Telangana News Live December 17, 2024: Hyderabad : పుష్ప-2 ఎఫెక్ట్.. సంధ్య థియేటర్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు-today telangana news latest updates december 17 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live December 17, 2024: Hyderabad : పుష్ప-2 ఎఫెక్ట్.. సంధ్య థియేటర్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Hyderabad : పుష్ప-2 ఎఫెక్ట్.. సంధ్య థియేటర్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Telangana News Live December 17, 2024: Hyderabad : పుష్ప-2 ఎఫెక్ట్.. సంధ్య థియేటర్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు

12:15 PM ISTDec 17, 2024 05:45 PM HT Telugu Desk
  • Share on Facebook
12:15 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 17 Dec 202412:15 PM IST

తెలంగాణ News Live: Hyderabad : పుష్ప-2 ఎఫెక్ట్.. సంధ్య థియేటర్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు

  • Hyderabad : సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షాక్ ఇచ్చారు. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు ఇచ్చారు. తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఓ ప్రాణం పోయిందని.. మరో ప్రాణం కొట్టుమిట్టాడుతోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 17 Dec 202411:56 AM IST

తెలంగాణ News Live: TG Weather : తెలంగాణలో చలి పంజా, మరో రెండ్రోజుల పాటు శీతలగాలులు

  • TG Weather : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 17 Dec 202410:05 AM IST

తెలంగాణ News Live: KCR Landmarks : కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోతాయా..! కాంగ్రెస్ కష్టాలు కొని తెచ్చుకుంటోందా?

  • KCR Landmarks : రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారుకు ఏడాది నిండింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో చాలా వరకు సంతృప్తి వ్యక్తమవుతోంది. కానీ.. కొందరు చేసే పొలిటికల్ కామెంట్స్ రచ్చ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఆనవాళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 17 Dec 202409:14 AM IST

తెలంగాణ News Live: HYDRAA : మళ్లీ రంగంలోకి దిగిన రంగనాథ్.. వారికి వార్నింగ్.. పేదలకు భరోసా!

  • HYDRAA : కాస్త గ్యాప్ తర్వాత హైడ్రా టీమ్ మళ్లీ రంగంలోకి దిగింది. ఈసారి స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి చెరువులను పరిశీలించారు. ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాత ఇళ్లు, కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని పేదలకు భరోసా ఇచ్చారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 17 Dec 202407:53 AM IST

తెలంగాణ News Live: Adilabad Kawal Forest: ఆదిలాబాద్‌ కవ్వాల్ అభయారణ్యంలో విదేశీ పక్షుల సందడి, పర్యాటకులకు కనువిందు

  • Adilabad Kawal Forest: ఉమ్మడి ఆదిలాబాద్ లోని కవ్వాల్ అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల బర్డ్, బటర్ ఫ్లై వాక్ నిర్వహించారు. కాగా అడవిలో పలు అరుదైన పక్షులు పర్యటకులను కనువిందు చేశాయి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 17 Dec 202406:56 AM IST

తెలంగాణ News Live: Hyderabad : లక్షలు పోసి స్కూల్‌లో చేర్పిస్తే.. శవాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు! నారాయణ విద్యాసంస్థలో మరో విద్యార్థి సూసైడ్

  • Hyderabad : చదువు చిన్నారులకు జ్ఞానం పెంచాలి కానీ.. భారం అవ్వకూడదని ఎందరో మహానుభావులు చెబుతుంటారు. కానీ ప్రస్తుతం చదవంటే ఒత్తడిగా మారింది. దీంతో బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ముఖ్యంగా కార్పోరేట్ విద్యా సంస్థల్లో చదివే వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 17 Dec 202405:21 AM IST

తెలంగాణ News Live: Target KTR : కేటీఆర్ మెడపై వేలాడుతున్న అరెస్టు కత్తి.. రేవంత్ లక్ష్యం ఏంటీ? 10 ముఖ్యమైన అంశాలు

  • Target KTR : ఎముకలు కొరికే చలిలో.. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తెలంగాణ రాజకీయం అతి త్వరలో ఊహించని మలుపు తిరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు కారణం.. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించి, అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 17 Dec 202402:38 AM IST

తెలంగాణ News Live: TG Liquor Revenue: మద్యం అమ్మకాలతో తెలంగాణలో రూ.20వేల కోట్ల ఆదాయం, ఎనిమిది నెలల్లో రికార్డు స్థాయి ఆదాయం

  • TG Liquor Revenue: తెలంగాణలో మద్యం విక్రయాల ద్వారా ఎనిమిది నెలల్లో రూ.20వేల కోట్ల ఆదాయం సమకూరింది.  ఏప్రిల్ నుంచి నవంబర్‌ మధ్య కాలంలో మద్యం విక్రయాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్టు  తెలంగాణ అసెంబ్లీలో  ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 17 Dec 202412:27 AM IST

తెలంగాణ News Live: Jagityala ACB trap: జగిత్యాల జిల్లాలో ఏసిబి కి చిక్కిన ఫారెస్ట్ అధికారి..కర్ర రవాణాకు లంచం వసూలు

  • Jagityala ACB trap: జగిత్యాల జిల్లాలో అవినీతి అటవీశాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. కేవలం 4500 రూపాయలు లంచంగా తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. అవినీతి అటవీశాఖ అధికారిని అరెస్టు చేసిన ఏసిబి అధికారులు లంచం డబ్బులు సీజ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 17 Dec 202412:18 AM IST

తెలంగాణ News Live: Tgpsc Group2: గ్రూప్-2 పరీక్షకు హాజరైన వారి కంటే గైర్హాజరైన వారే ఎక్కువ... వెలిచాలకు సంబంధించి రెండు ప్రశ్నలు

  • Tgpsc Group2: కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరీక్షకు హాజరైన వారి కంటే హాజరు కాని వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 54 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా తొలి రోజు 49.22శాతం,రెండోరోజు 49శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.  
పూర్తి స్టోరీ చదవండి