Heatwave alert : తెలంగాణ, ఆంధ్రకు హీట్ వేవ్ అలర్ట్- ఇతర రాష్ట్రాలకు కూడా!
Heatwave alert in India : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు హీట్ వేవ్ అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు పడతాయని పేర్కొంది.
Telangana Heatwave alert : భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ నెల 5వ తేదీ వరకు.. పలు రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయని చెప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కాగా.. ఏప్రిల్ 7 వరకు ఈశాన్య భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
హీట్ వేవ్ హెచ్చరికలు..
వాతావరణ శాఖ ప్రకారం.. రాయలసీమ, పశ్చిమ బెంగాల్లోని గంగా నది తీర ప్రాంతం, తూర్పు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 3-5 తేదీల మధ్య వడగాల్పులు వీస్తాయి.
ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఝార్ఖండ్, విదర్భ ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయి.
Heat waves in Hyderabad : వీటితో పాటు ఏప్రిల్ 1,5 తేదీల్లో ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో, ఏప్రిల్ 1, 2 తేదీల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఏప్రిల్ 1, 2 తేదీల్లో మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడాలో, ఏప్రిల్ 2-5 తేదీల్లో ఒడిశాలో వెచ్చని రాత్రి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఏప్రిల్ 1, 5 తేదీల మధ్యలో కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఏప్రిల్ 2,5 తేదీల్లో ఒడిశాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది.
Hyerabad heat waves news : రాబోయే నెలల్లో అనేక భారతీయ రాష్ట్రాలకు 'విపరీతమైన వేడి' ఉంటుందని ఏప్రిల్ 1 న ఐఎండీ అంచనా వేసింది. ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతయని పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 20 వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఏప్రిల్లో మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, దక్షిణ భారతదేశంలోని పరిసర ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వడగాలులు కనిపిస్తాయని వివరించింది. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేల్చి చెప్పింది.
ఈ ప్రాంతాల్లో వర్షాలు..
IMD heatwave alert : హిమాలయ దిగువ ప్రాంతాలు, పశ్చిమ్ బెంగాల్, సిక్కింలో ఏప్రిల్ 1-3 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు.ఏప్రిల్ 1-5 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలతో పాటు హిమపాతం కూడా కురవొచ్చు. ఏప్రిల్ 1-2, 4 తేదీల్లో అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
సంబంధిత కథనం