Keerthy Suresh Marriage: కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోయేది ఇతడినే.. వీళ్ల 14 ఏళ్ల లవ్ స్టోరీ తెలుసా?-keerthy suresh marriage tollywood actress to marry her boyfriend antony thattil in goa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Keerthy Suresh Marriage: కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోయేది ఇతడినే.. వీళ్ల 14 ఏళ్ల లవ్ స్టోరీ తెలుసా?

Keerthy Suresh Marriage: కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోయేది ఇతడినే.. వీళ్ల 14 ఏళ్ల లవ్ స్టోరీ తెలుసా?

Hari Prasad S HT Telugu
Nov 19, 2024 11:46 AM IST

Keerthy Suresh Marriage: కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతోందని ఈ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ నే పెళ్లాడనున్నట్లు, గోవాలో వీళ్లు ఒక్కటి కాబోతున్నట్లు తాజాగా మరో రిపోర్టు వెల్లడించింది.

కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోయేది ఇతడినే.. వీళ్ల 14 ఏళ్ల లవ్ స్టోరీ తెలుసా?
కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోయేది ఇతడినే.. వీళ్ల 14 ఏళ్ల లవ్ స్టోరీ తెలుసా?

Keerthy Suresh Marriage: కీర్తి సురేశ్ పెళ్లి పీటలెక్కబోతోంది. ఆమె చాలా కాలంగా డేటింగ్ లో ఉంది. ఇప్పుడు తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ నే పెళ్లాడనున్నట్లు డెక్కన్ క్రానికల్ రిపోర్టు వెల్లడించింది. 14 ఏళ్ల వీళ్ల లవ్ స్టోరీ మొత్తానికి ఇప్పుడు పెళ్లి దాకా వెళ్లగా.. వచ్చే నెలలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు కూడా ఆ రిపోర్టు తెలిపింది.

కీర్తి సురేశ్ పెళ్లి చేసుకునేది ఇతడినే..

కీర్తి సురేశ్ సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉంది. హైస్కూల్లో మొదలైన తమ ప్రేమను వీళ్లు ఇప్పుడు పెళ్లి పీటల మీదికి తీసుకెళ్తున్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

కేరళలోని కొచ్చికి చెందిన ఆంటోనీని వచ్చే నెల 11, 12 తేదీల్లో గోవాలో వీళ్ల పెళ్లి జరగనున్నట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. ఆంటోనీ కేరళలోని ప్రముఖ రిసార్ట్ చెయిన్ కు ఓనర్ కావడం విశేషం. స్కూల్లోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

మొదలైన పెళ్లి పనులు

కీర్తి సురేశ్ పెళ్లి పనులు గోవాలో ఇప్పటికే మొదలయ్యాయి. ఆమె పెళ్లిపై తండ్రి, నటుడు, నిర్మాత అయిన సురేశ్ తోపాటు తల్లి మేనక కూడా కీర్తి పెళ్లిపై సంతృప్తిగా ఉన్నట్లు ఆ రిపోర్టు తెలిపింది.

కీర్తి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు కూడా చెప్పింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

పెళ్లి గురించి కీర్తి ఏం చెప్పిందంటే..

నిజానికి తన పెళ్లి వార్తలపై కీర్తి సురేశ్ ఈ మధ్యే స్పందించింది. డెక్కన క్రానికల్ ఈ పెళ్లి పుకార్ల గురించి ప్రశ్నించినప్పుడు.. "సరైన సమయం వచ్చినప్పుడు ఆ విషయం చెబుతాను" అని కీర్తి అనడం విశేషం.

ఇక గతేడాది కూడా తన ఫ్రెండ్ ఒకరిని తన బాయ్‌ఫ్రెండ్ అంటూ ఓ పత్రికలో రిపోర్టు రాగా.. దానిపై ఆమె స్పందించింది. "హహహ.. డొంక తిరుగుడు అవసరం లేది మై డియర్ ఫ్రెండ్. సరైన సమయం వచ్చినప్పుడు నిజమైన మిస్టరీ మ్యాన్ ఎవరో నేనే బయటపెడతా. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉండండి" అని కీర్తి ట్వీట్ చేసింది.

2013లో గీతాంజలి అనే మలయాళం మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేశ్.. 2018లో వచ్చిన మహానటి మూవీ ద్వారా ఓ లెవల్ కు వెళ్లింది. ఆ సినిమా కోసం నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది.

ఈ మధ్యే రఘు తాతా అనే సినిమా ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక బేబీ జాన్ మూవీ ద్వారా త్వరలోనే బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతోంది. వరుణ్ ధావన్ నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. మరో తమిళ మూవీ రివాల్వర్ రీటా, వెబ్ సిరీస్ అక్కా లోనూ కీర్తి సురేశ్ నటిస్తోంది.

Whats_app_banner