kanguva: సూర్యతో సినిమా చేసే ఛాన్స్‌ను నేనే మిస్సయ్యాను - కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి కామెంట్స్
kanguva: కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్యపై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. పాన్ ఇండియన్ సినిమాలు చేయడానికి సూర్యనే తనకు స్ఫూర్తి అని అన్నాడు. గతంలో సూర్యతో కలిసి సినిమా చేసే అవకాశాన్ని తానే మిస్సయినట్లు రాజమౌళి తెలిపాడు.
kanguva: సూర్య యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని దర్శకుడు రాజమౌళి అన్నాడు. తాను పాన్ ఇండియన్ సినిమాలు చేయడానికి హీరో సూర్యనే స్ఫూర్తి అంటూ పొగడ్తలు కురిపించాడు.
కంగువ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళితోపాటు దర్శకుడు బోయపాటి శ్రీను చీఫ్ గెస్ట్‌లుగా వచ్చారు. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది.
కేస్ స్టడీలా...
కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. గజిని సినిమాను ప్రమోట్ చేయడానికి మొదటిసారి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన సూర్య...ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఎలా దగ్గరయ్యాడన్నది కేస్ స్టడీలా తెలుగు నిర్మాతలకు తాను చెబుతుంటానని రాజమౌళి అన్నాడు. సూర్య ఎలాగైతే వచ్చి తన సినిమా ప్రమోషన్స్‌ను ఇక్కడ చేస్తున్నాడో...మన సినిమాలను ఇతర భాషల్లో అలాగే ప్రమోట్ చేయాలని హీరోలకు చెబుతుంటానని రాజమౌళి చెప్పాడు.
సూర్యనే స్ఫూర్తి...
“పాన్ ఇండియన్ మూవీ బాహుబలి చేయడానికి సూర్యనే నాకు స్ఫూర్తి. ఒకసారి సూర్య, నేను కలిసి సినిమా చేయాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఓ సినిమా వేడుకలో నాతో కలిసి సినిమా చేసే అవకాశాన్ని మిస్సయ్యానని సూర్య అన్నారు. నిజానికి సూర్యతో పనిచేసే అవకాశాన్ని నేనే మిస్ చేసుకున్నా. సూర్య స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఫిల్మ్ మేకర్‌గా కథల ఎంపికలో అతడు తీసుకునే నిర్ణయాల్ని నేను గౌరవిస్తున్నాను. కంగువ కోసం సూర్య పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. సూర్య కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుందనే నమ్మకముంది” అని రాజమౌళి అన్నాడు.
ప్రభాస్ సలహా...
రాజమౌళి సినిమాలతో తన సినిమాలను ఎప్పుడూ పోల్చుకోనని, ఆయన చూపించిన దారిలోనే తాను అడుగులు వేస్తున్నామని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య అన్నాడు. “కంగువ సినిమా కథను అంగీకరించడానికి ముందు బాహుబలి కోసం ప్రభాస్, అనుష్క, రానా ఎలా కష్టపడ్డారో తెలుసుకున్నా. రెండేళ్లకు పైగా కష్టపడ్డారని తెలిసి ఆశ్చర్యపోయా. రాజమౌళి ఎనర్జీ తమను ముందుకు నడిపించిందని ప్రభాస్, రానా నాతో అన్నారు. అలాంటి ఎనర్జీ శివలో ఈ సినిమా షూటింగ్ సమయంలో చూశా.
కంగువ కథ వినగానే చాలా ఎగ్జైట్‌గా ఫీలయ్యా. ప్రతి రోజు మూడు వేల మందితో దాదాపు 170 రోజులకుపైగా ఈ సినిమా షూటింగ్ చేశాం. భవిష్యత్తులో శివతో మరిన్ని సినిమాలు చేస్తా. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. డబ్బు కోసం కాకుండా పాషన్‌తో ప్రతి ఒక్కరూ పనిచేశారు” అని సూర్య చెప్పాడు.
మగధీర...
రాజమౌళి మగధీర సినిమాను సూర్య చేయాల్సింది. సూర్య రిజెక్ట్ చేయడంలో ఆ తర్వాత రామ్‌చరణ్‌తో మగధీర సినిమా చేశాడు రాజమౌళి. రాజమౌళి ఆఫర్‌ను తిరస్కరించి తప్పు చేశానని చాలా సార్లు సూర్య చెప్పిన సంగతి తెలిసిందే. కంగువ మూవీ దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. యానిమల్ ఫేమ్ బాడీ డియోల్ విలన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో దిశాపటానీ హీరోయిన్‌గా కనిపిస్తోంది.