Airtel new recharge plan : ఎయిర్టెల్ నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్- రోజుకు 2జీబీ 5జీ డేటాతో..
Airtel prepaid recharge plans : ఎయిర్టెల్ నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. రోజుకు 2జీబీ 5జీ డేటాతో కూడిన ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రిలయన్స్ జియో 'హ్యాపీ న్యూ ఇయర్' రీఛార్జ్ ప్లాన్‌ని ప్రకటించిన కొన్ని రోజులకే.. లీడింగ్ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తమ యూజర్స్‌కి క్రేజీ అప్డేట్ ఇచ్చింది! హై స్పీడ్ డేటా కనెక్టివిటీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్‌తో వస్తున్న ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎయిర్టెల్ రూ. 398 రీఛార్జ్ ప్లాన్..
ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లో ఈ రూ. 398 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇతర రీటైల్ ఔట్‌లెట్స్‌లో కూడా ఇది లభిస్తోంది. ఈ ఎయిర్టెల్ రూ. 398 ప్రీపెయిడ్ ప్లాన్‌తో అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ, రోమింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. రోజుకు 2జీబీ (5జీ) డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. ఈ ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లాన్‌తో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ని కూడా 28 రోజుల పాటు పొందొచ్చు (ఒక్క మొబైల్‌కి మాత్రమే!).
జియో వర్సెస్ ఎయిర్టెల్.. ఏది బెస్ట్?
కస్టమర్స్‌ని ఆకర్షించేందుకు 'న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్'ని జియో తీసుకొచ్చింది. 2024 డిసెంబర్ 11 నుంచి 2025 జనవరి 11 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. జియో నెలవారీ రూ. 349 ప్లాన్ బదులు ఈ రూ. 2025 విలువ చేసే న్యూ ఇయర్ ప్లాన్‌తో కస్టమర్స్ రూ. 468 వరకు సేవ్ చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఈ ప్లాన్‌లో 500 జీబీ (4జీ) డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 200 రోజుల పాటు 100 ఎస్ఎంఎస్/డే వంటి బెనిఫిట్స ఉన్నాయి. మైజియో యాప్‌లో, జియో అధికారిక వెబ్‌సైట్, ఆథరైజ్డ్ రీటైలర్స్ దగ్గర ఈ ప్లాన్‌ని పొందొచ్చు.
రూ. 2025 ప్లాన్‌తో సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు రూ. 2150 విలువైన పార్ట్ నర్ కూపన్స్ లభిస్తాయి. వాటిని ఆయా స్టోర్స్ లేదా సైట్స్ లో రీడీమ్ చేసుకోవచ్చు. ఆ కూపన్స్ ఇవే..
1.రూ.500 AJIO కూపన్: అజియో లో రూ.2500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై రీడీమ్ చేసుకోవచ్చు.
2. స్విగ్గీపై రూ. 150 తగ్గింపు: రూ. 499 ఆర్డర్‌పై రూ. 150 డిస్కౌంట్ కూపన్.
3. ఈజ్ మై ట్రిప్పై రూ. 1500 తగ్గింపు: మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా విమాన బుకింగ్‌లకు చెల్లుబాటు అవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం