Pushpa 2 Tickets: పుష్ప 2 టికెట్లు కావాలా.. మీకో బంపర్ ఆఫర్.. లెజెండరీ క్రికెటర్ డివిలియర్స్ చెప్పినట్లు ఇలా చేయండి
Pushpa 2 Tickets: పుష్ప 2 టికెట్ల కోసం ఇప్పుడు అభిమానులు ఎగబడుతున్నారు. ఎంత రేటైనా పెట్టి అయినా టికెట్లు కొనడానికి సిద్ధంగా ఉన్నా దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్.. అల్లు అర్జున్ అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు.
Pushpa 2 Tickets: పుష్ప 2 మూవీ క్రేజ్ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుధవారం (డిసెంబర్ 4) అర్ధరాత్రి నుంచి స్పెషల్ షోలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ల కోసం కిందామీదా పడుతున్న అభిమానుల కోసం సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. అదేంటో చూడండి.
పుష్ప 2 టికెట్లు కావాలా.. ఇలా చేయండి
అసలు పుష్ప 2 మూవీకి.. ఎక్కడో సౌతాఫ్రికాలో ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కు సంబంధం ఏంటనే డౌట్ మీకు రావచ్చు. కానీ అతడు Wolf7Pay అనే ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ కోసం చేసిన ప్రమోషన్లో భాగంగా ఏకంగా పది వేల పుష్ప 2 టికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పడం విశేషం. దీనికోసం ఏం చేయాలో కూడా అతడు ఓ ప్రత్యేకంగా రిలీజ్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను తన ఎక్స్ అకౌంట్లో అతడు పోస్ట్ చేశాడు. తగ్గేదేలే అంటూ పుష్ప మూవీలోని డైలాగ్ తో ఆ వీడియోను ఏబీ మొదలుపెట్టాడు.
"అందరికీ హాయ్.. సినిమా లవర్స్ అందరి కోసం నేనో ఉత్సాహకరమైన వార్త తీసుకొచ్చాను. @Wolf7Payలో కనీసం రూ.100, అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసే తొలి 10 వేల మంది డిపాజిటర్లకు ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ పుష్ప 2 టికెట్లు అందుతాయి. ఏమాత్రం వేచి చూడకండి. ఇది ఈ శనివారం (డిసెంబర్ 7)తో ముగుస్తుంది. బాధ్యతాయుతంగా ఆడి, కింద ఉన్న లింకుపై క్లిక్ చేసి ఈ ప్లేస్ కన్ఫమ్ చేసుకోండి" అనే క్యాప్షన్ తో ఏబీ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
పుష్ప 2 టికెట్స్.. ఫుల్ డిమాండ్
పుష్ప 2 టికెట్లంటూ ఏబీ డివిలియర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. @Wolf7Pay ప్రపంచంలోనే ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ పోర్టల్ ను ఎండార్స్ చేస్తున్నారు. తాజాగా పుష్ప 2 మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ ద్వారా ఈ స్పెషల్ ఆఫర్ ఇస్తుండటం విశేషం. గురువారం (డిసెంబర్ 5) రిలీజ్ కాబోతున్న ఈ పుష్ప 2 మూవీ కోసం కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మూవీ టికెట్ల ధరలు భారీగా పెంచేసినా ఎగబడి కొంటున్నారు. మరోవైపు తెలంగాణలో పుష్ప 2 మూవీ టికెట్ల ధర పెంపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. దీనిపై మంగళవారం (డిసెంబర్ 3) కోర్టు విచారణ జరపనుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి పుష్ప 2 మూవీ కోసం టికెట్ల ధరలను ఊహకందని విధంగా పెంచేయడం గమనార్హం.
సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప 2 మూవీ 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్. ఆ మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూలు చేయడం ఖాయమని భావిస్తున్నారు.