Sovereign Gold Bond subscription date 2024 : గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్న వారికి అలర్ట్! సావరిన్ గోల్డ్ బాండ్ 2023-24 సిరీస్ 4కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ సోమవారం ఓపెన్ అయ్యింది. ఫిబ్రవరి 16 వరకు ఈ గోల్డ్ బాండ్ స్కీమ్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ధఫా సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ప్రైజ్‌ని గ్రాముకు రూ. 6,263గా నిర్ణయించింది ఆర్బీఐ.
సబ్స్క్రిప్షన్ ఓపెన్ అయ్యే చివరి వారంలోని చివరి మూడు రోజుల్లో ఉండే 999 ప్యూరిటీ గల బంగారం ధర సగటును.. ఇష్యూ ప్రైజ్‌గా నిర్ణయిస్తారు. ఈసారి.. సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ప్రైజ్ గ్రాముకు రూ. 6,263గా ఫిక్స్ చేశారు. అయితే.. దీనిపై డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఆన్లైన్ వేదికగా గోల్డ్ బాండ్స్‌కి అప్లై చేసుకుని, పేమెంట్ చేస్తే.. రూ. 50 డిస్కౌంట్ లభిస్తుంది. ఫలితంగా.. ఆన్లైన్ పేమెంట్ ద్వారా.. గ్రాము బంగారం రూ. 6,213కే పొందొచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ 2023-24 సిరీస్ 4 స్కీమ్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవి.. స్టాక్ ఎక్స్ఛేంజ్, పోస్ట్ ఆఫీస్, ఆన్లైన్, కమర్షియల్ బ్యాంక్స్.
Sovereign Gold Bond issue price : ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ టెన్యూర్ 8ఏళ్లు. 5ఏళ్ల తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌ని ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా.. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే డబ్బులపై.. వార్షికంగా 2.5శాతం వడ్డీని కూడా ఇస్తోంది కేంద్రం. ఇక.. బాండ్స్‌ని రిడీమ్ చేసుకున్నప్పుడు కనిపంచే లాభాలకు ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు! అది 8ఏళ్లు అయినా, 5ఏళ్లు అయినా.. ట్యాక్స్ పడదు! సెకెండరీ మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకున్నా.. ఇది వర్తిస్తుంది.
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు గోల్డ్‌ని కొంటూ ఉంటారు. వాటిని ఇన్వెస్ట్మెంట్గా భావిస్తుంటారు. కానీ అది తప్పు! ఫిజికల్ గోల్డ్ కొంటే.. తరుగు, ట్యాక్స్ అంటూ చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకే.. ఫిజికల్ గోల్డ్‌కి డిమాండ్‌ని తగ్గించేందుకు కేంద్రం.. 2015 నవంబర్‌లో ఈ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఆధారిత బాండ్ కాబట్టి.. ఇందులో రిస్క్ 0. లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్నులు కూడా వస్తాయి. 2.5శాతం వడ్డీ లభిస్తుండటం మరో హైలైట్.
What is Sovereign Gold Bond : గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తూ, లాంగ్ టర్మ్‌లో మంచి లాభాలను పొందాలని భావించే వారికి.. ఈ సావరిన్ గోల్డ్ బాండ్ మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత కథనం