Goa trip cost: గోవా ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? ఎంత ఖర్చవుతుందో తెలుసుకోండి
Goa trip cost: ఎంతో మందికి గోవా వెళ్లాలని ఉంటుంది. కానీ ఖర్చుకు భయపడి వెళ్లడం మానేస్తారు. మరికొందరు ఎక్కువ ఖర్చు అవుతుందేమో అన్న అపోహలో వెళ్లరు. గోవా ట్రిప్ కు ఎంత ఖర్చవుతుందో తెలుసుకుంటే ముందే డబ్బుల పొదుపు చేసుకుని వెళ్లవచ్చు.
చాలా మందికి గోవా తిరగాలనిపిస్తుంది. బీచ్‌లకు కేరాఫ్ అడ్రెస్ గోవా. ఇండియాలో ఎక్కువ మందికి వెళ్లాలనిపించే డెస్టినేషన్ కూడా గోవానే. అందానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం ప్రతి ఒక్కరి మనసును ఆహ్లాదపరుస్తుంది. బీచ్ లో కూర్చొని చల్లని గాలులను ఆస్వాదించడం చాలా రిలాక్స్ గా ఉంటుంది. గోవాలోని కలంగుటే బీచ్ చాలా ఫేమస్. ఆకర్షణీయమైన బీచ్‌లు, జలపాతాలు, అనేక అద్భుతమైన ఆటలు ఈ బీచ్ ను పర్యాటకంగా మార్చింది. సాహసాలు చేసే ఔత్సాహికులకు ఇది ఉత్తమమైన బీచ్. చాలా మంది డిసెంబర్, జనవరి నెలల్లో గోవా వెళ్లాలని అనుకుంటారు. అలాంటప్పుడు ఈ నెలలో గోవా వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలి.
ఏ నెలల్లో వెళ్లాలి?
ప్రతి బీచ్ దగ్గర అందమైన అలంకరణలు, ప్రతిచోటా పార్టీలు ఏర్పాటు చేస్తారు. డిసెంబర్, జనవరి నెలల్లో గోవాకు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ రెండు నెలల్లో ప్రతిదాని రేటు రెట్టింపు అవుతుంది. సాధారణ రోజుల్లో రూ.200 నుంచి రూ.250 అద్దెకు లభించే స్కూటీలు… డిసెంబర్ నెలలో రూ.500కు పైగా లభిస్తోంది. అదే సమయంలో హోటల్ గదుల ఛార్జీలు కూడా పెరుగుతాయి. సాధారణ రోజుల్లో రూ.1000కు లభించే ఈ గది డిసెంబర్, జనవరి నెలల్లో రూ.2000 వరకు ఉంటుంది. కాబట్టి జనవరి, డిసెంబర్ నెలల్లో బడ్జెట్ రెట్టింపు అవుతుంది. మిగతా నెలల్లో గోవా వెళ్లడం మంచిది.
ఎంత ఖర్చు అవుతుంది?
గోవా వెళ్లాలనుకునే వారు చేతిలో పది వేల వరకు గోవాలో తిరగొచ్చు. పూర్తిగా పదివేల రూపాయలే అవుతుందని చెప్పలేము. సాధారణ నెలల్లో గోవా సంతృప్తిగా తిరగాలంటే చేతిలో 20 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు చేతిలో ఉండాల్సిందే. ఇక డిసెంబర్ నెలలో గోవా ట్రిప్‌ను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటే చేతిలో 50 వేల రూపాయలు నుంచి 80 వేల రూపాయలు చేతిలో ఉంచుకోవాలి. అంత డబ్బు ఉంటే గోవాలో యాక్టివిటీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఖర్చుతో మూడు రాత్రులు, నాలుగు పగళ్ళు ఉండొచ్చు.
గోవాలో ఫేమస్ బీచ్ కలంగుట్ బీచ్. దీన్ని కచ్చితంగా చూడాల్సిందే. ఇక్కడి బీచ్ లోని సముద్ర జలాలు చాలా పారదర్శకంగా ఉంటాయి. ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు చాలా అందంగా ఉంటాయి.
పాత గోవాకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ వాస్తు శిల్పాలు అందంగా ఉంటాయి. పాత గోవా వారసత్వ సంపదగా చెప్పుకుంటారు. ఇక్కడ పాత చర్చిలు, పురాతన మ్యూజియంలు ఉంటాయి.
గోవా రాజధాని పనాజీ ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ దూద్ సాగర్ జలపాతం చూడముచ్చటగా ఉంటుంది. ఇది 320 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు నుంచి కిందకి పడుతు ఉంటుంది.