Healthy Juice: ఈ జ్యూస్ రోజూ తాగితే శరీరంలో చేరిన ప్రాణాంతక బ్యాక్టీరియా నశించి పోవడం ఖాయం, రోజుకు మూడు స్పూన్లు తాగితే
Healthy Juice: శరీరంలో బ్యాక్టీరియాలు చేరి కొన్ని రకాల అనారోగ్యాలకి కారణం అవుతాయి. ప్రతిరోజూ టమోటో జ్యూస్ తాగితే జీర్ణ క్రియ, మూత్ర సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ప్రాణాంతక బ్యాక్టీరియా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
Healthy Juice: టమోటాలు లేనిదే ఏ కూర పూర్తవదు. ఈ టమాటోలు కేవలం కూరకు రుచి ఇవ్వడానికే అనుకుంటాం, కానీ వీటిని ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యం ఎంతో ప్రభావితం అవుతుంది. టమోటాను కూరగా కాకుండా జ్యూస్ రూపంలో మార్చుకొని ప్రతిరోజు తాగుతూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రాణాంతకమైన, ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను తొలగించడంలో ఇది ముందుంటుంది.
బ్యాక్టిరియాను చంపే టమోటా జ్యూస్
సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా... ఇది చాలా ప్రాణాంతకమైనది. ఇది ప్రమాదకరమైన టైఫాయిడ్ జ్వరానికి ముఖ్య కారణం. ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మంది మరణాలకు ఈ బ్యాక్టీరియానే కారణం. ప్రతిరోజూ టమాటో జ్యూస్ తాగడం వల్ల ఈ బ్యాక్టీరియాని ఎదుర్కొనే శక్తి మన రోగనిరోధక వ్యవస్థకి వస్తుంది. కొత్త అధ్యయనం ప్రకారం ప్రతిరోజు టమోటా రసాన్ని తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రో బయాలజీ మ్యాగజైన్లో కొత్త అధ్యయనం తాలూకు వివరాలను ప్రచురించారు. అందులో టమోటో జ్యూస్ గురించి అధ్యయనం బయటపడింది. టమోటాలు తక్కువ ధరకే లభిస్తాయి. ప్రతిరోజు ఒక టమోటోని జ్యూస్ తీసుకొని తాగేయండి చాలు. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ వంటి బయో ఆక్టివ్ అణువులు ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాలను ఇట్టే చంపేస్తాయి.
గణాంకాల ప్రకారం టైఫాయిడ్ జ్వరం ప్రపంచవ్యాప్తంగా ఏటా 21 లక్షల మందికి సోకుతుంది. అందులో రెండు లక్షల మంది మరణిస్తున్నారు. టైఫాయిడ్ కి వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ కూడా పోషకాహార లోపం వల్ల, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ముఖ్యంగా టమోటా రసాన్ని పిల్లలకు ప్రతిరోజు తాగించడం ఎంతో మంచిది.
భారతీయ వంటలలో టమోటాలదే అగ్రస్థానం. అలాగే ఆహారంలో కూడా దీనికే అగ్రస్థానం. దీనిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే టమోటాల్లోనే లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతాయి. ప్రతిరోజూ టమోటాలను తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, పొట్ట క్యాన్సర్ వంటివి రాకుండా టమోటాలు అడ్డుకుంటాయి. కాబట్టి ప్రతిరోజు మూడు స్పూన్ల టమాటా రసం తాగడానికి ప్రయత్నించండి, లేదా ఒక టమోటోను నేరుగా తినేసినా మంచిదే.