శరీరంలో లక్షల కోట్ల జీవకణాలకు శక్తిని సమకూర్చడానికి పనిచేసే అవయవాల సమాహారమే జీర్ణాశయ వ్యవస్థ..

By Bolleddu Sarath Chandra
Dec 16, 2024

Hindustan Times
Telugu

ప్రతి జీవిలోని జీవశక్తికి ప్రాణశక్తికి జీర్ణాశయమే మూలాధరం. ఇందులో ఉదరం కీలక పాత్ర పోషిస్తుంది. తినేకొద్దీ విస్తరించి భోజనప్రియులను అలరించే ముఖ్యమైన అవయం అన్నకోశం..

మనం తీసుకునే ఆహారాన్ని హైడ్రో క్లోరిక్ యాసిడ్ ఇతర జీవ రసాయినాల సాయంతో ద్రవరూపంలోకి మార్చి జీర్ణ శక్తికి సహకరిస్తుంది. 

ఉదరంలో ఉండే యాసిడ్ రక్తంలో ఉండే యాసిడ్ కంటే లక్ష రెట్లు శక్తివంతమైనది

శక్తివంతమైన యాసిడ్లను కలిగి ఉండటం వల్ల ఉదరం ఇతర శరీర అవయవాలతో పోలిస్తే సూక్ష్మజీవ రహితమైన  జోన్‌గా ఉంటుంది. 

శరీరంలో ఉదరభాగం యాసిడ్ ఉత్పత్తికి అనువుగా ఉంటుంది.  జీర్ణ శక్తి మొత్తం కడుపులో ఉండే యాసిడ్‌ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. 

వయసు పైబడిన వారిలో యాసిడ్ ఉత్పత్తి జీర్ణశక్తి లోపిస్తుంది.  మనం తినే ఆహారంలో ప్రోటీన్స్‌ను అమినో యాసిడ్స్‌గా మార్చడంలో, ఐరన్‌, కాపర్‌, జింక్, కాల్షియం మొదలైన ఖనిజ లవణాలు, ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి12 మొదలైన విటమిన్లను గ్రహించి రక్తంలో విలీనం కావడానికి తోడ్పడుతుంది. 

ఉాదరంలో యాసిడ్ ఉత్పత్తి ఆగిపోతే మనకు శక్తిని ఇచ్చే అమినో యాసిడ్స్‌, బి12 విటమిన్లు శరీరంలో రక్తంలో విలీనానికి నోచుకోవు. మనం శక్తి హీనులమై అలసట బారిన పడతాం. 

ఎసిడిటీ అనగానే  మనం వింటున్న అనుభవిస్తున్న ఎసిడిటీని గురించి తెలుసుకుందాం. ఎసిడిటీ అనగానే కడుపులో మంట అనుకుంటాం. అది ఈసోఫేగస్‌లో తలెత్తే మంట. నోటి వెనుక బాగంలో ఉండే భాగం కండరాల బలహీనత వల్ల వస్తుంది. 

అన్నవాహిక ముఖద్వారం గొంతు నుంచి ఆహారాన్ని, నీటిని కడుపులోకి పంపే సమయంలో తెరుచుకుని కడుపు నుంచి యాసిడ్, ఇతర జీవ రసాయినాలు  ఈసోఫేగస్‌లో చొరబడకుండా చూస్తాయి.  తేన్పులు, వాంతులు వచ్చినపుడు మాత్రమే ఈ ద్వారం తెరుచుకుంటుంది. 

అన్న వాహికకు ఉండే వాల్వ్‌ వంటి భాగం బలహీనమైతే కడుపు మంట కలుగుతుంది. 

ఈసోఫేగస్‌‌లో యాసిడ్ ఎగదన్నడానికి  మానసిక ఒత్తిడి ప్రధాన కారణం. జీర్ణం చేసుకోలేనంత ఆహారాన్ని తినడం కూడా మరో కారణం. ఊబకాయం సిగరెట్లు, కాఫీ, టీ,  మద్యం వంటివి  ఎసిడీటికి  ప్రధాన కారణం..

వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారా? ముఖ్యంగా పొట్ట తగ్గుతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వాకింగ్ వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడంతో పాటు అనేక ఆర్యోగ ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.  

pexels