OTT Malayalam Movies: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు మలయాళం మూవీస్.. ఒకటి బ్లాక్‌బస్టర్.. మరో మూడు కూడా..
OTT Malayalam Movies: ఓటీటీలోకి ఒకే రోజు రెండు లేటెస్ట్ మలయాళం సినిమాలు అడుగుపెట్టాయి. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ కాగా.. మరొకటి డిజాస్టర్ గా మిగిలిపోయిన మూవీ. ఈ రెండు మూవీస్ ఎక్కడ చూడాలంటే?
OTT Malayalam Movies: ఒకే రోజు రెండు వేర్వేరు ఓటీటీల్లోకి రెండు మలయాళం సినిమాలు వచ్చాయి. మంగళవారం (నవంబర్ 19) నుంచి బ్లాక్ బస్టర్ కిష్కింధ కాండమ్ తోపాటు డిజాస్టర్ మూవీ తెక్కు వడక్కు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కిష్కింధ కాండమ్ మాత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా ఈ థ్రిల్లర్ ను ఎంజాయ్ చేయొచ్చు.
ఓటీటీ మలయాళం మూవీస్
రెండు వేర్వేరు ఓటీటీల్లోకి ఈ రెండు మలయాళం సినిమాలు వచ్చాయి. వీటిలో బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధ కాండమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ ఆసిఫ్ అలీ నటించిన ఈ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది.
దింజిత్ అయ్యతన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర రూ.80 కోట్ల వరకూ వసూలు చేసింది. అపర్ణ బాలమురళీ, విజయరాఘవన్ లాంటి వాళ్లు కూడా నటించారు. ఓ మిస్సింగ్ గన్ చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది.
ఇక మంగళవారమే (నవంబర్ 19) ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళం సినిమా తెక్కు వడక్కు (Thekku Vadakku). ఇదొక సెటైరికల్ కామెడీ డ్రామా. ఓ రిటైర్డ్ ఇంజినీర్, రైస్ మిల్ ఓనర్ మధ్య శతృత్వంతో సాగే ఈ సినిమాకు థియేటర్లలో అంత మంచి రెస్పాన్స్ ఏమీ రాలేదు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. సూరజ్ వెంజరమూడు, వినాయకన్ నటించిన ఈ సినిమా మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీల్లోని లేటెస్ట్ మలయాళం మూవీస్
ఇవి రెండే కాదు.. ఈ మధ్య కాలంలో మరిన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చాయి. అందులో ఒకటి అదితట్టు. థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. గత శుక్రవారం (నవంబర్ 15) నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి సస్పెన్స్, థ్రిల్లర్ కావాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు.
ఇక మనోరమ మ్యాక్స్ లో ఉన్న మరో మలయాళం మూవీ సీక్రెట్. ఇది కూడా ఓ థ్రిల్లర్ మూవీయే. ఎస్ఎన్ స్వామి డైరెక్ట్ చేసిన సీక్రెట్.. ఆదివారం (నవంబర్ 17) నుంచి మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. భవిష్యత్తులో రాబోయే సవాలును ముందుగానే ఊహించి అందుకు సిద్ధమయ్యే పాత్ర చుట్టూ తిరిగే కథే ఈ సీక్రెట్ మూవీ.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న మరో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ఏఆర్ఎం. టొవినో థామస్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైనే వసూలు చేసింది. మూడు భిన్నమైన పాత్రల్లో టొవినో నటించిన ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.