Dandruff: చుండ్రు తలపైనే కాదు కనురెప్పలకు ఉంటుందట, ఇది ప్రమాదకరం కూడా
Dandruff: చుండ్రు అనగానే అందరూ నెత్తి మీదే పడుతుందనుకుంటారు. జుట్టుకే కాదు నిజానికి కళ్ళ మీద ఉన్న సన్నని కనురెప్పల మధ్యలో కూడా చుండ్రు ఉంటుంది. ఇది ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా మారుతుంది.
చలికాలంలో ఎక్కువ మందికి చుండ్రు సమస్య వస్తుంది. చల్లదనానికి తలపై బ్యాక్టీరియాలు, వైరస్‌లు చుండ్రు రూపంలో ఎక్కువగా పేరుకుపోతాయి. చుండ్రు అనగానే అందరూ తల పైన ఉన్న జుట్టుపై పట్టేదే అనుకుంటారు. నిజానికి కనుబొమ్మలకు కూడా చుండ్రు పడుతుంది. కనుబొమ్మల ప్రాంతంలో పట్టే చుండ్రు కంటికి కనిపించదు. అలా అని కనురెప్పల దగ్గర చుండ్రు అధికంగా పేరుకుపోతే కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
కనురెప్పలపై ఎక్కువ బ్యాక్టీరియా చేరిపోయి చుండ్రుకు కారణం అవుతుంది. ఇది అక్కడున్న చర్మ గ్రంధుల్లో మూసుకుపోయేలా చేస్తుంది. అధికంగా శరీరం నుంచి నూనె ఉత్పత్తి అయినప్పుడు లేదా ఆ ప్రాంతంలో శిలీంధ్రాలు పెరిగినప్పుడు ఇలా కనురెప్పల దగ్గర చుండ్రు పేరుకుపోతుంది.
కనురెప్పలపై చుండ్రు ఉంటే...
కొందరు కళ్లను శుభ్రం చేసుకోరు. ఉదయం మస్కరా, ఐ లైనర్ వంటివి ధరించి రాత్రిపూట వాటితోనే నిద్రపోతూ ఉంటారు. ఇవి కూడా కనురెప్పల దగ్గర చుండ్రు పేరుకుపోవడానికి కారణంగా చెప్పుకుంటారు. కళ్ల దగ్గర దగ్గర దురద పెట్టడం, ఎర్రగా మారడం లేదా కళ్ళల్లో మంట కలవడం, వెంట్రుకలు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం వంటివన్నీ కూడా కనురెప్పల దగ్గర చుండ్రు ఉందనే విషయాన్ని తెలియజేస్తాయి.
ఉదయాన్నే కనురెప్పలు కళ్ళకు అతుక్కుపోవడం లేదా దురద పెట్టడం, ఎరుపుగా మారడం, కళ్ళల్లో నీళ్లు నిండడం, కాంతి చూడలేకపోవడం, కనురెప్పల అంచున జుట్టుగా స్రావాలు ఉత్పత్తి కావడం వంటివన్నీ కూడా కనురెప్పల్లో చుండ్రు తీవ్రంగా పేరుకుపోయిందని చెప్పే లక్షణాలు. ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది.
కనురెప్పల్లో చుండ్రు పేరుకుపోయినప్పుడు దాన్ని అలా వదిలేస్తే అది అనేక రకాల కంటి సమస్యలకు కారణం అవుతుంది. కంటిలోని కార్నియా దెబ్బతినేలా చేస్తుంది. కళ్ళు విపరీతంగా మంట పుడతాయి. దురద పెడుతూ ఉంటాయి. కండ్ల కలక, కార్నియా వాపు వంటి దీర్ఘకాలిక కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం బారిన కూడా పడవచ్చు. కళ్ళు చికాకు పెట్టడం వల్ల కళ్ళను విపరీతంగా రుద్దేస్తారు. ఇలా రుద్దడం వల్ల కారణాలు బలహీనపడతాయి. కంటి వ్యాధులకు కూడా కారణమవుతాయి. లెన్స్ ధరించే వారికి ముఖ్యంగా ఇలా కంటి చుట్టూ చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మీకు కాంటాక్ లెన్స్ ఉన్నట్లయితే కంటి ఇన్ఫెక్షన్ లు వారికి వచ్చే ప్రమాదం ఉంది. ఆ చుండ్రు లేదా బ్యాక్టీరియాలు లెన్స్ పై పేరుకుపోయి ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది.
సున్నితమైన క్లెన్సర్‌తో కనురెప్పలను ప్రతిరోజూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మేకప్ ఉత్పత్తులను కంటికి తక్కువగా అప్లై చేస్తే మంచిది. అలాగే నిద్రపోయే ముందు కళ్ళను శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే కంటి చుట్టూ చుండ్రు పేరుకుపోయే ప్రమాదం తగ్గుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్