Tomato Upma: రెగ్యులర్ ఉప్మా నచ్చకపోతే... ఇలా టమోటా ఉప్మా తిని చూడండి, రెసిపీ ఇదిగో-tomato upma recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Upma: రెగ్యులర్ ఉప్మా నచ్చకపోతే... ఇలా టమోటా ఉప్మా తిని చూడండి, రెసిపీ ఇదిగో

Tomato Upma: రెగ్యులర్ ఉప్మా నచ్చకపోతే... ఇలా టమోటా ఉప్మా తిని చూడండి, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
Jan 06, 2024 06:00 AM IST

Tomato Upma: టమోటా ఉప్మాను కాస్త పుల్లగా రుచిగా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.

టమోటా ఉప్మా ఎలా చేయాలి?
టమోటా ఉప్మా ఎలా చేయాలి? ( cook with manisha/Youtube)

Tomato Upma: చాలా మందికి ఉప్మా నచ్చదు. రెగ్యులర్ గా చేసే ఉప్మా బోర్ కొడితే టమోటా ఉప్మా ప్రయత్నించండి. దీన్ని వేడి వేడిగా తింటుంటే నోరూరిపోతుంది. రుచిలో కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. టమోటాలు వేయడం వల్ల కాస్త పుల్లని రుచి వస్తుంది. ఈ ఉప్మాతో ఎలా చట్నీలు అవసరం ఉండదు. తింటున్నకొద్దీ తినాలనిపిస్తుంది. టమోటా ఉప్మా చేసుకోవడం కూడా చాలా సులువు. దీని రెసిపీల ఎలాగో చూద్దాం.

టమోటా ఉప్మా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఉప్మా రవ్వ - ఒక కప్పు

టమోటాలు - ఒకటి

ఉల్లి పాయ - ఒకటి

పచ్చిమిర్చి - ఒకటి

ఆవాలు - ఒక స్పూను

ఎండు మిర్చి - ఒకటి

కరివేపాకులు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - పావు స్పూను

కొత్తి మీర తరుగు - రెండు స్పూన్లు

టమోటా ఉప్మా రెసిపీ

1. టమోటా ఉప్మా చేయడం పెద్ద కష్టమేమీ కాదు, రెగ్యులర్ ఉప్మా చేయడానికి ఎంత సమయం పడుతుందో దీనికి అంతే సమయం పడుతుంది.

2. స్టవ్ మీద కళాయి పెట్టి ఉప్మా రవ్వను రెండు నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఆ కళాయిలో నూనె లేదా నెయ్యి వేసుకుని వేడి చేయాలి.

4. అందులో ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి.

5. తరువాత నిలువుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

6. అవి వేగాక సన్నగా తరిగిన టమోటాలను వేసి మూత పెట్టాలి. వాటిని మెత్తగా మగ్గనివ్వాలి.

7. టమోటాలలో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.

8. రెండు గ్లాసుల నీటిని వేసి మరిగించాలి.

9. ముందుగా వేయించుకున్న రవ్వను నీటి మిశ్రమంలో వేసి కలపాలి.

10. రవ్వను వేశాక ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి.

11. దించే ముందు కొత్తిమీర తరుగు చల్లుకుని తినేయాలి.

టాపిక్