Vey Dharuvey OTT: ఓటీటీలోకి రాబోతోన్న సాయిరాంశంకర్ లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎక్కడంటే?
Vey Dharuvey OTT: సాయిరాం శంకర్ లేటెస్ట్ మూవీ వెయ్ దరువెయ్ ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Vey Dharuvey OTT: సాయిరాం శంకర్ లేటెస్ట్ మూవీ వెయ్ దరువెయ్ ఓటీటీలోకి రాబోతోంది. యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాతో దర్శకుడిగా నవీన్ రెడ్డి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. థియేటర్లలో రిలీజైన నెలలోపే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వెయ్ దరువెయ్ ఓటీటీ...
వెయ్ దరువెయ్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 12 నుంచి ఈ మాస్ యాక్షన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సందేశంతో...
వెయ్ దరువెయ్ మూవీలో యశ్న హీరోయిన్‌గా నటించింది. సునీల్, సత్యంరాజేష్ కీలక పాత్రలు పోషించారు. ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందాలని భావించి అడ్డదారులు తొక్కుతున్న యువత ఎలా కష్టాల పాలవుతున్నారనే సందేశానికి కమర్షియల్ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.
వెయ్ దరువెయ్ కథ ఇదే...
కామారెడ్డి శంకర్(సాయిరామ్ శంకర్)...ఉపాధి కోసం హైదరాబాద్ వస్తాడు.క్లోజ్ ఫ్రెండ్ (సత్యం రాజేష్)తో కలిసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. డిగ్రీ లేకపోవడంతో ఉద్యోగానికి అడ్డంకిగా మారుతుంది. దాంతో ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని జాబ్‌లో జాయిన్ కావాలని అనుకుంటాడు శంకర్.
ఈ జర్నీలో అతడికి శృతి(యశ్న) పరిచయం అవుతుంది. శృతి కూడా ఫేక్ సర్టిఫికేట్ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగం సంపాధిస్తుంది. కామారెడ్డి శంకర్ ఫేక్ సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగం దక్కించుకున్నాడా? అసలు శంకర్ హైదరాబాద్ ఎందుకొచ్చాడు? ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా వెనుక ఎవరున్నారు అన్నదే వెయ్ దరువెయ్ మూవీ కథ.
ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ...
వెయ్ దరువెయ్‌తో దాదాపు ఏడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు సాయిరాం శంకర్. అయితే అతడికి ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మాస్ క్యారెక్టర్‌లో సాయిరాం శంకర్ తన యాక్టింగ్‌తో మెప్పించిన అతడి కష్టం వృథాగానే మారింది. వెయ్ దరువెయ్ తర్వాత రీసౌండ్, ఒక పథకం ప్రకారం సినిమాలు చేస్తున్నాడు సాయిరాం శంకర్.
పూరి జగన్నాథ్ బ్రదర్‌గా...
టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయిరాం శంకర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 143 మూవీతో హీరోగా మారాడు. డేంజర్, బంపర్ ఆఫర్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. వెయ్యి అబద్దాలు, యమహోయమ, రోమియో, నేనోరకంతో పాటు హీరోగా తెలుగులో పలు సినిమాలు చేశాడు.
అవేవీ అతడికి విజయాల్ని తెచ్చిపెట్టలేకపోయాయి. రవితేజ ఇడియట్, నేనింతే సినిమాల్లో ఇంపార్టెంట్స్ రోల్స్ చేశాడు సాయిరా శంకర్. బద్రి నుంచి శివమణి సోదరుడు పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. పరాజయాల కారణంగా ఏడేళ్ల పాటు టాలీవుడ్‌కు దూరంగా ఉన్నాడు సాయిరాం శంకర్.
టాపిక్