OTT Kannada Action Thriller: ఓటీటీలోకి తొమ్మిది నెలల తర్వాత తెలుగులో వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ..-ott kannada action thriller movie karataka damanaka now streaming in telugu on prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Kannada Action Thriller: ఓటీటీలోకి తొమ్మిది నెలల తర్వాత తెలుగులో వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ..

OTT Kannada Action Thriller: ఓటీటీలోకి తొమ్మిది నెలల తర్వాత తెలుగులో వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ..

Hari Prasad S HT Telugu
Dec 02, 2024 05:13 PM IST

OTT Kannada Action Thriller: ఓటీటీలోకి తొమ్మిది నెలల తర్వాత ఓ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు రావడం విశేషం.ఈ ఏడాది మార్చిలో రిలీజై డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, ప్రభుదేవాలాంటి వాళ్లు నటించడం విశేషం.

ఓటీటీలోకి తొమ్మిది నెలల తర్వాత తెలుగులో వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి తొమ్మిది నెలల తర్వాత తెలుగులో వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ..

OTT Kannada Action Thriller: ఓ డిజాస్టర్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ తోపాటు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కూడా నటించిన ఈ మూవీ పేరు కరటక దమనక. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది.

కరటక దమనక ఓటీటీ స్ట్రీమింగ్

కరటక దమనక మూవీ ఈ ఏడాది మార్చి 8న థియేటర్లలో రిలీజైంది. కొన్ని రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఇప్పుడు సుమారు 9 నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రావడం విశేషం.

ఈ కరటక దమనక ఓ యాక్షన్ డ్రామా. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.2.8 కోట్లు మాత్రమే రాబట్టగా.. ఐఎండీబీలోనూ కేవలం 4.9 రేటింగ్ మాత్రమే వచ్చింది. అయితే కన్నడ యాక్షన్ మూవీస్ ఇష్టపడే తెలుగు వారి కోసం ఇప్పుడీ సినిమా తెలుగులోనూ రావడంతో కాస్త ఆదరణ లభించే అవకాశం ఉంది.

ఏంటీ కరటక దమనక మూవీ స్టోరీ?

కరటక దమనక మూవీని యోగరాజ్ భట్ డైరెక్ట్ చేశాడు. శివ రాజ్ కుమార్ తోపాటు ప్రభుదేవా, ప్రియా ఆనంద్, నిశ్వికా నాయుడులాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. పంచతంత్రలోని మిత్ర భేదం పుస్తకంలోని పాత్రల నుంచి ఈ సినిమా టైటిల్ ను తీసుకున్నారు.

ఇది ఇద్దరు మోసగాళ్ల చుట్టూ తిరిగే కథ. కర్ణాటకలోని నందికోలు అనే గ్రామం కరువు కాటకాలతో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆ సమయంలో ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని తిరిగి తీసుకురావడం కోసం ఈ ఇద్దరూ అక్కడ అడుగుపెడతారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చేందుకు ఇద్దరూ చెరో దారి వెతుక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఇద్దరూ తమకు అప్పగించిన పనిలో సక్సెస్ అయ్యారా లేదా అన్నది ఈ కరటక దమనక మూవీలో చూడొచ్చు.

ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడీ మూవీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ రావడంతో ఓటీటీలో అయినా ఈ మూవీకి కాస్త మంచి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.

Whats_app_banner