ప్రియుడి భార్యపై మహిళ కేసు- డబ్బులు తీసుకుని విడాకులు ఇవ్వడం లేదని..-chinese mistress sues wife who refused to divorce husband ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ప్రియుడి భార్యపై మహిళ కేసు- డబ్బులు తీసుకుని విడాకులు ఇవ్వడం లేదని..

ప్రియుడి భార్యపై మహిళ కేసు- డబ్బులు తీసుకుని విడాకులు ఇవ్వడం లేదని..

Sharath Chitturi HT Telugu
Dec 16, 2024 10:37 AM IST

చైనాకు చెందిన ఓ మహిళ.. తన ప్రియుడి భార్యపై కేసు వేసింది. డబ్బులు తీసుకుని కూడా తన ప్రియుడికి విడాకులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. కానీ కోర్టులో ఆమెకు షాక్​ ఎదురైంది.

ప్రియుడి భార్యపై మహిళ కేసు!
ప్రియుడి భార్యపై మహిళ కేసు! (Representational image)

చైనాలో జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తన ప్రియుడికి విడాకులు ఇవ్వడం లేదంటూ అతని భార్యపై ఓ మహిళ కేసు వేసింది. తన నుంచి 1.2 మిలియన్ యువాన్లు తీసుకున్న తర్వాత కూడా విడాకులకు ఒప్పుకోవడం లేదని పేర్కొంది.

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్​లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఈ వింత కేసు ఒక వ్యక్తి చుట్టూ కేంద్రీకృతమైంది. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్​లోని షిషికి చెందిన హాన్ 2013లో తన భార్య యాంగ్​ను వివాహం చేసుకున్నాడు. హాన్- అతని భార్య యాంగ్​కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ షి అనే తన సహోద్యోగితో ఎఫైర్ ప్రారంభించాడు ఆ వ్యక్తి. హాన్ నవంబర్ 2022 లో తన ప్రేయసితో ఒక కుమారుడిని కూడా కన్నాడు!

ఆ సమయంలో షి.. హాన్ భార్యను ఎదుర్కొని విడాకులకు అంగీకరించేలా ఒప్పించే ప్రయత్నం చేసింది. ఈ మేరకు.. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి అంగీకరిస్తే యాంగ్​కు మొత్తం 2 మిలియన్ యువాన్లు చెల్లిస్తానని డీల్​ కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా 2022 చివరి నాటికి షి 1.2 మిలియన్ యువాన్లను (సుమారు రూ.1.3 కోట్లు) యాంగ్​కి బదిలీ చేసింది.

దురదృష్టవశాత్తు విడాకుల ఒప్పందంలో 1.2 మిలియన్ యువాన్లు చెల్లించడంతో షి ఆర్థిక ఇబ్బందులకు గురైంది. కానీ యాంగ్​ విడాకులు ఇవ్వలేదు. యాంగ్ విడాకులకు అంగీకరిస్తుందని ఏడాది పాటు ఎదురుచూసిన తర్వాత, షి తన డబ్బును తిరిగి డిమాండ్ చేయడం ప్రారంభించింది.

యాంగ్ డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో విసుగు చెందిన షి 1.2 మిలియన్ యువాన్లను రికవరీ చేయడానికి ఆమెపై కేసు వేసింది. తనకు, యాంగ్​కు మధ్య మౌఖిక ఒప్పందం ఉందని, యాంగ్ హాన్​కు విడాకులు ఇవ్వడంపై ఈ చెల్లింపు ఆధారపడి ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే షిషి పీపుల్స్ కోర్టు షికి అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి నిరాకరించింది. షి చెల్లింపు సామాజిక నైతిక ప్రమాణాలను, ప్రజాభద్రతను ఉల్లంఘించిందని, ఇది చట్టబద్ధమైన వివాహానికి విఘాతం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది.

రిఫండ్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైనప్పటికీ, హాన్ తన భార్యకు తెలియకుండా షి కోసం 6 మిలియన్ యువాన్లకు పైగా ఖర్చు చేసినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.