Keerthy Suresh Wedding Card: హీరోయిన్ కీర్తి సురేశ్ వెడ్డింగ్ కార్డుని చూశారా? సోషల్ మీడియాలో చక్కర్లు
Keerthy Suresh Wedding Date: కీర్తి సురేశ్ తాను ప్రేమించి వ్యక్తిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకోబోతోంది. 15 ఏళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. ఇన్నాళ్లు ప్రియుడి వివరాల్ని గోప్యంగా ఉంచిన కీర్తి సురేశ్.. ఇటీవల ఒక పోస్టుతో అందరికీ క్లారిటీ ఇచ్చింది.
హీరోయిన్ కీర్తి సురేశ్ కొత్త జీవితం ప్రారంభించబోతోంది. 15 ఏళ్ల నుంచి తన స్నేహితుడైన ఆంటోని తటిల్‌తో కలిసి ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో గురువారం వైరల్‌గా మారింది. డిసెంబరు 12న గోవా వేదికగా కీర్తి సురేశ్ పెళ్లి జరగనుంది.
15 ఏళ్లుగా సీక్రెట్
వాస్తవానికి తన ప్రేమ విషయాన్ని ఇన్నాళ్లుగా కీర్తి సురేశ్ గోప్యంగా ఉంచింది. ఎక్కడా ఆంటోని తటిల్ పేరు లేదా ఫొటో బయటికి రాకుండా జాగ్రత్తపడింది. దాంతో కీర్తి సురేశ్ పెళ్లి.. అది కూడా ప్రేమించి.. పెద్దల్ని ఒప్పించి చేసుకుంటోందని తెలియగానే సినీ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో తన ప్రేమించిన ఆంటోని తటిల్‌తో కలిసి కీర్తి సురేశ్ ఏడు అడుగులు వేయబోతోంది.
పెళ్లికి గోవా ఆతిథ్యం
కీర్తి సురేశ్, ఆంటోని తటిల్ వివాహానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని కీర్తి సురేశ్ తండ్రి జి.సురేశ్ కుమార్ కూడా ధ్రువీకరించారు. తన కూతురు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోందని.. మీ ఆశీర్వాదాలు కావాలంటూ వెడ్డింగ్ కార్డులో కీర్తి సురేశ్ తల్లిదండ్రులు అతిథుల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంది. తొలుత హిందూ పద్ధతిలో.. ఆ తర్వాత క్రిస్టియన్ సంప్రదాయంలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్‌లో సినిమాలు
సౌత్‌లో చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కీర్తి సురేశ్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలో చేస్తోంది. వరుణ్ ధావన్‌తో కలిసి ఆమె నటించిన బేబీ జాన్ ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో కీర్తి సురేశ్ మునుపెన్నడూ కనిపించనిరీతిలో అందాల్ని ఆరబోస్తూ సాంగ్స్‌కి స్టెప్‌లు వేసింది.