Lalithaa Jewellers IPO details : దేశంలోని అతి పెద్ద జ్యువెల్లరీ రీటైలర్స్లో ఒకటైన లలితా జ్యువెలర్స్ సంస్థ.. త్వరలోనే ఐపీఓగా ప్రైమరీ మార్కెట్లోకి అడుగుపెట్టనుందని సమచారం. ఐపీఓకి సంబంధించిన డీఆర్‌హెచ్‌పీ (డ్రాఫ్ట్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్) ని సంస్థ.. మార్చ్‌లో ఫైల్ చేస్తుందని తెలుస్తోంది. ఐపీఓ ద్వారా.. రూ. 1,400 కోట్ల నుంచి రూ. 1,600 కోట్ల వరకు ఫండ్స్‌ని రైజ్ చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోందట!
సంబంధిత వర్గాల ప్రకారం.. ఫ్రెష్ ఇష్యూ ద్వారా ఈ లలితా జ్యువెలర్స్ ఐపీఓ మార్కెట్లోకి వస్తుంది. అంటే.. సమకూర్చుకున్న డబ్బులు మొత్తం కంపెనీకే వెళతాయి. ఈ నిధులను.. వ్యాపారం విస్తరణకు సంస్థ ఉపయోగించే అవకాశం ఉంది.
Lalithaa Jewellers IPO opening time : 2020లో లలితా జ్యువెలర్స్‌కి 26 స్టోర్స్ ఉండేవి. కానీ ఇప్పుడవి రెండింతలు పెరిగాయి. తక్కువ సమయంలోనే ఇది సాధ్యమైంది. దీని బట్టి.. వ్యాపార విస్తరణకు ఆ సంస్థ ఏ మేరకు బలమైన ప్లాన్స్ వేస్తోందో అర్థం చేసుకోవచ్చు.
లలితా జ్యువెలర్స్ పేరు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమే. మరీ ముఖ్యంగా.. ఆ సంస్థ ఎండీ డా. కిరణ్ కుమార్, అనేక యాడ్స్ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వాసి. తన తల్లి నగలను తాకట్టు పెట్టి, వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. సరసమైన ధరల్లో జ్యువెల్లరీ అనేది అందరికి అందుబాటులో ఉండాలన్న కాంక్షతో ఉంటారు. జ్యువెల్లరీ రీటైల్ ట్రేడ్‌లో బీఐఎస్ హాల్‌మార్క్ చేసిన గోల్డ్‌ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి డా. కుమార్!
Lalithaa Jewellers latest news : ఇప్పుడు.. లలితా జ్యువెలర్స్‌కి 4 దక్షిణాది రాష్ట్రాల్లోని 34 నగరాల్లో 52 షోరూమ్‌లు ఉన్నాయి. మొత్తం మీద.. లలితా జ్యువెలర్స్ టర్నోవర్ రూ. 18వేల కోట్ల కన్నా ఎక్కువే!
లలితా జ్యువెలర్స్ రెవెన్యూలో 95శాతం గోల్డ్ జ్యువెల్లరీపైనే ఆధారపడి ఉంటుంది. వెండి ద్వారా కేవలం 4శాతం ఆదాయం మాత్రమే వస్తుంది. వజ్రాలతో 1-2శాతం వరకు ఆదాయం వస్తుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చెరీలో లలితా జ్యువెలర్స్ ఫేమస్. ఆయా రాష్ట్రాల్లోని బంగారం విక్రయాల్లో.. లలితా జ్యువెలర్స్ వాటా 40శాతం! ఇక.. ప్రతి షోరూమ్ నుంచి సగటున రూ. 350కోట్ల ఆదాయం (ఎఫ్వై 20- ఎఫ్వై 23) పొందుతోంది లలితా జ్యువెల్లరీ.
డీఆర్‌హెచ్‌పీ రిలీజ్ అయిన తర్వాత.. ఈ లలితా జ్యువెలర్స్ ఐపీఓపై మరిన్న వివరాలు అందుబాటులోకి వస్తాయి.
సంబంధిత కథనం