తెలుగు న్యూస్ / ఫోటో /
TS AP Weather Updates : ఐఎండీ అలర్ట్... తెలంగాణలో 4 రోజులు వర్షాలు - ఈ జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు
- Telangana AP Weather Updates : తెలంగాణకు చల్లని కబురు చెప్పింది వాతావరణశాఖ(IMD). ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఏపీలోని ఉత్తర కోస్తాలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ(IMD) చల్లని కబురు చెప్పింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ వర్ష సూచన ఇచ్చింది. తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు(Rains in Telangana) కురిసే అవకాశం ఉందని తెలిపింది.(https://unsplash.com/)
(2 / 6)
పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.(https://unsplash.com/)
(3 / 6)
ఇవాళ( మార్చి 17) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. (https://unsplash.com/)
(4 / 6)
రేపు(మార్చి 18) పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. (https://unsplash.com/)
(5 / 6)
మార్చి 20వ తేదీ వరకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 30 -40 కి.మీ వేగంతో గాలు వీసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇతర గ్యాలరీలు