Smartphones : రూ.12 వేల కంటే తక్కువ ధరలోని పది 5జీ ఫోన్లు.. 12 జీబీ ర్యామ్, మంచి కెమెరా
Smartphones Under 12k : తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలని చూసేవారికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. రూ.12 వేల కంటే తక్కువ ధరలో పది స్మార్ట్‌ఫోన్లు ఆఫర్‌లో దొరుకుతున్నాయి. ఈ బెస్ట్ డీల్స్ మీద ఓ లుక్కేద్దాం..
5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్ సేల్ దగ్గర పడుతోంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై మొబైల్ బొనాంజా సేల్‌లో స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో లభించే ఆఫర్లను (బ్యాంక్, ఎక్స్ఛేంజ్) సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీకు ఇష్టమైన ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.12,000 లోపు లభించే 5జీ ఫోన్ల గురించి ఇక్కడ చూద్దాం.. ఈ సేల్ నవంబర్ 21తో ముగుస్తుంది. 12 జీబీ ర్యామ్, 108 మెగాపిక్సెల్ కెమెరాతో మంచి ఫోన్లు ఉన్నాయి. ఆ లిస్టు ఓసారి చూసేయండి..
1. మోటరోలా జీ45 5జీ సేల్లో లభించిన ఆఫర్ల తర్వాత మోటో జీ45 5జీ 8+128 జీబీ వేరియంట్ రూ.11,999కే లభిస్తుంది. 6.5 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయి.
2. శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ సేల్లో లభించిన ఆఫర్ల తర్వాత ఫోన్ యొక్క 6 ప్లస్ 128జీబీ వేరియంట్ రూ .10,999 ప్రారంభ ధరకు లభిస్తుంది. 6.6 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎక్సినోస్ 1330 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
3. వివో టీ3ఎక్స్ 5జీ సేల్లో అందుబాటులో ఉన్న ఆఫర్ల తర్వాత ఫోన్ 4 ప్లస్ 128జీబీ వేరియంట్ రూ .11,749 ప్రారంభ ధరకు లభిస్తుంది. 6.7 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ ఉన్నాయి.
4. ఒప్పో కే12ఎక్స్ 5జీ సేల్లో అందుబాటులో ఉన్న ఆఫర్ల తర్వాత ఫోన్ 6 ప్లస్ 128 జీబీ వేరియంట్ రూ .11,749 ప్రారంభ ధరకు లభిస్తుంది. 6.67 అంగుళాల డిస్‌ప్లే, 32 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయి.
5. పోకో ఎం6 ప్లస్ 5జీ సేల్లో అందుబాటులో ఉన్న ఆఫర్ల తర్వాత ఫోన్ 6 ప్లస్ 128జీబీ వేరియంట్ రూ .10,999 ప్రారంభ ధరకు లభిస్తుంది. 6.79 అంగుళాల డిస్‌ప్లే, 108 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ ప్రాసెసర్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
6. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ సేల్లో అందుబాటులో ఉన్న ఆఫర్ల తర్వాత ఫోన్ 8 ప్లస్ 128 జీబీ వేరియంట్ రూ .8,999 ప్రారంభ ధరకు లభిస్తుంది. 6.7 అంగుళాల డిస్‌ప్లే, 48 మెగా పిక్సల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది.
7. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ సేల్లో లభించిన ఆఫర్ల తర్వాత ఫోన్ 12 ప్లస్ 256 జీబీ వేరియంట్ రూ .10,499 ప్రారంభ ధరకు లభిస్తుంది. 6.78 అంగుళాల డిస్‌ప్లే, 108 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
8. రెడ్‌మీ 12 5జీ సేల్లో అందుబాటులో ఉన్న ఆఫర్ల తర్వాత 6 ప్లస్ 128 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.11,499గా వస్తుంది. 6.79 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉన్నాయి.
9. వివో టీ3 లైట్ 5జీ సేల్లో అందుబాటులో ఉన్న ఆఫర్ల తర్వాత 4 ప్లస్ 128 జీబీ వేరియంట్ రూ .9,999 ప్రారంభ ధరకు లభిస్తుంది. 6.56 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
10. పోకో ఎం6 5జీ సేల్లో లభించిన ఆఫర్ల తర్వాత ఈ ఫోన్ 4 ప్లస్ 64జీబీ వేరియంట్ ధర రూ.7,499గా ఉంది. 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ ఉన్నాయి.