Aishwarya Rai Divorce: మీ భార్య చెప్పినట్లు వినండి..: ఐశ్యర్య రాయ్‌తో విడాకుల వార్తల నేపథ్యంలో అభిషేక్ కామెంట్స్ వైరల్-abhishek bachchan comments viral aishwarya rai divorce rumors ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aishwarya Rai Divorce: మీ భార్య చెప్పినట్లు వినండి..: ఐశ్యర్య రాయ్‌తో విడాకుల వార్తల నేపథ్యంలో అభిషేక్ కామెంట్స్ వైరల్

Aishwarya Rai Divorce: మీ భార్య చెప్పినట్లు వినండి..: ఐశ్యర్య రాయ్‌తో విడాకుల వార్తల నేపథ్యంలో అభిషేక్ కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Dec 02, 2024 06:43 PM IST

Aishwarya Rai Divorce: ఐశ్వర్య రాయ్ తో విడాకుల వార్తల నేపథ్యంలో ఆమె భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ పెళ్లయిన మగవారికి ఇచ్చిన సలహా వైరల్ అవుతోంది. భార్య చెప్పినట్ల వినండి అని అతడు అనడం గమనార్హం.

మీ భార్య చెప్పినట్లు వినండి..: ఐశ్యర్య రాయ్‌తో విడాకుల వార్తల నేపథ్యంలో అభిషేక్ కామెంట్స్ వైరల్
మీ భార్య చెప్పినట్లు వినండి..: ఐశ్యర్య రాయ్‌తో విడాకుల వార్తల నేపథ్యంలో అభిషేక్ కామెంట్స్ వైరల్

Aishwarya Rai Divorce: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పెళ్లి వార్తలు ఎంతటి వైరల్ అయ్యాయో.. ఇప్పుడు వాళ్ల విడాకుల వార్తలు కూడా అంతే సంచలనం రేపుతున్నాయి. కొన్ని నెలలుగా ఈ జంట విడిపోతున్నట్లుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మధ్యే ఓ అవార్డు షో కోసం వెళ్లిన అభిషేక్.. పెళ్లయిన మగవారిని సంబంధించిన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భార్య మాటే వినండి: అభిషేక్

అభిషేక్ బచ్చన్ ఈ మధ్యే ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డులు 2024 సెర్మనీకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన రీసెంట్ సినిమాల్లో తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత పెళ్లయిన మగవారికి కూడా అభిషేక్ ఓ సలహా ఇచ్చాడు. సినిమాల్లో వరుసగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఎలా సాధ్యమని హోస్ట్ అడిగారు.

దీనికి అభిషేక్ స్పందిస్తూ.. "ఇది చాలా సింపుల్. మేం చేసేదేమీ లేదు. డైరెక్టర్ మాకు ఏది చెబితే అది చేస్తాం. కామ్ గా పని చేసి ఇంటికి వచ్చేస్తాం" అని అన్నాడు. అలాగే భార్య మాట కూడా వింటారా అని హోస్ట్ సరదాగా ప్రశ్నించారు. దీనికి అభిషేక్ కూడా సరదాగానే స్పందించాడు. "అవును, పెళ్లయిన మగవాళ్లందరూ అదే పని చేయాలి. మీ భార్య చెప్పినట్లే వినండి" అని అభిషేక్ అనడం గమనార్హం. ఐశ్వర్య రాయ్ తో విడాకుల వార్తల నేపథ్యంలో అతడు చేసిన కామెంట్స్ కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారా?

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అయితే ఇప్పుడు 17 ఏళ్లకు వీళ్లు విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు సంచలనం రేపాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి వీళ్లు వేరువేరుగా రావడంతో విడాకుల పుకార్లు మరింత ముదిరాయి.

అంతేకాదు ఈ ఏడాది ఐశ్యర్యరాయ్ బర్త్ డేతోపాటు వాళ్ల కూతురు బర్త్ డే వేడుకలకు కూడా అభిషేక్ రాకపోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే వీటిపై ఇంత వరకూ వీళ్లు నోరు విప్పలేదు. కానీ భార్య మాట వినండి అంటూ అభిషేక్ చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.

మరోవైపు అభిషేక్ ఈ మధ్యే షూజిత్ సిర్కార్ డైరెక్ట్ చేసిన ఐ వాంట్ టు టాక్ అనే మూవీలో నటించాడు. ఈ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. బాక్సాఫీస్ దగ్గర మూవీ విఫలమైనా.. క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఇక అభిషేక్ బీ హ్యాపీ, కింగ్, హౌజ్‌ఫుల్ 5లాంటి మూవీస్ లో నటించబోతున్నాడు.

Whats_app_banner