Rudra Gas IPO: ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన; 43 రెట్లు సబ్ స్క్రైబ్ అయిన ఐపీఓ; తొలిరోజే ఓవర్ సబ్ స్క్రైబ్
Rudra Gas IPO: రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ ఐపీఓకు అన్ని వర్గాల ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఎస్ఎంఈ (SME) ఐపీఓ ఫిబ్రవరి 08 న ప్రారంభమైంది. ఈ ఐపీఓకు ఫిబ్రవరి 12 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.
Rudra Gas Enterprise IPO: రుద్రా గ్యాస్ ఎంటర్ ప్రైజ్ ఐపిఒ సబ్ స్క్రిప్షన్ కోసం ఫిబ్రవరి 08, గురువారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 12 సోమవారం ముగుస్తుంది. రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ ఐపీఓ ధరను రూ.63గా నిర్ణయించింది. రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ ఐపీఓలో ఒక్కో లాట్ లో రూ. 10 ముఖ విలువ కలిగిన 2,000 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఇన్వెస్టర్లు కనీసం 2,000 షేర్లు, వాటి గుణకాల్లో సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది చిన్న, మధ్య తరహా పరిశ్రమల (SME) సెగ్మెంట్ నుంచి వచ్చిన ఐపీఓ (IPO).
రుద్ర ఎంటర ప్రైజెస్ వివరాలు
రుద్ర ఎంటర ప్రైజెస్ అనేక మౌలిక సదుపాయాలకు సంబంధించిన కార్యకలాపాలలో ఉంది. ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ లు, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ప్రాజెక్టులు, కన్ స్ట్రక్షన్ ఎక్వీప్మెంట్ వంటివి కంపెనీ యొక్క ప్రాధమిక వ్యాపార కార్యకలాపాలు. ఈ సంస్థ సివిల్ వర్క్స్, పైప్ లైన్ బిల్డింగ్, పైప్ లైన్ నెట్వర్క్ ఆపరేషన్స్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యాపారాల నిర్వహణలో ప్రత్యేకత అనుభవం ఉంది. ఈ కంపెనీ ప్రమోటర్లుగా మంజులాబెన్ సురేష్ భాయ్ పటేల్, కుష్ సురేశ్ భాయ్ పటేల్, కశ్యప్ సురేష్ భాయ్ పటేల్ ఉన్నారు.
రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ ఐపీఓ వివరాలు
ఈ ఐపీఓ (Rudra Gas Enterprise IPO) ద్వారా రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ రూ.14.16 కోట్ల విలువైన 22,48,000 ఈక్విటీ షేర్ల ను ఇష్యూ చేస్తోంది. ఇది పూర్తిగా తాజా ఇష్యూ. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ లేదు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తాన్ని కంపెనీ సాధారణ లక్ష్యాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తారు. రుద్ర గ్యాస్ ఎంటర్ప్రైజ్ ఐపీఓ షేర్ల కేటాయింపు ఫిబ్రవరి 13 మంగళవారం ఖరారు అవుతుంది. కంపెనీ ఫిబ్రవరి 14 బుధవారం రీఫండ్లను ప్రారంభిస్తుంది. రీఫండ్ తర్వాత అదే రోజు కేటాయింపుదారుల డీమ్యాట్ ఖాతాకు షేర్లు జమ అవుతాయి. రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ స్టాక్ ఫిబ్రవరి 15, గురువారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ స్టేటస్
రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ స్టేటస్ రెండో రోజు, ఫిబ్రవరి 9వ తేదీ మధ్యాహ్నం వరకు 43.53 రెట్లు పెరిగింది. ఈ ఇష్యూకు రిటైల్ ఇన్వెస్టర్ల నుండి సానుకూల స్పందన లభిస్తోంది. వారు 72.84 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యారు. నాన్ ఇన్ స్టిట్యూషనల్ కొనుగోలుదారులు 14.18 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యారు. ఫిబ్రవరి 9 మధ్యాహ్నం 13:55 గంటలకు 21,32,000 షేర్లకు గాను 9,28,00,000 షేర్లకు బిడ్లు వచ్చాయి.
రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ ఐపీఓ జీఎంపీ
రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ ఐపీఓ జీఎంపీ లేదా గ్రే మార్కెట్ ప్రీమియం శుక్రవారం, ఫిబ్రవరి 9న +40 గా ఉంది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ గరిష్ట ధరను, గ్రే మార్కెట్లో ప్రస్తుత ప్రీమియంను పరిగణనలోకి తీసుకుంటే, రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ షేరు ధర లిస్టింగ్ రోజు కనీసం రూ .103 గా ఉండే అవకాశముంది. ఇది ఐపీఓ ఇష్యూ ధర అయిన రూ .63 కంటే 63.49% ఎక్కువ. 'గ్రే మార్కెట్ ప్రీమియం' అనేది ఇష్యూ ధర కంటే ఎక్కువ చెల్లించడానికి పెట్టుబడిదారుల సంసిద్ధతను సూచిస్తుంది.
సూచన: ఇది మార్కెట్ నిపుణుల అభిప్రాయాలతో కూడిన కథనం. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవడం సముచితం.