Beginners mistakes in Trading : ట్రేడింగ్​లో బిగినర్స్​ చేసే తప్పులు ఇవే.. మార్చుకుంటే సక్సెస్​ మీదే!-avoid these beginners mistakes in stock market trading tips in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Beginners Mistakes In Trading : ట్రేడింగ్​లో బిగినర్స్​ చేసే తప్పులు ఇవే.. మార్చుకుంటే సక్సెస్​ మీదే!

Beginners mistakes in Trading : ట్రేడింగ్​లో బిగినర్స్​ చేసే తప్పులు ఇవే.. మార్చుకుంటే సక్సెస్​ మీదే!

Sharath Chitturi HT Telugu
Feb 25, 2024 02:03 PM IST

Trading mistakes in Telugu : ట్రేడింగ్​లో బిగినర్స్​ చాలా తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు అర్థమయ్యే సరికి నష్టం జరిగిపోతుంది. ఈ టిప్స్​ తెలుసుకుంటే.. అలా జరగకుండా.. ఒక సక్సెస్​ఫుల్​ ట్రేడర్​ అవ్వొచ్చు!

ట్రేడింగ్​లో సాధారణంగా చేసే తప్పులు ఇవే..
ట్రేడింగ్​లో సాధారణంగా చేసే తప్పులు ఇవే..

Beginners mistakes in Trading : ట్రేడింగ్​ గురించి కొత్తగా విన్నారా? ట్రేడింగ్​ని కెరీర్​గా మార్చుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? సగం సగం తెలిసిన విషయాలను మార్కెట్​లో అప్లై చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ట్రేడింగ్​లో బిగినర్స్​ కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు తెలిసే సరికి లేట్​ అయిపోతుంది. అందుకే.. ట్రేడింగ్​లో బిగినర్స్​ చేసే తప్పులు, వాటిని తగ్గించుకునేందుకు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విలువైన టిప్స్​ని ఇక్కడ చూడండి..

ట్రేడింగ్​లో చేసే సాధారణ తప్పులు..

ట్రేడింగ్​ ప్లాన్​ లేకపోవడం:- చదువు చెప్పేందుకు స్కూళ్లు, కాలేజీలు ఉన్నట్టు.. ట్రేడింగ్​ గురించి చెప్పేందుకు స్టాండర్డ్​ ఫార్మాట్​ ఏది ఉండదు. వాళ్లు చెప్పారనో, వీళ్లు చెప్పారనో ట్రేడింగ్​ గురించి తెలుస్తుంది. డబ్బులు సంపాదించేయాలని ట్రేడింగ్​లో దిగుతాము. ఎలాంటి ట్రేడింగ్​ ప్లాన్​ ఉండదు. అంతా కొత్త కొత్తగా ఉంటుంది. ఇష్టమొచ్చినట్టు ట్రేడ్స్​ తీసుకుంటాము. ఒకటి రెండుసార్లు.. ప్రాఫిట్​ వస్తుంది. ఇది మంచి కిక్​ ఇస్తుంది. ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి ట్రేడ్స్​ తీసుకుంటాము. ఒక రోజు భారీ నష్టం వస్తుంది! దాని భారించలేక.. ఇక ట్రేడింగ్​కి దూరంగా ఉండిపోతాము.

ప్రొఫెషనల్​, సక్సెస్​ఫుల్​ ట్రేడర్లు ఇలా చేయలేదు, చేయరు కూడా! ముందు ట్రేడింగ్​ అంటే ఏంటి? అని తెలుసుకుంటాము. ఒక్క విషయం తెలుసుకుంటూ.. దానిని నిదానంగా అప్లై చేస్తూ, ఒక్కో మెట్టు ఎదుగుతారు. ట్రేడింగ్​ అనేది లాంగ్​ టర్మ్​ గోల్​ అని, షార్ట్​ టర్మ్​లో ఒడిగొడుకులు ఉంటాయని వారికి ముందే తెలుసు. మీరు కూడా ఇలాంటి మైండ్​సెట్​ని ఏర్పాటు చేసుకోవాలి. ముందు నేర్చుకోవాలి, నేర్చుకున్న దానిని మొదటి పేపర్​ మీద అప్లై చేయాలి. అక్కడ సక్సెస్​ రేటు బాగుంటే.. రియల్​ టైమ్​ మార్కెట్​లో కొంచెం కొంచెం డబ్బులు పెట్టాలి.

