OTT: కోలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది - కథ మొత్తం ఒకే జైలులో - ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు
OTT: ఆర్‌జే బాలాజీ హీరోగా నటించిన సొర్గవాసల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది.డిసెంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ తమిళం, తెలుగుతో పాటు ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది.
OTT: కోలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ నటించిన సొర్గవాసల్ మూవీ ప్రయోగాత్మక సినిమాగా ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్‌ను మెప్పించింది. సర్వైవల్ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వస్తోంది.
డిసెంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో తమిళంలో మాత్రమే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తెలుగు, కన్నడం, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తోన్నారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ స్వయంగా ప్రకటించింది.
ఒకే జైలులో...
సొర్గవాసల్ మూవీలో ఆర్‌జే బాలాజీతో పాటు సెల్వరాఘవన్, నటరాజ సుబ్రమణియన్, సానియా కీలక పాత్రలు పోషించారు. సొర్గవాసల్ కథ మొత్తం దాదాపు ఒకే జైలు చుట్టూ సాగుతుంది. చేయని నేరానికి జైలుకు వెళ్లిన ఓ యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నది యాక్షన్, ఎమోషన్స్ మేళవించి దర్శకుడు సిద్ధార్థ్ విశ్వనాథన్ ఈ మూవీలో చూపించాడు.
లోకష్ కనగరాజ్ ప్రశంసలు...
ఈ సినిమాలో ఆర్‌జే బాలాజీ, సెల్వరాఘవన్ యాక్టింగ్ ఆడియెన్స్‌ను మెప్పించింది. తాను రూపొందిస్తోన్న ఖైదీ 2 సినిమాలోని కొన్ని సీన్స్‌కు సొర్గవాసల్ స్ఫూర్తినిచ్చిందంటూ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ మూవీపై ప్రశంసలు కురిపించాడు.
యథార్థ ఘటనల ఆధారంగా...
1999లో తమిళనాడులో యథార్ఘంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా క్రైమ్ సర్వైవల్ థ్రిల్లర్‌గా దర్శకుడు సిద్ధార్థ్ విశ్వనాథన్ సొర్గవాసల్ మూవీని తెరకెక్కించాడు. పార్తి (ఆర్‌జే బాలాజీ) ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నడుపుతుంటాడు. అతడి ఫుడ్‌స్టాల్‌లో భోజనం చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూస్తాడు. ఐఏఎస్ ఆఫీసర్‌ను పార్తినే చంపాడని పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తారు.
ఆ జైలులో సిగా (సెల్వరాఘవన్), కెడ్రిక్( సామ్యూల్ రాబిన్సన్) గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఆ గ్యాంగ్ వార్‌లో చిక్కుకొని పార్తి ఎలాంటి కష్టాలు పడ్డాడు? వారిద్దరిని ఎదురించి ఎలాంటి పోరాటం చేశాడు? పార్తి నిర్ధోషిగా విడుదలయ్యాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
సూర్య హీరోగా...
హీరోగానే కాకుండా డైరెక్టర్‌గా కూడా టాలీవుడ్‌లో బిజీగా ఉన్నాడు ఆర్‌జే బాలాజీ. ప్రస్తుతం డైరెక్టర్‌గా అగ్ర హీరో సూర్యతో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో సూర్యకు జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్య కథానాయకుడిగా నటిస్తోన్న 45వ మూవీ ఇది.