తెలుగు న్యూస్ / ఫోటో /
Korean Dramas: కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. మిస్ కాకుండా చూడండి.. థ్రిల్ అవడం గ్యారెంటీ
- Korean Dramas: కొరియన్ డ్రామాస్ కు ఇండియాలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. అయితే అక్కడి ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ వచ్చాయిన. అవేంటో చూడండి.
- Korean Dramas: కొరియన్ డ్రామాస్ కు ఇండియాలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. అయితే అక్కడి ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ వచ్చాయిన. అవేంటో చూడండి.
(1 / 7)
Korean Dramas: కొరియన్ మూవీస్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లతో వస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మిస్టరీ, థ్రిల్లర్ సబ్జెక్టులతో వచ్చే మూవీస్ మిస్ కాకుండా చూడాల్సిందే.
(2 / 7)
Korean Dramas: ఆస్కార్ గెలిచిన కొరియన్ మూవీ పారాసైట్. 2019లో వచ్చిన ఈ మూవీకి ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉంది. ఓ ధనవంతుడి ఇంట్లో పాగా వేసిన ఓ నిరుపేద కుటుంబం చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ మూవీ క్లైమ్యాక్స్ ఊహించని ట్విస్టుతో ముగుస్తుంది.
(3 / 7)
Korean Dramas: కొరియన్ మూవీ ట్రెయిన్ టు బూసాన్ 2016లో వచ్చిన థ్రిల్లర్ మూవీ. జాంబీల కథాంశంతో వచ్చిన మరో మిట్ మూవీ ఇది. జాంబీల నుంచి కాపాడుకోవడానికి ఓ తండ్రి చేసే ప్రయత్నమే ఈ సినిమా.
(4 / 7)
Korean Dramas: కొరియా నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ ది వైలింగ్ (The Wailing). 2016లోనే వచ్చిన ఈ సినిమా కూడా ఓ వింత మహమ్మారి చుట్టూ తిరుగుతుంది. ఓ విదేశీయుడి ద్వారా ఓ గ్రామానికి పాకిన వైరస్ వల్ల అక్కడి వాళ్లు తమ ప్రాణాల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
(5 / 7)
Korean Dramas: కొరియన్ మూవీ ఫర్‌గాటెన్ (Forgotten) కూడా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీయే. 17 రోజుల పాటు కిడ్నాప్ కు గురైన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తన జ్ఞాపకాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందన్నది తెలుసుకుంటే అంతుబట్టని విషయాలు తెలుస్తాయి. తర్వాత ఏం జరిగిందో ఈ మూవీలో చూడొచ్చు.
(6 / 7)
Korean Dramas: హారర్, మిస్టరీ జానర్ లో ఓ అద్భుతమైన మూవీ చూడాలనుకుంటే 2023లో వచ్చిన స్లీప్ సినిమా చూడాల్సిందే. మూవీ క్లైమ్యాక్స్ కు చాలా మంది ఫిదా అయ్యారు.
ఇతర గ్యాలరీలు