Trading tips in telugu : ఎమోషనల్​ ట్రేడింగ్​:- స్టాక్​ మార్కెట్​ ట్రేడింగ్​లో స్ట్రాటజీలు ముఖ్యమని చాలా మంది అనుకుంటారు. స్ట్రాటజీ తెలిస్తే సక్సెస్​ సాధించేయవచ్చు, భారీగా డబ్బులు సంపాదించుకోవచ్చని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్​ కాదు. సోషల్​ మీడియా పుణ్యమా అని ఇప్పుడు చాలా మందికి చాలా స్ట్రాటజీలు తెలుసు! కానీ సక్సెస్​ రేట్​ ఇంకా 5శాతం కన్నా తక్కువగానే ఉంది! ఎందుకు? అంటే.. ట్రేడింగ్​లో స్ట్రాటజీ కన్నా సైకాలజీ చాలా ముఖ్యం. లాస్​ వచ్చినా, ప్రాఫిట్​ వచ్చినా ఒకే రకంగా చూడాలి. కానీ మొదట్లో.. ఎమోషన్స్​ ప్లే అవుతాయి. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే బాధ వస్తుంది, కోపం వస్తుంది. అప్పుడే.. రివేంజ్​ ట్రేడ్​ ప్లాన్​ చేస్తారు. ఏమోషన్స్​కి వాల్యూ ఇచ్చి.. రివేంజ్​ ట్రేడ్​ చేస్తే.. అది మార్కెట్​కి నష్టం కాదు! మనకే నష్టం! మార్కెట్​ అందరిని ఒకే విధంగా చూస్తుంది. మన మీద కక్ష కట్టి, మన నుంచే డబ్బులు తీసుకోదు! ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.

సక్సెస్​ఫుల్​ ట్రేడర్స్​.. ఎమోషన్స్​ని చెక్​లో పెట్టుకుంటారు. ఎమోషన్స్​ కన్నా లాజిక్స్​కి, స్ట్రాటజీకి, రిస్క్​- రివార్డ్​కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ప్రాఫిట్​ వచ్చినా, నష్టాలొచ్చినా.. పెద్దగా పట్టించుకోరు. ఏం జరిగినా.. ఇంకో ట్రేడ్​ని వెతుక్కుంటారు. వాస్తవానికి ట్రేడింగ్​లో ఇలాంటి మైండ్​సెట్​ ఉండాల్సిందే! అప్పుడే దీర్ఘకాలంలో మంచి ట్రేడర్​గా సెటిల్​ అవ్వొచ్చు. షార్ట్​ టర్మ్​ ఎమోషన్స్​కి పోయి, డబ్బులు పోగొట్టుకుంటే.. ఇక ట్రేడింగ్​లో క్యాపిటల్​ ఉండదు!

Stock market trading tips : రిస్క్​ రివార్డ్​:- ఇందాక చెప్పినట్టు.. సక్సెస్​ఫుల్​ ట్రేడర్లు రిస్క్​- రివార్డ్​కి చాలా వాల్యూ ఇస్తారు. కానీ చాలా మంది బిగినర్స్​కి అసలు ఈ కాన్సెప్ట్​పైనా ఐడియా ఉండదు. వారి దగ్గర ఉన్న డబ్బులను మొత్తం తీసుకొచ్చి మార్కెట్​లో పెడతారు. ఒక్క ట్రేడ్​లోనే పెద్ద మొత్తంలో డబ్బులు పెడతారు. చివరికి నష్టపోతారు! ఇది ట్రేడింగ్​ కెరీర్​లో అస్సలు మంచిది కాదు!

ప్రొఫెషనల్​ ట్రేడర్లు ఇలా చేయలేదు, చేయరు కూడా! సైకాలజీ తర్వాత వారు అధిక ప్రాధాన్యత ఇచ్చేది రిస్క్​- రివార్డ్​కే! వాళ్ల దగ్గర ఎంత క్యాపిటల్​ ఉంది, ఎంత రిస్క్​ చెయ్యగలరు? ఆ రిస్క్​ మీద ఎంత ప్రాఫిట్​ ఆశిస్తున్నారు? అనేది ట్రేడ్​ తీసుకునే ముందే ఫిక్స్​ అవుతారు. ఇలా చేస్తేనే.. ట్రేడింగ్​లో కెరీర్​ లాంగ్​ లాస్టింగ్​గా ఉంటుంది.

Best investment strategy : ఇక్కడే 2 పర్సెంట్​ రూల్​ చాలా ఉపయోగపడుతుంది. మన మొత్తం క్యాపిటల్​లో ఒక ట్రేడ్​లో 2శాతానికి మించి డబ్బులు పెట్టకూడదు అని సూచించేదే ఈ రూల్​. ఉదాహరణకు మన దగ్గర రూ. 1లక్ష క్యాపిటల్​ ఉంది అనుకుందాము. ఆ మొత్తాన్ని ఒకే ట్రేడ్​లో పెట్టకూడదు. అందులో 2శాతం మాత్రమే రిస్క్​ చేయాలి. అంటే రూ. 2వేలు. ఇలా.. ఆ రూ. 1లక్షను 4,5 భాగాలుగా విభజించి, వాటికి 2పర్సెంట్​ రూల్​ని అప్లే చేయాలి. ఇలా చేస్తే చాలా ట్రేడ్స్​ వస్తాయని కాబట్టి.. 1,2 లాస్​ అయ్యి, మిగిలినవి సక్సెస్​ అయినా మీరు లాభాల్లో ఉంటారు.

Best trading strategy in Telugu : బిగినర్లు ఒక్క విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తీసుకునే 10 ట్రేడ్స్​లో అన్ని సక్సెస్​ అవ్వాలని చూడకూడదు. 1:1.5 రేషియోలో 6 ట్రేడ్స్​ కరెక్ట్​ అయినా మీరు ప్రాఫిట్​లో ఉన్నట్టే!

చివరిగా ఒక్క విషయం.. ప్లాన్​ ది ట్రేడ్​.. ట్రేడ్​ ది ప్లాన్​!

సంబంధిత కథనం