Keerthy Suresh husband: కీర్తి సురేశ్ పెళ్లాడిన ఆంటోని తాటిల్ ఎవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? తెగ శోధిస్తున్న నెటిజన్లు
Keerthy Suresh Wedding: ఆంటోని తాటిల్‌తో 15 ఏళ్లు గోప్యంగా ప్రేమాయణం నడిపిన కీర్తి సురేశ్.. ఇరు వైపులా పెద్దల్ని ఒప్పించి గురువారం పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆంటోని తాటిల్ ఎవరు? అతను ఏం చేస్తుంటాడో తెలుసా?
హీరోయిన్ కీర్తి సురేశ్ గురువారం (డిసెంబరు 12న) పెళ్లి చేసుకుంది. పరిమిత సంఖ్యలో అతిథులు, బంధువుల సమక్షంలో దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆంటోనీ తాటిల్‌తో ఈరోజు వివాహ బంధంలోకి కీర్తి సురేశ్ అడుగుపెట్టింది. అట్టహాసంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలకి సంబంధించిన ఫొటోలను కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
15 ఏళ్లు గోప్యంగా ప్రేమయాణం
నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. అసలు ఆంటోనీ తాటిల్ ఎవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అని తెగ శోధిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? వీరిది ప్రేమ వివాహం. దాదాపు 15 ఏళ్ల పాటు గోప్యంగా ప్రేమాయణం నడిపిన ఈ జంట.. పెద్దల్ని ఒప్పించి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
ఎవరు ఆంటోని తాటిల్
ఆంటోనీ తాటిల్ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త. అతని స్వస్థలం కొచ్చికాగా.. అక్కడ రిసార్టు ఫ్రాంఛైజీ నిర్వహిస్తున్నారు. కీర్తి స్వస్థలమైన చెన్నైలో కూడా ఆంటోనీకి రిసార్ట్‌లు ఉన్నాయి. బిజినెస్‌మెన్ అయినప్పటికీ.. ఆంటోనీ తాటిల్ సిగ్గరి అని తెలుస్తోంది. దాంతో ఇన్నేళ్ల ప్రేమాయణంలో ఎప్పుడూ మీడియా ముందు లేదా సోషల్ మీడియాలో కీర్తి సురేశ్‌తో కలిసి అతను కనిపించలేదు. తన ప్రొఫైల్‌ను హైడ్ చేస్తూ వచ్చారు.
కీర్తి, ఆంటోని టీనేజ్ నుంచే స్నేహితులు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కానీ. .అటు కీర్తి.. అటు ఆంటోని ఈ విషయాన్ని దశాబ్దకాలంగా గోప్యంగా ఉంచారు. గోవాలో ఈరోజు జరిగిన పెళ్లికి కీర్తి సురేశ్, ఆంటోని స్నేహితులు, బంధువులు, పరిమిత సంఖ్యలో అతిథులు మాత్రమే హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఏడేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కీర్తి సురేష్.. ఆ తర్వాత ఐదేళ్లు విరామం తీసుకుని తన చదువు పూర్తి చేసింది. అనంతరం 2013లో గీతాంజలి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. తెలుగులో నేను లోకల్, నేను శైలజ సినిమాలతో స్టార్‌డమ్‌ను అందుకుని.. మహానటితో నేషనల్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది దీపావళి రోజున తన ప్రేమ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా బహిర్గతం చేసిన కీర్తి సురేశ్.. ఈరోజు పెళ్లి చేసుకుంది.