Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ భర్తతో సీక్రెట్‌గా రొమాన్స్.. వాళ్ల విడాకుల పుకార్లకు కారణమైన నిమ్రత్ రియాక్షన్ ఇదీ-aishwarya rai abhishek bachchan divorce rumors nimrat kaur reacts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ భర్తతో సీక్రెట్‌గా రొమాన్స్.. వాళ్ల విడాకుల పుకార్లకు కారణమైన నిమ్రత్ రియాక్షన్ ఇదీ

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ భర్తతో సీక్రెట్‌గా రొమాన్స్.. వాళ్ల విడాకుల పుకార్లకు కారణమైన నిమ్రత్ రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu
Nov 06, 2024 07:47 AM IST

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ భర్త, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తమ 17 ఏళ్ల వివాహ బంధానికి విడాకులతో తెర దించబోతున్నారని పుకార్లు వస్తున్న విషయం తెలుసు కదా. వీటికి కారణమైన నటి నిమ్రత్ కౌర్ తమ రిలేషన్షిప్ పై స్పందించింది.

ఐశ్వర్య రాయ్ భర్తతో సీక్రెట్‌గా రొమాన్స్.. వాళ్ల విడాకుల పుకార్లకు కారణమైన నిమ్రత్ రియాక్షన్ ఇదీ
ఐశ్వర్య రాయ్ భర్తతో సీక్రెట్‌గా రొమాన్స్.. వాళ్ల విడాకుల పుకార్లకు కారణమైన నిమ్రత్ రియాక్షన్ ఇదీ

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోవడం ఖాయమేనా? ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస పరిణామాలు అదే నిజమంటున్నాయి. ఈ నెల 1న ఐశ్వర్య రాయ్ తన 51వ పుట్టిన రోజు జరుపుకున్న సమయంలోనూ బచ్చన్ కుటుంబం ఆమెకు కనీసం విష్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ గొడవకు కారణమైన నటి నిమ్రత్ కౌర్ మొదటిసారి అభిషేక్ బచ్చన్ తో రిలేషన్షిప్ పై స్పందించింది.

నిమ్రత్ కౌర్ రియాక్షన్ ఇదీ

ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ దస్వీ అనే మూవీలో నిమ్రత్ కౌర్ తో కలిసి నటించాడు. అప్పటి నుంచీ ఈ ఇద్దరి మధ్య సీక్రెట్ గా రొమాన్స్ నడుస్తోందని, అది తెలిసే ఐశ్వర్య అతనికి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలుసు కదా. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఐశ్వర్యగానీ, అభిషేక్ గానీ స్పందించలేదు.

మొదటిసారి నిమ్రత్ వీటిపై మాట్లాడింది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో ఆమె పరోక్షంగా ఈ పుకార్లపై స్పందించింది. తాను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నట్లు ఆమె స్పష్టం చేసింది. జూమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింగిల్‌డమ్ పై ఇంటర్వ్యూయర్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ నిమ్రత్ తలాడించింది. అయితే ఈ ఇంటర్వ్యూను ఎడిట్ చేసి వెంటనే ఆమె సింగిల్ వుమెన్ కు ట్రావెల్ టిప్స్ ఇచ్చినట్లుగా చూపించారు.

పుకార్లను ఆపలేం కదా: నిమ్రత్

నిజానికి అంతకుముందు కూడా ఈ పుకార్లపై నిమ్రత్ మాట్లాడింది. అభిషేక్ బచ్చన్ తో డేటింగ్ పుకార్లపై నిమ్రత్ స్పందించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు వెల్లడించింది. "నేను ఏం చేసినా వాళ్లు అనాల్సింది అంటూనే ఉంటారు. ఇలా పుకార్లను ఆపడం కష్టం. అందుకే నేను నా పనిపైనే దృష్టి పెడతాను" అని నిమ్రత్ చెప్పింది.

ఐశ్వర్య, అభిషేక్ విడాకుల పుకార్ల నేపథ్యంలో బచ్చన్ కుటుంబం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐశ్వర్య అభిమానుల నుంచి ఆ కుటుంబానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బచ్చన్ కుటుంబానికి సన్నిహితులైన ఓ వ్యక్తి అభిషేక్, నిమ్రత్ డేటింగ్ పుకార్లపై స్పందించారు. ఇదో చెత్త, తప్పుదారి పట్టించే, తుంటరి పని అంటూ ఆ వ్యక్తి అన్నారు.

"ఈ పుకార్లలో అణువంతైనా నిజం లేదు. ఆమె (నిమ్రత్) ఎందుకు దీనిని ఖండించడం లేదో అర్థం కావడం లేదు. ప్రస్తుతం తన జీవితంలో ఎనో సమస్యలు ఉండటంతో అభిషేక్ కూడా దీనిపై మాట్లాడటం లేదు. ఈ వివాదం నుంచి దూరంగా ఉండాలని అతనికి సలహా ఇచ్చాం" అని ఆ వ్యక్తి వెల్లడించారు. మరి అభిషేక్, ఐశ్వర్య విడాకుల పంచాయితీ ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.

Whats_app_banner