Wisconsin school shooting : 17ఏళ్ల బాలిక చేతికి తుపాకీ- విస్కాన్సిస్​ స్కూల్​లో కాల్పుల మోత, ముగ్గురు..-wisconsin school shooting three dead 6 wounded juvenile suspect among victims ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Wisconsin School Shooting : 17ఏళ్ల బాలిక చేతికి తుపాకీ- విస్కాన్సిస్​ స్కూల్​లో కాల్పుల మోత, ముగ్గురు..

Wisconsin school shooting : 17ఏళ్ల బాలిక చేతికి తుపాకీ- విస్కాన్సిస్​ స్కూల్​లో కాల్పుల మోత, ముగ్గురు..

Sharath Chitturi HT Telugu

మాడిసన్​లోని విస్కాన్సిన్ పాఠశాలలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే నిందితురాలు, 17ఏళ్ల బాలిక మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

విస్కాన్సిస్​ స్కూల్​లో కాల్పుల మోత (AP)

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది! విస్కాన్సిన్ పాఠశాలలో ఓ మైనర్ విద్యార్థిని మరో ఇద్దరిపై కాల్పులకు తెగబడి, వారిని చంపేశాడు. విస్కాన్సిస్​ స్కూల్​లో కాల్పుల ఘటనలో నిందితుడు సైతం చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

అమెరికా స్కూల్​లో కాల్పుల మోత..!

రాష్ట్ర రాజధాని మాడిసన్​లో జరిగిన ఈ కాల్పుల్లో మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోయారని తొలుత చెప్పిన పోలీసులు ఆ తర్వాత ఆ సమాచారం తప్పని, మొత్తం మీద ముగ్గురు మరణించారని వివరించారు. మరో ఆరుగురు గాయపడినట్టు స్పష్టం చేశారు.

కిండర్​గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు సుమారు 400 మంది విద్యార్థులకు చదువుచెప్పే అబండెడ్ లైఫ్ క్రిస్టియన్ స్కూల్​లో ఈ కాల్పులు జరిగాయని మాడిసన్ పోలీస్ డిపార్ట్​మెంట్ తెలిపింది.

నిందితురాలు 17ఏళ్ల బాలిక అని, పాఠశాలలో జువైనల్ విద్యార్థిని అని పోలీసు శాఖ ఒక లిఖితపూర్వక ప్రకటనలో తెలిపింది. పోలీసులు వచ్చేసరికి కాల్పులు జరిపిన బాలిక పాఠశాలలో శవమై కనిపించింది.

ఘటనాస్థలి నుంచి ఆరుగురిని ఏరియా ఆస్పత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కాల్పులు జరిగాయని మాడిసన్ పోలీస్ చీఫ్ షాన్ బర్న్స్ తెలిపారు.

"ఈ రోజు మాడిసన్​కి మాత్రమే కాదు, మన మొత్తం దేశానికి విచారకరమైన రోజు. ఇక్కడ మా సమాజంలో హింస గురించి మాట్లాడటానికి మరొక పోలీసు చీఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాల్సి వస్తోంది," అని బర్న్స్ విలేకరులతో అన్నారు.

“ఆ భవనంలోని ప్రతి వ్యక్తి ఎప్పటికీ బాధితుడే. ఈ రకమైన గాయాల నుంచి కోలుకోలేము,” అని బర్న్స్​ ఆవేదన వ్యక్తం చేశారు.

ఘటనాస్థలం నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో పోలీసులు, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు కనిపించాయి.

స్కూళ్లల్లో కాల్పుల మోత నేపథ్యంలో తుపాకీ నియంత్రణ, పాఠశాల భద్రత వంటి అంశాలు యూఎస్​లో ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యలుగా మారాయి.

కే-12 స్కూల్ షూటింగ్ డేటాబేస్ వెబ్సైట్ ప్రకారం అమెరికాలో ఈ ఏడాది 322 స్కూల్స్​పై కాల్పుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ డేటాబేస్ ప్రకారం.. 1966 తర్వాత ఇది రెండవ అత్యధిక మొత్తం! 349 కాల్పులతో 2023 ఏడాది అగ్రస్థానంలో ఉంది.

పట్టణ, శివారు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ కాల్పుల ఘటనలు వణికిస్తున్నాయి. మార్చ్​ 2023 లో, నాష్విల్లేలోని ఒక ప్రైవేట్ అకాడమీ అయిన కన్వెన్షన్ స్కూల్లో ఒక మాజీ విద్యార్థి ముగ్గురు పిల్లలు, ముగ్గురు పెద్దలను చంపాడు. కాలిఫోర్నియాలోని ఓరోవిల్లే సమీపంలోని ఫెదర్ రివర్ అడ్వెంటిస్ట్ స్కూల్లో 5, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు విద్యార్థులను ఓ దుండగుడు కాల్చి చంపాడు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.