చలికాలంలో పాలల్లో పసుపు కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Dec 02, 2024
Hindustan Times Telugu
గోరువెచ్చని పాలల్లో పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే దీన్ని గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ పసుపు పాలు తాగడం వల్ల సీజనల్ రోగాలు, ఇన్ఫెక్షన్ల రిస్క్ తగ్గడం సహా చాలా లాభాలు ఉంటాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Photo: Pexels
చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. పాలల్లో పసుపు కలిపి తాగితే వీటి నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపులోని యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఇందుకు సహకరిస్తాయి.
Photo: Pexels
పసుపు పాలు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. చలికాలంలో ఇది చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ మెరుగ్గా ఉంటే సీజనల్ రోగాల బారి పడే రిస్క్ తగ్గుతుంది.
Photo: Pexels
చలికాలంలో పొడిబారడం సహా చర్మానికి మరిన్ని సవాళ్లు ఎదురవుతాయి. పసుపు పాలు తాగడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. చర్మపు మెరుపు పెరిగేందుకు పసుపులోని గుణాలు సహకరిస్తాయి.
Photo: Pexels
పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది. పసుపులో ఉన్న కర్కమిన్.. నాణ్యమైన నిద్రకు తోడ్పడుతుంది. నిద్రించే ముందు ఈ పసుపు పాలు తాగితే చాలా మంచిది.
Photo: Pexels
వాతావరణం చల్లగా ఉంటే కీళ్ల నొప్పులు తీవ్రమవుతుంటాయి. పసుపు పాల్లోని యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇవ్వగలవు. అందుకే వీటిని చలికాలంలో రెగ్యులర్‌గా తీసుకోవాలి.
Photo: Pexels
పసుపు పాలు తాగడం వల్ల శరీరంలో జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. జీర్ణక్రియ కూడా బాగా ఉంటుంది. అందుకే బరువు తగ్గేందుకు కూడా ఇవి తాగడం మేలు చేస్తుంది.