Best electric car for long trips : లాంగ్ ట్రిప్స్ కోసమే ఈ టాటా ఈవీ- హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే…
Tata Curvv EV on road price in Hyderabad : లాంగ్ డ్రైవ్, లాంగ్ ట్రిప్స్‌కి వెళ్లేందుకు ఉన్న ఎలక్ట్రిక్ కార్ల ఆప్షన్స్‌లో టాటా కర్వ్ ఈవీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో టాటా కర్వ్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎలక్ట్రిక్ వాహనాలను నగరాల్లో ఎలాగైనా వాడొచ్చు. కానీ లాంగ్ డ్రైవ్స్‌లో ఛార్జింగ్, బ్యాటరీ సమస్యలు వస్తే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది ఈవీ కొనేందుకు డౌట్ పడుతున్నారు. అయితే, లాంగ్ డ్రైవ్ కోసమే టాటా మోటార్స్ నుంచి ఒక ఎలక్ట్రిక్ కారు వచ్చింది. దీని పేరు టాటా కర్వ్ ఈవీ. ఇదొక కూపే ఎస్యూవీ. సింగిల్ ఛార్జ్‌తో 585కి.మీ వరకు రేంజ్‌ని ఈ కారు ఇస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో టాటా కర్వ్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో టాటా కర్వ్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్..
టాటా కర్వ్ ఈవీ క్రియేటివ్ 45 కేడబ్ల్యూ- రూ. 18,39,925
టాటా కర్వ్ ఈవీ అకంప్లీష్డ్ 45 కేడబ్ల్యూ- రూ. 19.45 లక్షలు
టాటా కర్వ్ ఈవీ అకంప్లీష్డ్ 55 - రూ. 20.24 లక్షలు
టాటా కర్వ్ ఈవీ అకంప్లీష్డ్ ప్లస్ ఎస్ 45- రూ. 20.28 లక్షలు
టాటా కర్వ్ ఈవీ అకంప్లీషీడ్ ప్లస్ ఎస్ 55- రూ. 21.01 లక్షలు
టాటా కర్వ్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ 55- రూ. 22.33 లక్షలు
ఎంపవర్డ్ ప్లస్ ఏ 55- రూ. 23.11 లక్షలు.
అంటే హైదరాబాద్‌లో టాటా కర్వ్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ ధర రూ. 18.3 లక్షల నుంచి రూ. 23.11 లక్షల వరకు ఉంటుంది.
సాధారణంగా వెహికల్‌కి ఎక్స్‌షోరూం ప్రైజ్, ఆన్‌రోడ్ ప్రైజ్‌లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో ఆటోమొబైల్ సంస్థలు ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్‌రోడ్ ప్రైజ్ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్‌ని కొనే ముందు, ఎక్స్‌షోరూం ప్రైజ్ కాకుండా ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకుని బడ్జెట్ వేసుకోవాలి. సమీప డీలర్షిప్ షోరూమ్స్ని సందర్శిస్తే.. ఆ సమయంలో వెహికిల్‌పై ఏవైనా ఆఫర్స్ ఉన్నాయా? అనేది కూడా తెలుస్తుంది. అది ఖర్చు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
టాటా కర్వ్ ఈవీ బ్యాటరీ- రేంజ్ వివరాలు..
టాటా కర్వ్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి.. 45 కిలోవాట్, 55 కిలోవాట్ల బ్యాటరీ. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు 165 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో కనెక్ట్ చేసి ఉంటాయి. 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అమర్చిన కర్వ్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 585 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్‌ని అందిస్తుంది. 45 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఫుల్ ఛార్జ్ చేస్తే 425 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. కర్వ్ ఈవీ 15 నిమిషాల్లో 150 కిలోమీటర్లను కవర్ చేయగలదని టాటా మోటార్స్ పేర్కొంది. R ఈవీ కేవలం 8.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
సంబంధిత కథనం