Chevella Accident: చేవెళ్లలో ఘోర ప్రమాదం, రోడ్డుపై కూరగాయలమ్మే వారిపై దూసుకెళ్ళిన లారీ, భారీగా ప్రాణనష్టం-fatal accident in chevella lorry rams into people selling vegetables on the road heavy loss of life ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Chevella Accident: చేవెళ్లలో ఘోర ప్రమాదం, రోడ్డుపై కూరగాయలమ్మే వారిపై దూసుకెళ్ళిన లారీ, భారీగా ప్రాణనష్టం

Chevella Accident: చేవెళ్లలో ఘోర ప్రమాదం, రోడ్డుపై కూరగాయలమ్మే వారిపై దూసుకెళ్ళిన లారీ, భారీగా ప్రాణనష్టం

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 02, 2024 05:33 PM IST

Chevella Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరి స్టేజ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కూరగాయాలు అమ్ముకునే వారిపైకి సిమెంట్ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పాట్‌లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 20మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

చేవెళ్లలలో ఘోర ప్రమాదం, కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లిన లారీ
చేవెళ్లలలో ఘోర ప్రమాదం, కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లిన లారీ

Chevella Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న వారిపైకి లారీ దూసుకుపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. చేవెళ్ల సమీపంలోని ఆలూరు రైల్వే గేటు దగ్గర కూరగాయలు అమ్మే వారిపై లారీ దూసుకెళ్లి నలుగురి దుర్మరణం పాలయ్యారు. చేవెళ్ల మండలం ఆలూర్ స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వారిపైకి లారీ దూసుకెళ్లింది ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. లారీ కింద క్షతగాత్రులు చిక్కుకుపోయారు.

ఏపీ 29 టీబీ 0945 నంబర్ సిమెంట్‌ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వారిపైకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం భారీగా పెరిగే అవకాశం ఉంది. కూరగాయాల విక్రేతల్ని ఢీ కొన్న తర్వాత లారీ అదుపు తప్పి రోడ్డు మార్జిన్‌లో ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగింది. దాదాపు 20మందికి పైగా కాళ్ళు చేతులు విరిగి పోయాయి. కూరగాయలు అమ్మేవారు, కొనే వారు ఈ ఘటనలో గాయపడ్డారు.

Whats_app_banner