Vibhor Steel Tubes IPO: గ్రే మార్కెట్లో 120 రూపాయల ప్రీమియంతో ట్రేడ్ అవుతున్న విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ షేర్లు-vibhor steel tubes ipo 10 things to know from rhp before investing ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vibhor Steel Tubes Ipo: గ్రే మార్కెట్లో 120 రూపాయల ప్రీమియంతో ట్రేడ్ అవుతున్న విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ షేర్లు

Vibhor Steel Tubes IPO: గ్రే మార్కెట్లో 120 రూపాయల ప్రీమియంతో ట్రేడ్ అవుతున్న విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ షేర్లు

HT Telugu Desk HT Telugu
Feb 13, 2024 05:15 PM IST

Vibhor Steel Tubes IPO: విభోర్ స్టీల్ ఐపీఓ ఫిబ్రవరి 13న ఇన్వెస్టర్ల సబ్ స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయింది. ఈ ఐపీఓకు ఫిబ్రవరి 15 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. స్టీల్ ట్యూబ్స్ బిజినెస్ లో ఉన్న ఈ సంస్థ నుంచి వచ్చిన ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ
విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ (Photo: Company Website)

Vibhor Steel Tubes IPO:: స్టీల్ పైపులు, ట్యూబ్ ల తయారీ సంస్థ విభోర్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్ తన తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను ఫిబ్రవరి 13న సబ్ స్క్రిప్షన్ కోసం తెరిచింది. విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓకు ఫిబ్రవరి 13 మంగళవారం నుంచి ఫిబ్రవరి 15 గురువారం వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. అర్హులైన ఇన్వెస్టర్లకు ఫిబ్రవరి 16వ తేదీన షేర్స్ అలాట్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 20 న విభోర్ స్టీల్ ట్యూబ్స్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లో లిస్ట్ కానుంది.

ఐపీఓ వివరాలు..

విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఈ ఐపీఓ ద్వారా రూ.72.17 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.141 నుంచి రూ.151గా నిర్ణయించింది. ఈ ఐపీఓకు లాట్స్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ లో 99 షేర్లు ఉంటాయి. అంటే, రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కు ఇన్వెస్ట్ చేయడానికి అవసరమైన కనీస పెట్టుబడి మొత్తం రూ.14,949.

ఇష్యూ లక్ష్యాలు

ఈ ఐపీఓ (IPO) ద్వారా సమకూరిన మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని కంపెనీ భావిస్తోంది. విభోర్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్ సంస్థ మైల్డ్ స్టీల్ కార్బన్ స్టీల్ ఇఆర్ డబ్ల్యు బ్లాక్, గాల్వనైజ్డ్ పైపులు, హాలో స్టీల్ పైప్స్ , కోల్డ్ రోల్డ్ స్టీల్ (CR) స్ట్రిప్స్ / కాయిల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది భారతదేశంలోని వివిధ భారీ ఇంజనీరింగ్ పరిశ్రమలకు ఉక్కు పైపులు, ట్యూబ్స్ ను సరఫరా చేస్తుంటుంది. విభోర్ స్టీల్ ట్యూబ్ పీర్ గ్రూప్ కంపెనీల్లో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్, హైటెక్ పైప్స్ లిమిటెడ్, గుడ్లక్ ఇండియా లిమిటెడ్, రామా స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్ మొదలైనవి ఉన్నాయి.

విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఆర్థిక వివరాలు..

విభోర్ స్టీల్ ట్యూబ్స్ టాప్ లైన్, బాటమ్ లైన్ గతంలో మంచి వృద్ధిని సాధించాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.818.48 కోట్లుగా ఉన్న ఆదాయం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1,114.38 కోట్లకు పెరిగింది. 2023 సెప్టెంబర్తో ముగిసిన కాలానికి ఆదాయం రూ.531.24 కోట్లుగా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.11.33 కోట్ల నుంచి రూ.21.07 కోట్లకు పెరిగింది. 2023 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ.8.52 కోట్లుగా ఉంది.ఈ సంస్థ ప్రమోటర్లుగా విజయ్ కౌశిక్, విభోర్ కౌశిక్ ఉన్నారు.ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్ గా ఖంబట్టా సెక్యూరిటీస్ లిమిటెడ్, రిజిస్ట్రార్ గా కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఉన్నాయి.

ఈ విషయాలు తెలుసుకోండి..

విభోర్ స్టీల్ ట్యూబ్ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని జిందాల్ పైప్స్ లిమిటెడ్ అనే ఒకే కస్టమర్ నుండి పొందుతుంది. సంస్థ ఆదాయంలో 90% పైగా ఈ జిందాల్ పైప్స్ అనే సింగిల్ కస్టమర్ నుంచే వస్తుంది. ఒకవేళ, జిందాల్ పైప్స్ లిమిటెడ్ తమ ఆర్డర్లను రద్దు చేయడం లేదా ఆలస్యం చేయడం లేదా తగ్గించడం చేస్తే, అది విభోర్ స్టీల్ ట్యూబ్స్ వ్యాపారం, ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

గ్రే మార్కెట్ ప్రీమియం

విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపిఒ జిఎంపి లేదా గ్రే మార్కెట్ ప్రీమియం ఈ రోజు షేరుకు రూ .120 వద్ద ఉంది. అంటే, గ్రే మార్కెట్లో విభోర్ స్టీల్ ట్యూబ్స్ షేర్లు గరిష్ట ఇష్యూ ధర అయిన రూ.151తో పోలిస్తే 79.47 శాతం ప్రీమియంతో రూ. రూ.271 వద్ద షేర్ల లిస్టింగ్ జరుగుతుందని మార్కెట్ అంచనా వేస్తోంది.

Whats_app_banner