Best Electric car for city : సిటీ డ్రైవ్ కోసమే ఈ ఎలక్ట్రిక్ కారు- హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే…
MG Comet EV on road price in Hyderabad : సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేసి విసుగెత్తిపోయారా? అయితే మీరు ఎంజీ కామెట్ ఈవీని చూడాల్సిందే! నగర ప్రయాణాల కోసమే రూపొందించి ఎలక్ట్రిక్ కారు ఇది. హైదరాబాద్‌లో ఎంజీ కామెట్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నగరాల్లో ట్రాఫిక్ మధ్య ఎక్కువ డ్రైవ్ చేస్తూ, అందుకు ఉపయోగపడే విధంగా ఒక ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే మీకు ఎంజీ కామెట్ ఈవీ కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ బుడ్డి ఈవీ.. ఒక బెస్ట్ సెల్లింగ్ సిటీ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎంజీ కామెట్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ చూడండి. ఇది మీకు ఉపయోగపడుతుంది.
ఎంజీ కామెట్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్
- ఎంజీ కామెట్ ఈవీ ఎగ్జైట్- రూ. 8.42 లక్షలు
- ఎంజీ కామెట్ ఈవీ ఎగ్జైట్ ఎఫ్‌సీ- రూ. 8.92 లక్షలు
- ఎంజీ కామెట్ ఈవీ ఎక్స్‌క్లూజివ్- రూ. 9.50 లక్షలు
- ఎంజీ కామెట్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సీ- రూ. 9.88 లక్షలు
- ఎంజీ కామెట్ ఈవీ 100 ఇయర్ లిమిటెడ్ ఎడిషన్- రూ. 10.04 లక్షలు
అంటే.. హైదరాబాద్‌లో ఎంజీ కామెట్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ ధరలు రూ. 8.42 లక్షలు- రూ. 10.04 లక్షల మధ్యలో ఉంటుందని అర్థం. ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ వెహికిల్ ఎగ్జైట్ ఎఫ్‌సీ వేరియంట్ బెస్ట్ సెల్లింగ్‌గా కొనసాగుతోంది.
సాధారణంగా ఆటోమొబైల్ సంస్థలు కొత్త వెహికిల్స్‌ని లాంచ్ చేసే సమయంలో వాటి ఎక్స్‌షోరూం ప్రైజ్‌ని మాత్రమే చెబుతాయి. ఇది ఆన్‌రోడ్ ప్రైజ్‌కి భిన్నంగా ఉంటాయి. అందుకే ఒక కారును కొనే ముందు దాని ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే.. ఆఫర్స్, డిస్కౌంట్స్ వంటి వివరాలు కూడా తెలుస్తాయి. అవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఎంజీ కామెట్ ఈవీ రేంజ్..
ఎంజీ కామెట్ ఈవీ రేంజ్ 230 కిలో మీటర్లు. 7.4 కిలోవాట్ల ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఎంజీ కామెట్లో ఛార్జింగ్ సమయాన్ని 3.5 గంటలు (0-100 శాతం) కంటే తక్కువకు తెస్తుంది. ఇది 3.3 కిలోవాట్ల ఎసి ఛార్జర్‌పై 7 గంటలు. 17.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ నుంచి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్లలో రేర్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఈఎస్సీ, హిల్-హోల్డ్ కంట్రోల్, బాడీ కలర్లో ఫినిష్ చేసిన ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ రేర్ వ్యూ మిర్రర్లు, క్రిప్ మోడ్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.
సంబంధిత కథనం