుగుపెట్టబోతోంది. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ ప్రమోషన్లను జోరుగా నిర్వహించిన ఆ ఛానెల్.. మొత్తానికి లాంచ్ ఎపిసోడ్ కు సిద్ధమైంది.
Star Maa Serial: స్టార్ మా సీరియల్స్ ను తెలుగు వాళ్లు తెగ ఆదరిస్తారు. చాలా ఏళ్లుగా టీఆర్పీ రేటింగ్స్ విషయంలో ఆ ఛానెల్లో వచ్చే సీరియల్స్ ను కొట్టే మరో ఛానెల్ లేకుండా పోయింది. అలాంటి ఛానెల్ ఇప్పుడు గీత ఎల్ఎల్‌బీ పేరుతో సరికొత్త సీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఈ సీరియల్ లాంచ్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.
స్టార్ మా కొత్త సీరియల్
స్టార్ మా ఛానెల్లో సోమవారం (డిసెంబర్ 2) నుంచి ప్రారంభం కానున్న ఆ సీరియల్ పేరు గీత ఎల్ఎల్‌బీ. కొన్ని రోజుల కిందటే ఈ సీరియల్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా.. అప్పటి నుంచీ ప్రతి రోజూ జోరుగా ప్రమోషన్లను నిర్వహించింది. ఈరోజు ప్రారంభం కానున్న ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది.
తొలి ఎపిసోడ్ కు సిద్ధంగా ఉండండి అంటూ ఉదయం నుంచి స్టార్ మా తెగ హడావిడి చేస్తోంది. ఈ మధ్యే అదే ఛానెల్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే మరో సీరియల్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి వారమే ఈ సీరియల్ టీఆర్పీల్లో రెండో స్థానానికి దూసుకెళ్లడంతో ఇప్పుడు కొత్తగా రాబోయే గీత ఎల్ఎల్‌బీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఏంటీ గీత ఎల్ఎల్‌బీ సీరియల్?
ఇప్పటి వరకూ సినిమాల్లో కోర్టు రూమ్ డ్రామాలు ఎన్నో చూశాం. నిజానికి ఈ కోవకు చెందిన స్టోరీలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అయితే సీరియల్లో ఇప్పుడిలా కోర్టు రూమ్ డ్రామా రాబోతుండటం ఈ గీత ఎల్ఎల్‌బీ ప్రత్యేకత. దీనికి సంబంధించిన ప్రోమోను కొన్ని రోజుల కిందట రిలీజ్ చేయగా.. అందులో ఓ వేధింపుల గురైన అమ్మాయి తరఫున వాదించే లాయర్ గీత పాత్రలో మలయాళ నటి నీతూ మాయ నటించింది. ఈ ప్రోమో చివర్లో జై బాలయ్య అంటూ ఆమె అనడం విశేషం. ఈ సరికొత్త సీరియల్ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందన్నది చూడాలి.
గీత ఎల్ఎల్‌బీ సీరియల్‌లో నీతూ మాయ టైటిల్ పాత్రలో నటిస్తోంది. మలయాళ హీరోయిన్ అయిన నీతూ మాయ ఈ సీరియల్‌తోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. పంతంతో పాటు మలయాళంలో పలు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది నీతూ మాయ. గీతాఎల్ఎల్‌బీ సీరియల్‌లో భవీష్ హీరోగా నటిస్తోన్నాడు. శ్వేత విజయ్‌కుమార్, ఇమ్రాన్ ఖాన్ నెగెటివ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. బెంగాలీ సీరియల్ గీతా ఎల్ఎల్‌బీకి రీమేక్‌గా అదే పేరుతో గీతా ఎల్ఎల్‌బీ సీరియల్ రూపొందుతోంది.