Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. స్టార్ మా హవానే..
Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. 47వ వారానికి సంబంధించిన ఈ రేటింగ్స్ లోనూ స్టార్ మా షోల హవా స్పష్టంగా కనిపించింది. బిగ్ బాస్ మరోసారి టాప్ లో నిలిచింది.
Telugu TV Shows TRP Ratings: స్టార్ మా అటు సీరియల్స్, ఇటు షోలలోనూ తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆ ఛానెల్ కు చెందిన సీరియల్స్ టీఆర్పీల్లో చాలా నెలలుగా టాప్ 6లో ఉంటూ వస్తున్నాయి. తాజాగా 47వ వారానికి సంబంధించిన రిలీజైన టీవీ షోల రేటింగ్స్ లోనూ ఆ ఛానెల్లో వచ్చే ప్రోగ్రామ్సే చాలా వరకు టాప్ లో ఉన్నాయి.
తెలుగు టీవీ షోస్ టీఆర్పీ రేటింగ్స్
తెలుగు టీవీ షోల టీఆర్పీ రేటింగ్స్ 47వ వారం రిలీజయ్యాయి. ఇందులో స్టార్ మాలో వచ్చే బిగ్ బాస్ వీకెండ్ షో 5.42 రేటింగ్ తో టాప్ లో నిలిచింది. ఇక రెండో స్థానంలో బిగ్ బాస్ వీక్ డేస్ షోనే ఉండటం విశేషం. దీనికి 3.92 రేటింగ్ వచ్చింది. ఇక మూడో స్థానంలోనూ స్టార్ మాకే చెందిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం నిలిచింది. ఈ షోకి 3.22 రేటింగ్ వచ్చింది. నాలుగో స్థానంలో ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ 3.2 రేటింగ్ తో ఉండగా.. ఐదో స్థానంలో జీ తెలుగులో వచ్చే సరిగమప సింగింగ్ షో 2.42 రేటింగ్ తో ఉంది.
ఆ తర్వాత వరుసగా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ (1.95), ఢీ2 సెలబ్రిటీ డ్యాన్స్ షో (1.92), పాడుతా తీయగా (1.38), సుమ అడ్డా (1.37) నిలిచాయి. ఎంటర్టైన్మెంట్ షోలను పక్కన పెడితే.. ఈటీవీలో వచ్చే రాత్రి 9 గంటల న్యూస్ 3.46 రేటింగ్ సంపాదించడం విశేషం. నిజానికి ఈటీవీలో వచ్చే అన్ని షోల కంటే ఈ న్యూస్ రేటింగే ఎక్కువగా ఉంది. అయితే ఈటీవీలోనే వచ్చే ఫ్యామిలీ స్టార్స్ రేటింగ్ మాత్రం ఈ వారం కూడా రిలీజ్ కాలేదు. కొన్నాళ్లుగా ఈ షో రేటింగ్స్ బయటకు రావడం లేదు.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక ఇప్పటికే స్టార్ మా సీరియల్స్ 47వ వారం టీఆర్పీ రేటింగ్స్ కూడా రిలీజైన విషయం తెలిసిందే. టాప్ 10లో మొదటి ఆరు స్థానాలు మరోసారి ఆ ఛానెల్లో వచ్చే సీరియల్సే సొంతం చేసుకున్నాయి. తొలి స్థానంలో 12.31 రేటింగ్ తో కార్తీకదీపం నిలిచింది. ఇక రెండో స్థానంలో కొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు 11.11తో ఉండటం విశేషం. తొలి వారం నుంచే ఆ సీరియల్ ఏకంగా రెండో స్థానానికి దూసుకొచ్చింది.
మూడో స్థానంలో చిన్ని సీరియల్ 10.61తో, నాలుగో స్థానంలో ఇంటింటి రామాయణం 10.37తో, ఐదో స్థానంలో గుండె నిండా గుడి గంటలు 9.66తో, ఆరో స్థానంలో మగువ ఓ మగువ 9.53తో నిలిచాయి. ఎన్నో నెలల పాటు టాప్ లో కొనసాగిన బ్రహ్మముడి టైమ్ మధ్యాహ్నానికి మారడంతో ఆ సీరియల్ రేటింగ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. తాజాగా 47వ వారం 6.05 రేటింగ్ మాత్రమే సాధించింది.
జీ తెలుగు సీరియల్స్ లో ఈసారి మేఘ సందేశం సీరియల్ దుమ్ము రేపిందని చెప్పొచ్చు. తొలిసారి ఈ సీరియల్ ఏకంగా 9.00 రేటింగ్ సాధించడం విశేషం. జీ తెలుగులో టాప్ లో, ఓవరాల్ గా ఏడో స్థానంలో నిలిచింది. ఇక నిండు నూరేళ్ల సావాసం 7.87, పడమటి సంధ్యారాగం 7.58, జగద్ధాత్రి 6.59, త్రినయని 6.52, అమ్మాయిగారు 5.73 రేటింగ్స్ సాధించాయి.
టాపిక్