పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్- పోస్టాఫీసు పొదుపు అకౌంట్ లో 4% వడ్డీ రేటు లభిస్తుంది. 10 ఏళ్లలోపు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఉత్తమ పథకం. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు, కనీస పరిమితి రూ.500 మాత్రమే. కనీస బ్యాలెన్స్ రూ.50 ఉండాలి. ఎప్పుడైనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. 

pixabay

By Bandaru Satyaprasad
Nov 04, 2023

Hindustan Times
Telugu

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) - ఈ పథకం 7.1% వడ్డీ రేటుతో 15 సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది. కనీస డిపాజిట్ పరిమితి రూ.500. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా వారిపై ఆధారపడిన పిల్లల ప్రాణాంతక పరిస్థితి, ఉన్నత విద్య వంటి సందర్భాల్లో.. ఈ ఖాతాను ఐదేళ్ల తర్వాత ముందస్తుగా మూసివేసే సదుపాయం ఉంటుంది.   

pixabay

రికరింగ్ డిపాజిట్ (RD) - తల్లిదండ్రులు ప్రతి నెలా చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు.  ఐదేళ్లు పాటు అందుబాటులో ఉంటుంది. వడ్డీ రేటు ఏడాది 5.8%. కనీస డిపాజిట్ పరిమితి రూ.100, కాల వ్యవధి ముగిసే వరకు డబ్బును విత్ డ్రా చేయలేరు.   

pixabay

సుకన్య సమృద్ధి యోజన(SSY)- ఇద్దరు అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. వడ్డీ రేటు 7.6%. కనీస డిపాజిట్ మొత్తం రూ.1,000, గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలు. తమ బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు మొత్తాన్ని విత్ డ్రా చేయలేరు. పిల్లలకు 21 ఏళ్లు నిండిన తర్వాత మెచ్యూరిటీ ప్రయోజనాలు లభిస్తాయి.

pixabay

కిసాన్ వికాస్ పత్ర (KVP)- ఇది గ్యారెంటీ ఆదాయంతో వచ్చే పోస్టాఫీసు పథకం. కనీస డిపాజిట్ మొత్తం రూ.1,000, లాక్-ఇన్ పీరియడ్ 30 రోజులు. వడ్డీ రేట్లు పన్ను పరిధిలోకి వస్తాయి కాబట్టి, తల్లిదండ్రులు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. 

pixabay

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా- ఈ పథకం కింద కనీస డిపాజిట్ రూ.1,000. పెట్టుబడిదారులు వడ్డీని ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌గా కూడా మార్చుకోవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయవలసి వచ్చినప్పుడు పన్ను మినహాయింపుల ప్రయోజనం ఉంటుంది.  

pixabay

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) - ఈ పథకంలో వార్షిక వడ్డీ రేటు 6.8%. ఇది ఐదు సంవత్సరాల కాలవ్యవధితో, కనీస డిపాజిట్ మొత్తం రూ.100. ఈ పథకం కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు ఉంటాయి.   

pixabay

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం-ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో ఈ పథకం అందుబాటులో ఉంది. ప్రస్తుత వడ్డీ రేటు 6.6%. డిపాజిట్లపై దీని కనీస, గరిష్ట పరిమితి రూ.1,000 నుంచి రూ.4.5 లక్షల మధ్య ఉంటుంది. ఒక సంవత్సరం వ్యవధిలోపు డబ్బును విత్‌డ్రా చేయలేరు. 

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels