తెలుగు న్యూస్ / ఫోటో /
Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్‌లో సక్సెస్ రేట్ 5శాతం కన్నా తక్కువే! ఎందుకు?
- Intraday trading tips in Telugu : స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దామని భావిస్తున్నారా? అది అంత సులభమైన విషయం కాదు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సక్సెస్ రేట్ 5శాతం కన్నా తక్కువే ఉంది! ఎందుకు? ఆ 5శాతం మందిలో ఉండి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి..
- Intraday trading tips in Telugu : స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దామని భావిస్తున్నారా? అది అంత సులభమైన విషయం కాదు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సక్సెస్ రేట్ 5శాతం కన్నా తక్కువే ఉంది! ఎందుకు? ఆ 5శాతం మందిలో ఉండి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి..
(1 / 6)
స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఇక ఇంట్రాడే ట్రేడింగ్‌లో రిస్క్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక.. చాలా మంది ఈజీ మనీ కోసం ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. మార్కెట్ అనేది.. మొదట్లో డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి.. ఆ తర్వాత భారీగా దెబ్బ తీస్తుంది. ఇది దాదాపు అందరికి జరిగేదే!
(2 / 6)
అందుకే.. ఇంట్రాడే ట్రేడింగ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో స్ట్రాటజీ, రిస్క్ మేనేజ్మెంట్కి మించిన విషయం ఒకటి ఉంది. దానిని అలవాటు చేసుకోలేకే చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అదే సైకాలజీ!
(3 / 6)
ఇంట్రాడే ట్రేడింగ్‌కి స్ట్రాటజీ అవసరం. కానీ స్ట్రాటజీ తెలిసిన ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించేస్తుంటే.. సక్సెస్ రేట్ 5శాతం కన్నా తక్కువ ఎందుకు ఉంటుంది? సైకాలజీ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. నష్టం వచ్చినా, లాభం వచ్చినా ఒకే విధంగా పరిగణించాల్సి ఉంటుంది. దేనిని హార్ట్‌కి తీసుకోకూడదు. ఈ రోజు నష్టం వస్తే.. దానిని ఈరోజే వదిలేయాలి. దాని గురించే ఆలోచిస్తూ.. ఉండిపోతే, రేపు తీసుకునే ట్రేడ్‌పై ఎఫెక్ట్ పడుతుంది. అది ట్రేడింగ్‌లో కెరీర్‌కి మంచిది కాదు.
(4 / 6)
నష్టాలు వస్తే.. చాలా మంది రివేంజ్ ట్రేడ్ చేస్తూ ఉంటారు. అది అస్సలు కరెక్ట్ కాదు. రివేంజ్ ట్రేడ్ చేస్తే.. మార్కెట్‌కి నష్టం లేదు! మనకే నష్టం! మన క్యాపిటల్ ఊడ్చుకుపోతుంది. నష్టం వచ్చినా, లాభాలొచ్చిన ప్రశాంతంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
(5 / 6)
ఇంట్రాడే ట్రేడింగ్‌లో సక్సెస్ అనేది మన లైఫ్స్టైల్పైనా ఆధారపడి ఉంటుంది. ట్రేడ్ తీసుకునేటప్పుడు మన బ్రెయిన్ క్లియర్‌గా, యాక్టివ్‌గా ఉండాలి. రాత్రి సరైన నిద్రలేకపోతే బ్రెయిన్ సరిగ్గా పని చేయదు. ఉదయం సరిగ్గా పని చేయలేరు. అందుకే.. ఒక మంచి లైఫ్‌స్టైల్‌ని అలవాటు చేసుకోవాలి,
ఇతర గ్యాలరీలు