Netflix Top Trending Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే.. టాప్‌లోకి దూసుకెళ్లిన తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ
Netflix Top Trending Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ లోకి తమిళ బ్లాక్ బస్టర్ మూవీ అమరన్ దూసుకెళ్లింది. దీంతో తెలుగు సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ రెండో స్థానానికి పడిపోయింది.
Netflix Top Trending Movies: బాక్సాఫీస్ దగ్గరే కాదు.. నెట్‌ఫ్లిక్స్ లోనూ సత్తా చాటుతోంది సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ. థియేటర్లలో పుష్ప 2 రిలీజైన డిసెంబర్ 5నే నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టిన ఈ మూవీ.. అప్పుడే ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్ లో తొలి స్థానానికి దూసుకెళ్లడం విశేషం. దీంతో అప్పటి వరకూ టాప్ లో ఉన్న తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ లక్కీ భాస్కర్ రెండో స్థానానికి పడిపోయింది.
నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్
అమరన్ మూవీ అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఆ సినిమాతోపాటు రిలీజైన లక్కీ భాస్కర్, క సినిమాలు ముందుగానే ఓటీటీలోకి వచ్చేయగా.. ఈ అమరన్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకుపైగా వసూలు చేసి కాస్త ఆలస్యంగా ఈ నెల 5న నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. అయితే వచ్చిన నాలుగు రోజుల్లోనే ఈ మూవీ టాప్ లోకి దూసుకెళ్లింది.
నిజానికి ఈ మూవీ రాక ముందు వరకు తెలుగులో రిలీజైన లక్కీ భాస్కర్ మూవీ తొలి స్థానంలో ఉండేది. ఈ సినిమాకు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలోనూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఈ లక్కీ భాస్కర్ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో రెండో స్థానంలో ఉంది. మూడు, నాలుగు స్థానాల్లో ఈ మధ్యే వచ్చిన హిందీ సినిమాలు విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో, జిగ్రా నిలిచాయి.
ఇక మంగళవారం (డిసెంబర్ 10) నుంచి సడెన్ గా తంగలాన్ మూవీ కూడా స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుండటంతో రానున్న రోజుల్లో ఈ మూవీ కూడా టాప్ ట్రెండింగ్ లోకి దూసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్
1. అమరన్
2. లక్కీ భాస్కర్
3. విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో
4. జిగ్రా
5. సికందర్ కా ముకద్దర్
6. దేవర
7. మేరీ
8. దట్ క్రిస్మస్
9. దో పత్తి
10. మేయళగన్ (సత్యం సుందరం)
నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ షోస్
ఇక నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ షోస్, వెబ్ సిరీస్ విషయానికి వస్తే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోనే టాప్ లో కొనసాగుతోంది. ఈ మధ్యే ఈ షోలో అలనాటి అందాల నటి రేఖ స్పెషల్ గెస్టుగా వచ్చింది. ఇక రెండో స్థానంలో యే కాలీ కాలీ ఆంఖే వెబ్ సిరీస్ రెండో సీజన్ ఉంది.
మూడో స్థానంలో బ్లాక్ డవ్స్, నాలుగో స్థానంలో లా బ్రియా, ఐదో స్థానంలో వెన్ ద ఫోన్ రింగ్స్, ఆరో స్థానంలో ది ట్రంక్, ఏడో స్థానంలో మిస్‌మ్యాచ్డ్, 8వ స్థానంలో మ్యాడ్‌నెస్, 9వ స్థానంలో ఐసీ814 ది కాందహార్ హైజాక్, 10వ స్థానంలో సెన్నా ఉన్నాయి.