Shani Puja: శని దేవునికి ఎదురుగా నిలబడి పూజించకూడదని ఎందుకంటారు? శని విగ్రహాన్ని ఎందుకు ముట్టుకోకూడదు?
Shani Puja: హిందూ శాస్త్రాల ప్రకారం శనిదేవుడు చాలా శక్తిమంతుడు. శని దేవుడికి ఎదురుగా నిలబడి పూజించకూడదు అంటారు. అలాగే శని భగవానుడిని ముట్టకోకూడదని చెబుతారు. అలా ఎందుకు అంటారు?
జ్యోతిష్య శాస్త్రం శని భగవానుడి కర్మ ఫలితాలనిచ్చే వాడు. శని తలచుకుంటే వ్యక్తి జీవితంల అల్లకల్లోలం అవువుతంది. అలాగే ఆయన అనుగ్రహం ఉంటే అదృష్టవంతులు అవుతారు. వాస్తవానికి శనిదేవుడు అందరూ భయపడినట్లుగా ప్రమాదకరమైన దేవుడు కాదు. న్యాయానికి ప్రతీక. ఆయనను ఆరాధించే భక్తులు అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. శనిదేవుని ఆశీర్వాదం పొందిన వారికి జీవితంలో ఏ లోటు ఉండదు కూడా. మరోవైపు శనీశ్వరుని ఆగ్రహానికి గురై శాపం తగిలితే వారిని సమస్యలు ఊరికే వదిలిపెట్టవు.
శనికి ఎదురుగా ఎందుకు నిలబడకూడదు?
శనిదోషం తగ్గాలంటే, కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. అందులో శనిదేవుని విగ్రహానికి ఎదురుగా నిల్చొని ఆరాధాన చేయకూడదనేది ఒకటి. హిందూ పురాణాల ప్రకారం, శని విగ్రహానికి ఎదురుగా లేదా ఆయన చూపు పడే ప్రదేశాల్లో నిల్చొని ఆరాధించకూడదు. మీ మీద ఆయన చూపు పడేట్లుగా ఉంటే కాస్త పక్కకు జరిగి పూజ చేసుకోవాలి. దీని గురించి శాస్త్రాల్లో స్పష్టమైన వివరణ కూడా ఉంది. అంతేకాకుండా శనిదేవుని సమక్షంలో చేతులు కట్టుకుని నిల్చోరాదు. ఆయనకు తల వంచి నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులు వెనక్కి పెట్టుకోవాలి. ఇంకొక విషయమేమిటంటే, శనిదేవుని మొక్కే సమయంలో తప్పుడు వాగ్దానాలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది. ఇతరులకు హాని చేయాలని తలపెట్టి వాగ్దానం చేసేవారిని ఆయనెప్పుడూ క్షమించడు.
శనిదేవుని ఆరాధించే కంటే ముందు హనుమంతుని ఆరాధించాలి. ఇంకా శనీశ్వరుని ఆలయంలో సూర్య భగవానుడు ఉండడు. ఇక్కడ ఒక నియమం ఉంది. శనిదేవుడు తన తండ్రి సూర్య భగవానుడి సమక్షంలో పూజలు అందుకోడు.
ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో శనిదేవుని ఆరాధిస్తే జీవితంలో చాలా అనుకూల ఫలితాలు ఎదురవుతాయి. అంతటి శుభఫలితాలు అందించే శనిదేవుని విగ్రహాన్ని ఇంట్లో మాత్రం ఉంచుకోకూడదని శాస్త్రం చెబుతుంది. ఆయన చూపు పడిన ఇల్లు, లేదా ఆయనను ఆరాధనలు అందుకున్న ప్రదేశంపై శని దుష్ప్రభావం చూపిస్తాడని ఆయనకు శాపం ఉంది.
శని విగ్రహాన్ని ఎందుకు ముట్టుకోకూడదు?
శని దేవుని విగ్రహాన్ని ముట్టుకోవడం గురించి కొన్ని ఆధ్యాత్మిక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. సాధారణంగా, దేవతల విగ్రహాలను శుభ్రంగా, గౌరవంగా పూజించాలి. కానీ విగ్రహాన్ని ముట్టుకోవడంపై కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. శని భగవానుడి విగ్రహాన్ని అవసరమైన పరిస్థితులలో ముట్టుకోవచ్చు. అన్ని పరిస్థితుల్లోనూ తాకడం సబబు కాదని, విగ్రహం శుభ్రపరచడానికి అంటుకుంటే తప్పుకాదని పెద్దలు చెబుతున్నారు. పూజ ముగిసిన తర్వాత ఆశీర్వాదం అందుకునేందుకు దేవుని విగ్రహాన్ని ముట్టుకోవచ్చు.
కొన్ని సంప్రదాయాలలో, శని భగవానుడి విగ్రహాన్ని ముట్టుకోవడం కంటే, ఆ విగ్రహం ముందు మనసు శుద్ధిగా ఉండి ప్రార్థనలు చేయడాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తారు.
జ్యోతిష్యం ప్రకారం, శనిదేవునికి కొన్ని ప్రత్యేక రోజుల్లో పూజలు చేయడం ద్వారా ఘనమైన ఫలితాలు పొందొచ్చు. శనిదోషం, ఏలినాటి శని ఉన్న వారు మాత్రమే శనిదేవుని ఆరాధించాలనే నియమం లేదు. ఆయన అనుగ్రహం దొరికితే ఎటువంటి వారికైనా శుభఫలితాలు ఉంటాయి.